వాయుమార్గం ద్వారా తిరునల్వేలికి మధురై విమానాశ్రయం అతి దగ్గరగా ఉంది. ఈ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. మధురై వరకు విమానంలో వచ్చి అక్కడి నుండి రోడ్డు లేదా రైలు మార్గాన వెళ్ళడం ఆచరణయోగ్యమైన విషయం. మధురై నుండి తిరునల్వేలికు 154 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్లను బాగా నిర్వహిస్తునందువలన ఈ ప్రయాణానికి రెండున్నర గంటల సమయం పడ్తుంది.