Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » వాతావరణం

తేజ్ పూర్ వాతావరణం

తేజ్పూర్ లో వాతావరణం ఎడాదిపొడవునా ఒక మోస్తరుగా ఉండి పర్యటనకు అనుకూలంగా ఉంటుంది కావున పర్యాటకులు ఏ సమయంలోనైన ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. అయితే, వర్షాకాలం తరువాత వచ్చే అక్టోబర్, నవంబర్ సమయంలో తేజ్ పూర్ సందర్శనకు ఉత్తమ సమయం. ఈ సమయంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి, తేమ కూడా కొంచెం తగ్గి ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవి తేజ్ పూర్ లో వేసవి మార్చ్ నుండి జూన్ చివరి వరకు విస్తరించి ఉంటుంది. వేసవి సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల మధ్య ఉంటుంది. సంవత్సరంలో మే నెలలో చాలా వేడి వాతవరణంతో వేసవి ఆర్ద్రంగా ఉంటుంది. ఈ సమయంలో కాటన్ దుస్తులు తీసుకు వెళ్ళడం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం తేజ్ పూర్ లో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నైరుతీ రుతుపవనాల వల్ల ఈ ప్రదేశం విస్తారమైన వర్షపాతాన్ని కలిగిఉంటుంది. వర్షపాతం చెదురుమదురుగా ఉంటుంది కానీ వర్షం పాడినప్పుడు భారీ జల్లులు కురుస్తున్నాయి. పర్యాటకులు కేవలం 10 నిమిషాలలోనే భారీ వర్షాన్ని ఎదుర్కుంటే ఆశ్చర్యపోనఖ్ఖరలేదు.

చలికాలం

శీతాకాలం తేజ్ పూర్ లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు శీతాకాలలు. హిమాలయాల దిగువకు సమీపంలో ఉండడం వల్ల, ఈ ప్రదేశం శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా ఉండి కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదవుతుంది.