సొనామార్గ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిలగ్రిడ్ నది లో నీళ్ళు ఎర్రగా ఉండడం వల్ల ప్రాచుర్యం చెందింది. ఈ ఎరుపు రంగు నీళ్ళ లో ఔషద గుణాలున్నాయని నమ్ముతారు. ప్రతి ఆదివారం ఈ నదిలో స్నానం చెయ్యడానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు. ఈ నది బాల్టిక్ కాలనీ లో ఉన్న ఇండస్ రివర్ లో సంగమిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు సమీపంలో ఉన్న క్రిష్ణసర్ లేక్ అలాగే విషన్సర్ లేక్ లని కూడా సందర్శిస్తారు.