అలనాటి రాచరికపు వైభవానికి ప్రతీక.. బస్తర్ ప్యాలెస్!
బస్తర్ ప్యాలెస్ అలనాటి రాచరికపు వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. పూర్వపు కాలం నాటి చారిత్రక కళాఖండాలు, వస్తువులను సంరక్షించడంలో ఈ ప్యాలెస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభవాన్ని పొందడానికి మరియు బస్తర్ యొక్క గొప్ప చరిత్రను తెలుసుకోవడానికి ప్యాలెస్‌ను ఒక్కసారి అయినా సందర్శించాల్సిందే.
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న బస్తర్ ప్యాలెస్ ఒక చారిత్రాత్మక నిర్మాణం. ఈ ప్రదేశం ఛత్తీస్‌గఢ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుపొందింది. ప్యాలెస్ ప్రాంగణంలో పురాతన కళాఖండాలు మరియు అలనాటి వస్తువులు భద్రపరచబడ్డాయి. ప్యాలెస్ యొక్క నిర్మాణశైలి పర్యాటకులను ఆకర్షిస్తుంది. అందుకే, ఈ ప్యాలెస్ ఏ సీజన్‌లో అయినా సందర్శించడానికి ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిలబడింది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు చక్కగా అలంకరించబడిన మ్యూజియం సాధర ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడి పూర్వ కాలానికి చెందిన కళాఖండాలు, పెయింటింగ్‌లు, ఇతర వస్తువులను చూసిన క్షణాన అలనాటి చరిత్రకు మనం చేరువయ్యామనే భావన కలుగుతుంది.

గోడలపై సంక్లిష్టమైన చిత్రాలు..
బస్తర్ ప్యాలెస్ నిర్మించబడిన శైలిని పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ప్యాలెస్ యొక్క అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. ప్యాలెస్ లోపల సందర్శకులు డివైడర్లు మరియు ప్యాలెస్ గదుల గోడలపై సంక్లిష్టమైన చిత్రాలను కనుగొనవచ్చు. ఈ చెక్కడాలు ఉన్న రాజభవనం యొక్క శిల్పకళ అలాగే శిల్పాలతో కూడిన భారీ స్తంభాలు చారిత్రక యుగం యొక్క వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక్కడ ఎదురయ్యే ప్రతి నిర్మాణంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ చెక్కు చెదరని ఆ నిర్మాణ శైలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

శీతాకాలమే బెటర్..
ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా ఈ రాజభవనం వెలిగిపోతుంది. ప్యాలెస్ వెలుపల ఆకుపచ్చని గార్డెన్ అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. వీటిలో వివిధ రకాల వృక్షాలు ఉన్నాయి. ఇవి పరిసరాల దృశ్య సౌందర్యాన్ని రెండింతలు చేసేందుకు సహాయపడతాయి. బస్తర్ ప్రాంత వాతావరణ పరిస్థితులను అంచనా వేయటం కాస్త కష్టమే. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం శీతాకాలం. ఈ సీజన్‌లో వాతావరణం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 12 నుండి 28 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అలాగే, శీతాకాలంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుండటం వల్ల పర్యటన చాలా కష్టతరంగా ఉంటుంది.

సమీపంలో చాలా పర్యాటక ప్రదేశాలు..
బస్తర్ ప్యాలెస్ అనేక ఇతర పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉంది. వీటిలో చిత్రకోట్ జలపాతం, కోటుమ్‌సర్ గుహ, దల్పత్ సాగర్ సరస్సు, తీరత్‌ఘర్ జలపాతం మరియు కైలాష్ గుహలు లాంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ప్యాలెస్‌కి చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే, ఈ ప్యాలెస్ నగరానికి బాగా అనుసంధానించబడి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే రహదారులకు చేరువగా ఉండటం వల్ల బస్తర్ ప్యాలెస్‌ని సందర్శించడం ప్రజలకు సులభతరం. బస్సులు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్ మరియు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా రోడ్డు ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ జగదల్పూర్ స్టేషన్. ఇది ప్యాలెస్ నుండి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications












