Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » స్వామిమలై » వాతావరణం

స్వామిమలై వాతావరణం

ఉత్తమ కాలం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య స్వామిమలైని దర్శించటం మంచిది. అక్టోబర్ నెలలో దీపావళి పండుగ కన్నులపండుగగా జరుపుకుంటారు మరియు పర్యాటకులకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది, ఈ కాలంలో పైన చెప్పిన పండుగలను జరుపుకుంటారు.

వేసవి

వేసవికాలం: ఇక్కడ మార్చ్ నుండి మే నెల వరకు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. పర్యాటకులు ఏప్రిల్ మరియు మే నెలలలో దీనిని దర్శించటానికి అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో, ఎండ తీవ్రత ఎక్కువగా, చిటపటలాడుతూ, భరించలేనంతగా ఉంటుంది. అందువలన స్వామిమలై దేవాలయాల అత్యద్భుతమైన అందాన్నిఆస్వాదించలేరు.

వర్షాకాలం

వానాకాలం: ఈ వానాకాలంలో (జూన్ నుండి సెప్టెంబర్) సాధారణంగా జల్లులు పడుతూనే ఉంటాయి. స్వామిమలై, ఈ సమయంలో పురాతనకాలంనాటి సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఈ సమయంలో వాతావరణం తేమగా ఉన్నా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి పర్యాటకులు ఈ సమయంలో స్వామిమలై ని దర్శించటానికి అనుకూలంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: ఈ కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ నుండి 29 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మకర పొంగల్ మరియు థైపూయం వంటి పండుగలను జరుపుకుంటారు. ఈ సమయంలో హఠాత్తుగా చిరుజల్లులు పడుతూ ఉంటాయి, కాబట్టి వెంట ఒక గొడుగును ఉంచుకోవటం మంచిది.