Search
  • Follow NativePlanet
Share

నోయిడా - అభివృద్ధికి మరోపేరు !

17

న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధారిటీ కి నోయిడా సంక్షిప్త నామం. నోయిడా నిర్వాహణా సంస్థ పేరు కూడా అదే. 17 ఏప్రిల్ 1976 లో ఈ సంస్థ ప్రారంభమయ్యింది. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 17 ని "నోయిడా డే" గా జరుపుకుంటారు.

ఇండియా ఐటీ కెంద్రం

నోయిడా ఉత్తర్ ప్రదేశ్ గౌతం బుద్ధా నగర్ జిల్లాలో ఉంది. దీని పరిపాలన కి సంబంధించిన ప్రధాన కార్యాలయం దగ్గరలోని పట్టణమయిన గ్రేటర్ నోయిడా లో ఉంది. గుర్గావ్ తో పాటు నోయిడా కూడా ఇప్పుడు ఐ.టీ. కేంద్రంగా విరాజిల్లుతోంది. దాదాపు అన్ని మల్టీ నేషనల్ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఐబీఎం,మిరాకిల్,ఫూజిట్సు,ఏఓఎన్ ,హెవిట్,ఎబిక్స్,సీఎస్సీ,ట్రిబల్ ఫ్యూజన్ టీసీఎస్,విప్రో, హెచ్సీఎల్,తెక్ మహీంద్రా,ఎడోబీ,డెల్ కంపెనీలు మచ్చుకు కొన్ని. చాలా కంపెనీలు నోయిడాని తమ ప్రధాన కార్యాలయ కేంద్రంగా చేసుకోవడానికి ముఖ్య కారణం ఇక్కడ కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏర్పడే సెజ్ హోదా యే. న్యూఢిల్లీ కి దగ్గరగా ఉండటం కూడా మరొక ముఖ్య కారణం. భారత దేశంలో ఐ.టీ.పరిశ్రమ ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ కూడా ఇక్కడే ఉంది.

నోయిడా కీర్తికి మరొక కారణం సందీప్ మార్వాచే స్థాపించబడ్డ ఫిలిం సిటీ. ఇ ప్పుడు ఈ ఫిలింసిటీ అనేక చానెల్స్ కి ముఖ్య కేంద్రం. ఎండీ టీవీ,టి వి టుడే గ్రూప్,సీ ఎన్ ఎన్-ఐబీ ఎన్,జీ న్యూస్ మరియు సీ ఎన్ బీ సీ లు ఇక్కడ ఉన్నాయి. ఇంకా నోయిడా అనేక ఇష్టాగోష్టులు,సమావేశాలకి ముఖ్య కేంద్రం కూడా. ఢిల్లీ అంతర్జాతీయ ఎక్స్పో సెంటర్ లో ఉన్న అతి పెద్ద ఎగ్జిబిషన్ వేదికైన ఇండియన్ ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్(ఐ.ఈ.సీ.ఎం.)కూడా ఉంది.

నోయిడా మెట్రో రైలు ద్వారా ఢిల్లీకి కలపబడి ఉంది. ఇంకా అనేక షాపింగ్ మాల్స్,గ్రేట్ ఇండియా ప్లేస్ లాంటి మల్టీప్లెక్స్ లు కూడా ఉన్నాయి. నోయిడా అనేక ఇష్టాగోష్టులు,సమావేశాలు,ఎక్జిబిషన్ పరిశ్రమల కి ముఖ్య కేంద్రం. ఐ.ఈ.సీ.ఎం. 2015 కల్లా 400 గదులతో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ ని నిర్మించడానికి ప్రణాళిక రచిస్తోంది.

పరిశుభ్రత విషయంలో నోయిడా భారత దేశంలో 17 వ స్థానాన్ని ఆక్రమిస్తే గుర్గావ్ 87 వస్థానాన్ని ఆక్రమించి పరిశుభ్రత విషయంలో నోయిడా కి బహు దూరంగా ఉంది.

నోఇడా చుట్టు పక్కల గల పర్యాటక స్థలాలు:నోయిడా లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయ వ్రుద్ధి రేటు సాధించింది. ఇంకా ఇంటర్నేషనల్ రిక్రియేషన్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు యూనీటెక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు "వరల్డ్స్ ఆఫ్ వండర్ లాంటి వి కూడా వచ్చాయి. నోయిడా లో ఉన్న గ్రేట్ ఇండియన్ ప్లేస్ ఉత్తర భారదేశంలో కెల్లా పెద్దది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అన్ని బ్రాండ్ల దుకాణాలు దీనిలో కొలువు దీరాయి. ఇంకా అనేక వినోదాత్మక కేంద్రాలు,మల్టీప్లెక్స్లు కూడా ఉన్నాయి.

ఇలాంటి తళుకు బెళుకుళే కాకుండా నోయిడాలో సాయిబాబ గుడి, ఇస్కాన్ గుడి, లోటస్ టెంపుల్

కూడా ఉన్నాయి. ఓఖ్లా పక్షి సంరక్షణా కేంద్రం సిటీ రణగొణ ధ్వనుల నుండి దూరంగా ఉండి ఆహ్లాదాన్ని పంచుతుంది. సెక్టార్ 18 మార్కెట్ నోయిడా ముఖ్య షాపింగ్ కేంద్రం.

నోయిడా చేరుకోవడం

నోయిడాని వాయు,రైలు,రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇంకా ఢిల్లీ లో ఉన్న రెయిల్ హెడ్ ద్వారా కూడా చేరుకోవచ్చు.

నోయిడా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నోయిడా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నోయిడా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నోయిడా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం: నోయిడాకి మూడు ఎక్స్ ప్రెస్ మార్గాలు ఉన్నాయి. డీఎండీ ఫ్లై వే, గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే మరియు యమునా ఎక్స్ప్రెస్ వే. ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల ద్వారా కూడా నోయిడా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: నోయిడాలో రైల్వే స్టేషన్ లేదు. ఢిల్లీ దగ్గరలో గల రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి క్యాబ్ ద్వారా లేదా ఢిల్లీ మెట్రో ద్వారా నోయిడా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నోయిడా ఎలా వెళ్ళాలి వాయు మార్గం: ఢిల్లీ విమానాశ్రయం నోయిడాకి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం. ఇక్కడ నుండి క్యాబ్ ద్వారా లేదా ఢిల్లీ మెట్రో ద్వారా నోయిడా చేరుకోవచ్చు. మెట్రొ: నోయిడా నేషనల్ కాపిటల్ రీజియన్ లో ఒక భాగం. నోయిడా ఢిల్లీ నుండి సౌకర్యవంతంగా మెట్రో ద్వారా కలపబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue