Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువళ్ళ » వాతావరణం

తిరువళ్ళ వాతావరణం

అత్యుత్తమ కాలం:తిరువల్ల లోనిది ఉష్నమండలీయ వాతావరణం. అయితే, ఇది ప్రకృతి ఒడి లో ఉండటం వల్ల వాతావరణ వైపరీత్యాలు ఉండవు. వాతావరణం ఆహ్లాదంగా ఉండే జనవరి నించి మార్చి నెలలు పర్యటనకి అత్యంత అనువు గా ఉంటాయి. మధ్యస్తమైన ఉష్ణోగ్రతలు మీకు స్వాగతం చెపుతాయి.

వేసవి

వేసవి:మే-జూన్ నెలలలో తిరవల్ల వచ్చే వేసవి వేడిగా తేమగా ఉంటుంది . ఎండాకాలం లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34 డిగ్రీల సెం.గ్రే నించి కనిష్ఠంగా 26 డిగ్రీల సెం.గ్రే దాకా ఉంటాయి. అధిక తేమ వల్ల వేసవి లో తిరువల్ల సందర్శించటం కష్టతరంగానే ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం:తిరువల్ల లో ఋతుపవనాల ప్రభావం ఎక్కుగానే ఉండటం వల్ల ప్రతి ఏడాది భారీ వర్షపాతం నమోదవుతుంది. జూన్-జూలై మొదలుకుని నాలుగు నెలలు వానల వల్ల పట్టణం వికసిస్తుంది. మీరు వర్షాకాలం లో ఇక్కడ పర్యటించాలనుకున్నట్టయితే పచ్చదనపు వేడుక మీకు కను విందు చేస్తుంది.

చలికాలం

శీతాకాలం:నవంబర్ నించి జనవరి దాకా తిరువల్ల లో చలికాలం కాపురముంటుంది. వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది.ఉష్ణోగ్రతలు గరిష్ఠంగాష్ఠంగాష్టంగా 34 డిగ్రీల సెం.గ్రే నించి కనిష్ఠంగా 26 డిగ్రీల సెం.గ్రే దాకా ఉంటాయి 24 డిగ్రీల సెం.గ్రే నించి కనిష్ఠంగా 18 డిగ్రీల సెం.గ్రే వరకు ఉంటాయి. ఈ సమయం లో మీరు ఇక్కడకి రావాలనుకుంటే ఉన్ని దుస్తులు తీసుకురావటం శ్రేయస్కరం.