Search
  • Follow NativePlanet
Share

టాబో - అందమైన దృశ్యాల పట్టణం!

18

హిమాచల్ ప్రదేశ్ లోని స్పీతీ లోయలో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం టాబో. సముద్ర మట్టానికి 3050 మీటర్ల ఎత్తున వుండే ఈ పట్టణం పర్యాటకులకు అందమైన దృశ్యాలను అందిస్తుంది. లాహౌల్ & స్పీతీ జిల్లాలో వున్న టాబో స్పీతీ నది ఒడ్డున చుట్టూ గోధుమ రంగు కొండల మధ్య వుంది.

వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన టాబో మఠం స్పీతీ లోయలోని అతి పెద్ద రాజ ప్రాసాద సముదాయం. ఇది సుమారు 6300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇటుక, మట్టి తో కట్టిన ప్రహరీ గోడతో చుట్టబడి వుంది. క్రీ.శ.996 లో నిర్మించిన ఈ మఠం లో 9 దేవాలయాలు, 23 చార్టేన్ లతో పాటు సన్యాసుల గదులు, సన్యాసినుల నివాసాలు కూడా వున్నాయి. ఈ మఠాన్ని సిద్ధాంత వృత్తం అని అర్ధం వచ్చేలా టాబో-చోస్-ఖోర్ అని కూడా పిలుస్తారు.

ఒక అద్భుతమైన నిర్మాణంగా భావించే ఈ మఠం ఇక్కడి అద్భుతమైన శిపాలు, స్టక్కో చిత్రాలు, అజంతా, ఎల్లోరా ల వంటి కుడ్య చిత్రాలకు ప్రసిద్ది చెందింది. అందువల్లే టాబో కు ‘హిమాలయాలలోని అజంతా’ అనే పేరొచ్చింది.

టిబెట్ లోని తోలింగ్ గోమపా పక్కనే వున్న టాబో లో ఇప్పటికీ పనిచేస్తున్న బౌద్ధ విహారం వుంది. ఇక్కడి చిత్రాలు 10, 11 శతాబ్దాల నాటివి. మరో వైపు, గుడి లోని చిత్రాలు 15 నుంచి 20 శతాబ్దాల మధ్య శైలిని ప్రతిబింబిస్తాయి. టిబెటన్, భారత శైలుల మిశ్రమ కేంద్రం గా టాబో ఇండో-టిబెటన్ శైలి గా పిలువబడే ఒక కొత్త శైలికి పుట్టిల్లైంది.

టాబో లోని పురాతన మఠం లోని జ్ఞాన దేవతల గుడి, బంగారు దేవాలయం, మార్మిక మండల దేవాలయం చెప్పుకోదగ్గవి. తుగ్-ల్హ-ఖంగ్ గా పిలువబడే జ్ఞాన దేవతళ గుడిలో ఒక సమావేశ మందిరం, గర్భాలయం, ప్రవేశ మండపం వున్నాయి. ఆదిబుద్దుడి ఐదుగురు ఆధ్యాత్మిక పుత్రులలో ఒకరైన వైరోచనుడి నాలుగు అంచెల విగ్రహం కూడా సమావేశ మందిరంలో వుంటుంది.

స్వచ్చమైన బంగారం తో అసలు నిర్మించిన బంగారు దేవాలయానికి 16 వ శతాబ్దంలో లడఖ్ పూర్వ రాజు సేన్గ్గే నామ్గ్యాల్ మార్పులు చేర్పులూ చేశాడు. ఉపదేశ దేవాలయం గా కూడా పిలువబడే మార్మిక మండల దేవాలయం ఎనిమిది మంది బోధిసత్వులు లేదా జ్ఞానుల మధ్య వున్న వైరోచనుడి పెద్ద చిత్రాన్ని ప్రదర్శిస్తుంది.

పెద్ద 20 అడుగుల ఎత్తున్న మైత్రేయ లేదా లాఫింగ్ బుద్ధుడు లేదా బుధ్ధా ఆఫ్ ద ఫ్యూచర్ విగ్రహానికి బోధిసత్వ మైత్రేయ దేవాలయం ప్రసిద్ది చెందింది. చెక్కిన దర్వాజాలు, అందమైన కుడ్య చిత్రాలు, బ్రోమ్-స్టోన్- ల్హ-ఖంగ్ గా పిలువబడే డ్రోంటన్ దేవాలయం లోని ప్రధాన ఆకర్షణలు. తరువాతి కాలంలో చేర్చబడ్డ డ్రోంటన్ పెద్ద దేవాలయం 70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వున్న టాబో విహారంలో వున్న రెండో అతిపెద్ద దేవాలయం. ఈ గుడి పోర్టికో, గూడు తో కలిపి మరో 42 చదరపు మీటర్ల విస్తీర్ణం వుంటుంది.

మహాకాల వజ్ర భైరవుడి దేవాలయాన్నే ‘భయానక దేవాలయం’ కూడా అంటారు. బౌద్ధంలోని గెలుక్పా శాఖకు చెందిన ఈ గుడి లో సంరక్షక దైవాల అసంఖ్యాకమైన విగ్రహాలు వున్నాయి కనుక ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. వివిధ దేవాలయాలతో పాటు ఈ టాబో విహారంలో జాల్మాగా పిలువబడే చిత్ర నిధి మందిరంలో అసంఖ్యాకమైన టిబెటన్ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.

వాయు, రైలు, రోడ్డు లాంటి ప్రధాన రవాణా మార్గాల ద్వారా టాబో చేరుకునే వీలుంది. 294 కిలోమీటర్ల దూరంలోని కులు ఇక్కడికి సమీప విమానాశ్రయం. మరో వైపు 452 కిలోమీటర్ల దూరంలోని కల్కా ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. మార్చ్ నుంచి జూన్ వరకు వుండే వేసవి కాలం లోనే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం చెప్పదగిన సూచన. శీతాకాలంలో విపరీతమైన మంచు వల్ల టాబో కు చేరుకోవడం కష్టం.

టాబో ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

టాబో వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం టాబో

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? టాబో

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: టాబో కి రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల నుండి స్థానిక బస్సు సర్వీసులు ఉన్నాయి. కాజా, టాబో మధ్య హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపబడుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: టాబో కి 452 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్కా సమీప రైలు కేంద్రం. ఈ స్టేషన్ కి ప్రధాన నగరాలైన డిల్లీ, బర్మేర్, బాంద్రా, అమృతసర్, హజరత్ నిజాముద్దీన్ నుండి రోజువారీ రైళ్ళు ఉన్నాయి. దూర౦పై ఆధారపడి, ఒక్కొక్కరికి రైలు ఖర్చు షుమారు 250 రూపాయల నుండి 600 రూపాయల వరకు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా టాబో ని చేరుకోవచ్చు. వాయుమార్గం ద్వారా: టాబో కి 294 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులు సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం డిల్లీ, ముంబై, షిమ్లా అనేక ఇతర నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం నుండి టాబో కి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి, ప్రయాణం 5 గంటలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed