నోయిడా పక్కనే గల ఢిల్లీ, గుర్గావ్ అడుగుజాడల్లో నడచి కాస్మోపాలిటన్ నగరంగా వ్రుద్ధి చెందాలి అన్న నోయిడా వాసుల కోరిక సెక్టర్ 18 మార్కెట్ ని చూస్తే తెలుస్తుంది. ఈ మాల్లో అత్యాధునిక మాల్స్,అత్యధ్భుత తినుబండార కేంద్రాలు,అతి సుందర మల్టీప్లెక్స్‌లు, ఇతర వినోదాత్మక,వ్యాపారాత్మక కేంద్రాలుండటం వల్ల ఈ సెక్టర్ 18 మార్కెట్ ఢిల్లీ లో గల ఎన్.సీ.ఆర్ లేదా నేషనల్ కాపిటల్ రీజియన్ లో ఒక అత్యంత ముఖ్య ప్రదేసమయ్యింది.
ఇది అత్యంత జన సమ్మర్ధమయిన షాపింగ్ కేంద్రమే కాకుండా ఈ ప్రాంతాం లో ఇది ప్రతిష్టాత్మక వ్యాపార కేంద్రం కూడా.అంతర్జాతీయం గా ప్రసిద్ధి పొందిన వివిధ బ్రాండ్ ల వస్తువులు ఇక్కడ రిటయిల్ మార్కెట్ లో కొలువుదీరి ఉంటాయి. అదీడాస్,గోతియే,ఇండిగోనేషన్,వాన్ హ్యూసెన్ ,బెంట్లే ,బెనెట్టన్,కలర్ ప్లస్,డాకర్స్,లూయీ ఫిలిప్,రీబోక్,సిటీ లుక్,ఎబనీ,హాల్‌మార్క్,లీవైస్ వంటి ప్రసిద్ధి పొందిన మల్టీ నేషనల్ కంపెనీలు ఇక్కడ తమ దుకాణాలని ఏర్పాటు చేసుకున్నాయి. అరోమా, బరిస్తా,బాన్ బాన్,బాంబూ,డామినోస్,కటీస్,నిరూలాస్,మెక్ డొనాల్డ్స్,ఫార్ట్యూన్ కుకీస్,
పంజాబీ బై నేచర్ లాంటి పేరొందిన ఆహార విక్రయ సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ రకాల తినుబండారాల దుకాణాలతో కూడిన ఫుడ్ జాయింట్ ఉంది. ఢిల్లీ కానాట్ ప్లేస్ లేదా సౌత్ ఢిల్లీ మార్కెట్ లలో పొందే ఆనందాన్ని నోయిడా వాసులు ఈ సెక్టర్ 18 మార్కెట్ లో పొందుతారు.