Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూథుకుడి » వాతావరణం

తూథుకుడి వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు తూథుకుడి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఆహ్లాదకరమైన వాతావరణం తో పర్యాటకులు అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు.

వేసవి

ఎండాకాలం తూథుకుడి లోని ఎండాకాలం అమితమైన వేడి కలిగి ఉంటుంది. తేమతో పాటు వాతావరణం కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూలై వరకు వాతావరణం వేడి తేమలతో ఉంటుంది. ఈ సమయం లో ఇక్కడ 30 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ ల మధ్యలో ఉష్నోగ్రత నమోదవుతుంది. అసౌకర్యవంతమైన వాతావరణ కారణాల రీత్యా ఈ సమయంలో ఈ ప్రాంతం సందర్శించడం ఉత్తమంకాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతుంది. ఆగష్టు నుండి అక్టోబర్ వరకు వర్షాకాల ప్రభావం ఉంటుంది. పర్యాటకులకు భారీ వర్షాలు అడ్డంకిగా మారవచ్చు. అయినప్పటికీ, ఈ సమయం లో ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే వారు ఒక రైన్ కోట్ ని వెంట తెచ్చు కోవాలి.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి జనవరి వరకు తూథుకుడి లో శీతాకాలం. ఈ సమయం లో ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఇది అనువైన సమయం.