Search
  • Follow NativePlanet
Share
» »దేశ సంస్కృతుల స‌మ్మేళనం.. స‌ర‌స్ మేళా 2023

దేశ సంస్కృతుల స‌మ్మేళనం.. స‌ర‌స్ మేళా 2023

దేశ సంస్కృతుల స‌మ్మేళనం.. స‌ర‌స్ మేళా 2023

ఈ సరస్ మేళా ఏటా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నిర్వహించబడుతోంది. ఇది సాంస్కృతిక కార్యక్రమాలతో ఔత్సాహికుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. ఢిల్లీ NCR మరియు దాని పరిసర ప్రాంతాల ప్రజల కోసం సరస్ మేళా రూపుదిద్దుకుంది. ఈ ఫెయిర్‌ను ఆస్వాదించడానికి, మీరు నోయిడా వెళ్లాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమై మార్చి 5 వరకు కొనసాగుతుంది. ఇప్ప‌టికే ప్ర‌తిరోజూ నోయిడా ప్రాంతంలో ఓ పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

sarasmela-2023

ప్ర‌త్యేక‌ ఆకర్షణ

ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఫెయిర్‌కు అన్ని రాష్ట్రాల ప్రజలూ వివిధ రకాల కళలు మరియు హస్తకళల ప్రదర్శనతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ సంత‌రించుకునేలా చేస్తుంది. అదే ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా కూడా నిలుస్తోంది. ఇది అనేక స్టాల్స్ మరియు ప్రదర్శనలతో కుటుంబ‌స‌మేతంగా స‌మ‌యాన్ని గడిపేందుకు వేదిక‌గా నిలుస్తుంది.

ఈ సంవత్సరం సరస్ మేళాలో మూడు వంద‌ల మంది గ్రామీణ కళాకారులు బహుళ సంస్కృతులతో వారి హస్తకళలను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టుల‌తో జ‌న‌సంద్రాంగా క‌నిపించే ఈ ప్రాగంణంలో 85కి పైగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. మ‌రీ ముఖ్యంగా క‌ళాకారుల వ‌స్త్రాలంక‌ర‌ణ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.

sarasmela-2023

సరస్ మేళా 2023 సమయం

నోయిడా సరస్ మేళా 2023 ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ జాతరను ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 11 నుండి రాత్రి 9:30 వరకు ఈ ఫెయిర్ నిర్వ‌హిస్తారు. నోయిడాలోని సరస్ మేళా చేరుకోవడానికి, మీరు నోయిడా సిటీ సెంటర్ సమీపంలోని సెక్టార్ 33Aలో ఉన్న నోయిడా హాట్‌కి వెళ్లాలి.

ప్రవేశానికి ఎటువంటి రుసుము లేదా టిక్కెట్ లేదు. పార్కింగ్ కోసం కూడా ఎటువంటి రుసుము లేదు. మీరు ఎక్కడ కొనుగోలు చేస్తారో ఆ స్టాల్స్‌లో మాత్రమే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల‌తోపాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫెయిర్‌కు ఔత్సాహిక‌లు ఫిబ్ర‌వ‌రిలో చేరుకుంటారంటే దీని ప్ర‌త్యేక ఏంటో అర్థ‌మైపోతుంది.

ఫెస్టివల్‌ స్టాల్స్‌లో ఏముంది?

నోయిడా హాట్‌లోని సరస్ మేళా 2023 దూర‌ప్రాంతాల నుంచి వ‌చ్చే వ్యాపారుల‌ కళాకృతులు మరియు హస్తకళలను ప్రదర్శించేలా అనేక మంది గ్రామీణ మహిళా కళాకారులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చేవారికి ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌బ‌డిన వేరు వేరు స్టాల్స్‌ను కేటాయించేలా రూపొందంచ‌బ‌డింది. ఇక్క‌డ దేశ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన ప్ర‌దేశాల‌కు చెందిన అనేక ర‌కాల‌ దుస్తులు, పాదరక్షలు, ఉపకరణాలతో సహా ప్రత్యేక హస్తకళలు విడిదిచేసే కేంద్రంలా క‌నిపిస్తుంది.

sarasmela-2023

స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు ఇక్క‌డ అన్నీ అందుబాటులో ఉంటాయి. అదనంగా, సరస్ మేళా 2023లో దేశవ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందే వంటకాలను అస్స‌లు మిస్స‌వ్వొద్దు. ఇక్క‌డి ఫుడ్ కోర్టుల‌లో వివిధ రాష్ట్రాల నుండి వ‌చ్చేవారి విభిన్న స్టాల్స్‌తో మీకు భారతదేశపు అన్నిర‌కాల రుచినీ అందిస్తారు. మ‌రెందుకు ఆల‌స్యం మీరూ స‌ర‌స్ మేళా అనుభూతుల‌ను ఆస్వాదించేందుకు కుటుంబ‌స‌మేతంగా బ‌య‌లుదేరండి.

More News

Read more about: saras mela 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+