Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » వాతావరణం

తిరువారూర్ వాతావరణం

ఉత్తమ సమయం :వర్షాకాలంలోను, శీతాకాలంలోనూ తిరువరూర్ సందర్శన ఉత్తమం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా శీతాకాలం వుంటాయి. ఈ రెండు కాలాలు తిరువరూర్ సందర్శించడానికి అనువుగా వుంటాయి. వేఅవి చాలా వేడిగా ఉన్నప్పటికీ, తిరువరూర్ పర్యటనకు వెళ్ళడానికి అనువుగానే వుంటుంది.

వేసవి

వేసవి :తిరువరూర్ లో ఏప్రిల్ మే నెలల్లో వేసవి వుంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా, భరించలేనంత వేడిగా వుంటాయి కాబట్టి ఈ ప్రాంత సందర్శన అంత మంచిది కాదు. ఉష్ణోగ్రత గరిష్టంగా 42 డిగ్రీల దాకా వుండగా, కనిష్టంగా 32 డిగ్రీలు ఉంటుంది. ఈ కాలంలో వేడి వల్ల పర్యాటకులు ఇక్కడికి రారు.

వర్షాకాలం

వర్షాకాలం :జూన్ నుంచి సెప్టెంబర్ దాకా తిరువరూర్ లో వర్షాకాలం నడుస్తు౦ది. తిరువరూర్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం వుంటుంది. వర్షాకాలంలో పచ్చదనం దండిగా వుంటుంది. ఈ కాలంలో తిరువరూర్ చూడడం చాలా చెప్పదగినది.

చలికాలం

శీతాకాలం :తిరువరూర్ లో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా శీతాకాలం. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా వుంటాయి. ఈ కాలంలో తిరువరూర్ సందర్శించడం మంచిది. ఉష్ణోగ్రతలు 23 – 30 డిగ్రీల మధ్య వుంటాయి.