తిరువంతపురం నుండి 10 కి.మీ. దూరంలో అక్కులం సరస్సు ఉంది.ఇది మంచి పిక్నిక్ స్పాట్.ఇది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది.అక్కులం సరస్సు లో మనం బోటింగ్ చేయవచ్చు.అప్పుడు మనకు చల్లని గాలులు, నీటి మీద అలలు ఎంతో హాయిని కలిగిస్తాయి.అక్కులం సరస్సు నిజానికి వేలి సరస్సు యొక్క బాగం. ఇది సెలయేరు,అరేబియా సముద్రం కలిసే కూడలిలో ఉంది. ఇక్కడ బస చేయటానికి రిసార్ట్స్ ఉన్నాయి.ఈత, వాటర్ స్పోర్ట్స్ మొదలైన అనేక రకలైన క్రీడలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications