Search
  • Follow NativePlanet
Share
» »పురాతన ఢిల్లీ ...చారిత్రక మార్కెట్ లు !

పురాతన ఢిల్లీ ...చారిత్రక మార్కెట్ లు !

నేటి ఢిల్లీ నగరం ఎంతో అభివృద్ధి చెందినది. దేశానికి రాజధానిగా రాజకీయ వ్యవహారాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. అయితే, ఢిల్లీ చరిత్రలోకి ఒక్క సారి గతంలోకి అంటే సుమారు 17 లేదా 18శతాబ్దాల నాటి ఢిల్లీ లో కొన్నివాణిజ్య, ఇతర ప్రదేశాలు ఎలా ఉండేవి ? అవి నేటికీ కొనసాగుతున్నాయా అనేది పరిశీలిస్తే...పురాతన ఢిల్లీ ని ఒకప్పుడు షా జహాన్ బాద్ అనేవారు. ఈ ప్రాంతం లోకి వెళ్ళాలంటే, మెట్రో ఎక్కి చాంద్ ని చౌక్ లో దిగి నడక సాగించండి.

జామా మసీద్

జామా మసీద్

ఢిల్లీ లోని జామా మసీద్ లేదా మసీద్ ఐ జహాన్ నూమా ఇండియా లోని ప్రసిద్ధ మసీదు లలో ఒకటి. దీనిని 1650 సంవత్సరంలో మొగల్ చక్రవర్తి షా జహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం సుమారు ఆరు సంవత్సరాల కాలం పట్టింది. దీనిలో ఒకేసారి సుమారు ఇరవై అయిదు వేలమంది ప్రార్ధన చేయవచ్చు. ఈ మసీదులో పురాతన ఖురాన్ ప్రతి ఒకటి జింక చర్మం పై వ్రాసినది కలదు.

Pic credit:russbowling

దిగంబర్ జైన్ టెంపుల్ & బర్డ్స్ హాస్పిటల్

దిగంబర్ జైన్ టెంపుల్ & బర్డ్స్ హాస్పిటల్

ఢిల్లీ లో అతి పురాతన జైన్ టెంపుల్ ఇది. రెడ్ ఫోర్ట్ ఎదురుగా వుంటుంది. ఇదే కాంప్లెక్స్ లో పక్షులకు ఒక హాస్పిటల్ కూడా కలదు.

చురి వాలి గాలి

చురి వాలి గాలి

చురి వాలి గాలి అంటే గాజుల వీధి అని అర్ధం. ఇది షా జహాన్ చక్రవర్తి కాలం నాటిది. కాల క్రమేనా దీని శోభ తగ్గినప్పటికీ, ఇప్పటికీ కొంత అందమైన గాజుల మార్కెట్ ఇక్కడ కలదు. అమ్మకాలు జోరుగానే కొనసాగుతూ వుంటాయి.

photo credit: Supratim Ghosh

దరిబా కలాన్

దరిబా కలాన్

ఇది ఆసియా లోనే అతి పెద్ద జ్యువలరీ మార్కెట్. ఇక్కడి షాపులు సుమారు 19 వ శతాబ్దం నాటివిగా చెపుతారు. నగలు హోల్ సేల్ గా కొనాలంటే, ఈ ప్రదేశం సరైనది. ఈ వీధి మొదటిలో రుచికరమైన జిలేబి వేడి వేడిగా తిని ఆనందించవచ్చు.

కినారి బజార్

కినారి బజార్

దరీబా కలాన్ నుండి ఒక గల్లీ లోకి కుడివైపుగా వెళితే, కినారి బజార్ వస్తుంది. పెండ్లి కి సంబంధించిన వస్తువులు ఏవి కొనాలనుకున్నా మీకు ఇక్కడ అతి సరసమైన ధరలలో దొరుకుతాయి.

చావరి బజార్

చావరి బజార్

దీనిని నేడు చాలామంది మెట్రో స్టాప్ అని అంటారు. ఒకప్పుడు ఈ బజార్ లో ఎంతో వైభవంగా, కవిత్వం, పాన్ తినటం, కళా కారుల ప్రేమ లు విలసిల్లేవి. గొప్ప కుటుంబాలకు చెందిన యువకులు ఈ ఆనందాలు అనుభవించేవారు. ఇపుడు ఇది ఒక వాణిజ్య ప్రదేశంగా మారి వెడ్డింగ్ కార్డు లకు గొప్ప ప్రదేశం అయింది.

పరోటాల వీధి

పరోటాల వీధి

సుమారు 1870 లలో ఇక్కడ పరోటా లు అమ్మే షాపులు ఈ వీధిలో రాక మునుపు ఇక్కడ వెండి వస్తువుల దుకాణాలు ఉండేవి. ఇపుడు ఈ వీధి రుచికరమైన పరోటా లకు ప్రసిద్ధి చెందినది. ఎంతో గొప్పవారు అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రు సైతం ఈ వీధిలో పరోటాలు తినేవారని ప్రజలు చెపుతారు.

కరీం ఫుడ్స్ రెస్టారెంట్

కరీం ఫుడ్స్ రెస్టారెంట్

కరీం ఫుడ్స్ రెస్టారెంట్ జామా మసీద్ సమీపంలో కలదు. ఈ ఏరియా లో ఈ రెస్టారెంట్ వివిధ రకాల తినుబందారాలకు ప్రసిద్ధి. మంచి రుచికల మొగలాయీ వంటకాలు ఇక్కడ మీకు అందుబాటులో వుంటాయి.

గురుద్వారా సీష్ గంజ్

గురుద్వారా సీష్ గంజ్

గురుద్వారా షీష్ గంజ్ సాహిబ్ ఢిల్లీ లోని తొమ్మిది గురుద్వారాలలో ఒకటి. ఈ ప్రదేశంలో మొగల్ చక్రవర్తి ఔరంగ్ జేబ్ సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేజ్ బహదూర్ కు ఆయన ఇస్లాం మతానికి మారనందున 1675 లో మరణ శాసనం విధించాడు.

బంగారు మసీదు

బంగారు మసీదు

బంగారు మసీదు లేదా సున్హేరి మసీద్ ఒకప్పుడు చాలా ప్రసిద్ధి. ఇది గురుద్వారా కు సమీపంగా 1721 లో నిర్మించబడింది. ప్రస్తుతం ఈ మసీదు చట్ట బద్ధం కాని ఆక్రమణలను ఎదుర్కొంటోంది.

బల్లి మారన్

బల్లి మారన్

బల్లి మారన్ ప్రదేశంలో ప్రసిద్ధ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ నివాసం కలదు. ఇపుడు ఈ ప్రదేశంలో కళ్ళ జోళ్ళ దుకాణాలు, ఆగ్రా లో తయారు చేసిన లెదర్ షూస్ వంటి వస్తువులు అమ్మబడుతున్నాయి.

Pic credit: Wiki Commons

చున్నామల్ హవేలీ

చున్నామల్ హవేలీ

చున్నామల్ హవేలీ అనేది ఒక పెద్ద విలాసవంతమైన ధనిక వ్యాపారి రాయ్ లాలా చున్నామల్ కు చెందినభవనం. ఈ వ్యాపారి 19 వ శతాబ్దానికి చెందినవాడు. హవేలీ నిర్మాణ శైలి ఆకర్షణీయంగా వుంటుంది.

ఖారి బవోలి

ఖారి బవోలి

ఇది పురాతన ఢిల్లీ లో మరొక వీధి. ఈ ప్రదేశం హోల్సేల్ కిరాణా సరకులకు ప్రసిద్ధి. ఈ మార్కెట్ సుగంధ ద్రవ్యాలకు ఆసియా లోనే అతి పెద్ద మార్కెట్ గా పేరు పడింది. ఈ మార్కెట్ కూడా 17 వ శతాబ్దం నాటి నుండి వుందని చెపుతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+