ఆంధ్రప్రదేశ్‌లోని సుందరమైన తీరప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శాలిహుండంకి సెప్టెంబర్ మాసంలో కుటుంబసమేతంగా ప్రయాణం చేయడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పురాతన బౌద్ధ ప్రదేశం చరిత్ర మరియు ప్రకృతి సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది. శాలిహుండంలో ప్రాంతంలో గడిపే ప్రతిక్షణం జీవితంలో మరపురాని అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం.. కుటుంబసమేతంగా శాలిహుండం విహారానికి వెళ్లాలనుకునేవారు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విశేషాలను చూసేద్దామా?!
శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలోని గార మండలంలో ఉంది శాలిహుండం గ్రామం. ఇక్కడి వంశధార నదికి దక్షిణ ఒడ్డున ఈ చిన్న గ్రామం ఉంటుంది. దీనిని సాలివాటిక అంటే బియ్యం ఎంపోరియం అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, చాలామంది దీనిని సల్యపేటిక (ఎముకలు లేదా అవశేషాల పెట్టె అర్ధం) అని పిలిచేవారన్న ప్రచారం కూడా ఉంది. సుందరమైన ప్రకృతి అందాల మధ్య అనేక పురాతన బౌద్ధ స్థూపాలు, కొండపై భారీ సన్యాసుల సముదాయాలతో చరిత్రకారులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

ప్రవేశ ద్వారం వద్ద మ్యూజియం..
పురావస్తుశాఖ చెబుతున్న దానిని బట్టీ.. క్రీస్తు శకం రెండో శతాబ్దంలో శాలివాహనుల కాలంలో ఈ శాలిహుండం కొండపైన బౌద్ధ ఆరామాలు నిర్మించారట. ఇక్కడ బౌద్ధ చైతన్యం.. హీన యానం మహాయానంగా విడిపోయిన కాలంలో ఏర్పాటు చేయబడింది. శాలిహుండం ప్రాంతంలో వెలికితీసిన అనేక శాసనాలు 2వ శతాబ్దం CE నాటివని స్పష్టం చేశాయి. కొండ దిగువ భాగంలో శాలిహుండం ప్రవేశ ద్వారం వద్ద ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడ చతుర్భుజ అపరాజిత, భవిష్య బుద్ధ, ధ్యాన బుద్ధ, షడ్ భుజ మారేచి, దుర్గ ప్రతిమలు వంటి అనేక చారిత్రక ఆధారాలు దర్శనమిస్తాయి. ఇక్కడి మ్యూజియంలో చుట్టుపక్కల పురావస్తుశాఖ తవ్వకాలలో బయటపడిన అనేక శిల్పాలను భద్రపరిచారు. మ్యూజియం సందర్శనకు నామమాత్రపు ధర కలిగిన టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

కొండపైన ఉన్న ప్రధాన స్థూపం
ఈ శాలిహుండంలో ఒక కాలచక్రం వంటశాలలుగా ఉపయోగించబడే అనేక గదులు, ధ్యాన గది,బౌధ స్థూపం కూడా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే, కొండపైన ఉన్న ప్రధాన స్థూపం 46 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. మహా విహార సాలి-పేతక, ఆసక్తికరంగా, స్వస్తిక ఆకారంలో ఉండే ప్రవేశద్వారం ఎంతో ఆకర్షణీయంగా సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తారసపడుతుంది. పురావస్తు అధ్యయనం ప్రకారం.. ఇది సుమత్రా, ఆగ్నేయాసియాలోని మిగిలిన ప్రాంతాలకు బౌద్ధమతం వ్యాపించిందని సూచించేందుకు అని అంచనా.

ఆహ్లాదకరమైన వాతావరణం..
పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించిన ఇక్కడి నిర్మాణ శైలి ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొండపైనుంచి చూస్తే పరవళ్లు తొక్కే వంశధార నది.. చుట్టూ పచ్చదనంతో నిండిన ప్రకృతి అందాలు మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకూ ఇక్కడ పర్యాటకానికి ఎంతో అనువుగా ఉంటుంది. అలాగే, శాలిహుండం చేరుకునేందుకు రవాణా సౌకర్యం కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఆర్‌టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. టాక్సీలు, ఆటోలు నిత్యం దొరుకుతాయి. కుటుంబసమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే వెంటనే శాలిహుండం బయలుదేరండి!



Click it and Unblock the Notifications












