Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తోరన్మల్

తోరన్మల్ -  ఆకర్షణీయమైన కొండ ప్రాంతం

10

మహారాష్ట్ర లోని నందూర్బార్ జిల్లాలో వున్న చిన్న కొండ ప్రాంతం తోరన్మల్. సాత్పురా పర్వత శ్రేణుల్లో వున్న ఈ యాత్రా స్థలం సముద్ర మట్టానికి 1150 మీటర్ల ఎత్తున వుంది. కేవలం 44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తోరన్మల్ ప్రధానంగా ఒక మైదాన ప్రాంతం.

తోర్నా చెట్టు నుంచి ఈ కొండ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో దట్టంగా వున్న తోర్నా చెట్లను ఇక్కడి గిరిజన తెగల వారు సంతాన దేవత తోర్నా దేవి గా పూజించేవారు.

ఇక్కడి చాలా ఆకర్షణల్లో యశ్వంత్ చెరువు యాత్రికులని సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. ఇక్కడ గోరఖ్ నాథ్, నాగార్జున దేవాలయాల్లాంటి చాలా గుళ్ళు వున్నాయి. సితాఖాయి మీరు తప్పక చూడాల్సిన లోయ ప్రాంతం కాగా, ఖడ్కీ పాయింట్, సన్ సెట్ పాయింట్ల నుంచి పరిసర ప్రాంతాల మనోహర దృశ్యాలు చూడవచ్చు.

తోరన్మల్ ఎందుకు చూడాలి?

ఒక కొండపైన ఉండడంతో తోరన్మల్ లో ఏడాది పొడవునా చక్కటి వాతావరణం వుంటుంది. అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానం చేసి వుండడం వలన ఇక్కడికి అనుకున్నదే తడవుగా వెళ్లిపోవచ్చు.

చుట్టూ కొండలతో పచ్చని కీకారణ్యం లా వుండే తోరన్మల్ మహారాష్ట్రలో రెండో అతి శీతల కొండ ప్రాంతంగా పేరుపొందింది. ఇక్కడ అందమైన సరస్సులు, మనోహరమైన దృశ్యాలు వుంటాయి, పర్వతారోహకులకు ఆనందం కలిగించే పర్వత మార్గాలు సరే సరి. నగరం హడావిడికి దూరంగా ప్రశాంతత ను అనుభవించడానికి ఈ చిన్ని కొండ ప్రాంతాన్నితప్పక సందర్శించండి.

తోరన్మల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తోరన్మల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తోరన్మల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తోరన్మల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం మహారాష్ట్రలోను, వెలుపల వున్న ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి చాల బస్సు సర్వీసులు అందుబాటులో వున్నాయి. తోరన్మల్ నుంచి హైదరాబాద్, పూణే, ముంబై ల మధ్య నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తిరుగుతూనే వుంటాయి. మీరు ఎంచుకున్న బస్సుని బట్టి చార్జీ వుంటుంది. ఏ సి బస్సుకు సుమారు 500 రూపాయలు అవుతుంది. తోరన్మల్ ముంబై నుంచి 500 కిలోమీటర్ల దూరంలో వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం తోరన్మల్ కు దగ్గరి రైల్వే స్టేషన్ నందూర్బార్. ఇది 75 కిలోమీటర్ల దూరంలో సూరత్-భూసావాల్ పశ్చిమ రైల్వే లైన్ లో వుంది. 141 కిలోమీటర్ల దూరంలో వున్న ధూలే, రైల్లో రావడానికి మరో మార్గం. నందూర్బార్ నుంచి చెన్నై, అహ్మదాబాద్, ముంబై, అమరావతి, సూరత్ లాంటి ప్రధాన నగరాలకు రైలు సర్వీసులు అందుబాటులో వున్నాయి. సగటు రైల్వే చార్జీ సుమారు 150 నుంచి 200 రూపాయలు అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం 300 కిలోమీటర్ల దూరంలో వున్న ఔరంగాబాద్ ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. వివిధ కాబ్ సేవల ద్వారా విమానాశ్రయం నుంచి తోరన్మల్ చేరుకోవచ్చు. ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి దగ్గరే. ఈ రెండు విమానాశ్రయాలు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ నిత్య విమాన సేవల ద్వారా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి వున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed

Near by City