Search
  • Follow NativePlanet
Share
» »ఖాతు శ్యామ్ జీ ద‌ర్శ‌న అనంత‌రం ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి...

ఖాతు శ్యామ్ జీ ద‌ర్శ‌న అనంత‌రం ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి...

రాజ‌స్థాన్‌లోని ఖాతు శ్యామ్ జీ దర్శనం కోసం వేలాది మంది భ‌క్తులు నిత్యం త‌ర‌లి వస్తుంటారు. ఇక్కడి బాబా ఆస్థానం ముందు ప్రజలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ భ‌క్తులు పెద్ద క్యూలలో నిలబడి ఉంటారు. ఖాతు శ్యామ్ జీ దర్శనం అనంత‌రం ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనేక ప్ర‌దేశాలు ఉన్నాయి. ఈసారి శ్యామ్ జీ ద‌ర్శ‌నం త‌ర్వాత ఈ ప్ర‌దేశాల‌ను వీక్షించేందుకు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చుట్టూ కొన్ని హిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ప్ర‌శాతంమైన వాతావ‌ర‌ణంలో సేద‌తీరాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఇక్క‌డికి రావాల్సిందే..

babashyamjitemple, rajsthan

రణక్‌పూర్ రాజస్థాన్

రాజస్థాన్‌లో ఉన్న రణక్‌పూర్ జైపూర్‌కు సమీపంలోని హిల్ స్టేషన్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ హిల్ స్టేషన్ చుట్టూ ఆరావళి శ్రేణులు ఉన్నాయి. రాజ్‌పుత్ రాచ‌రిక‌పు పాల‌న విశేషాలు ఇక్క‌డ ఇప్ప‌టికీ దాగి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతమంతా ప‌చ్చ‌ద‌నంతో నిండి ఉంటుంది. ప‌ర్యాట‌కులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడంలో ఈ ప్ర‌దేశం ఎప్పుడూ ముందుంటుంది. ర‌ణ‌క్‌పూర్ సంద‌ర్శించేందుకు అక్టోబ‌ర్ నుండి మార్చి వ‌ర‌కు ఉత్త‌మ‌మైన స‌మ‌యం. ఈ ప్ర‌దేశంలో ట్రెక్కింగ్, వన్యప్రాణుల నడకలు, ఒంటె సఫారీలు, ప్రకృతి నడకలు వంటివి చేయొచ్చు. ఇంకా ఇక్క‌డ సంద‌ర్శించేందుకు ఎన్నో ప్ర‌దేశాలున్నాయి. ముచ్చల్ మహావీర్ ఆలయం, సాద్రి, రణక్‌పూర్ జైన దేవాలయం, సూర్య నారాయణ ఆలయం

పంచకుల

హిమాలయ శ్రేణులతో చుట్టుముట్టబడిన పంచకుల ఈ సీజ‌న్‌లో పచ్చదనం, వన్యప్రాణులతో నిండి ఉంటుంది. ఈ కొండ పట్టణం దాని గుండా ప్రవహించే ఐదు పురాతన కాలువలకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. వీటితోపాటు ఈ ప్రాంతం చుట్టూ అనేక అందమైన తోటలు కూడా ఉన్నాయి. చరిత్ర ప్రేమికుల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌దని చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డ చారిత్రక అవశేషాలెన్నో దాగి ఉన్నాయి. ఈ ప్ర‌దేశాన్ని సెప్టెంబ‌ర్ నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కూ సంద‌ర్శించొచ్చు. ఇంకా ఇక్క‌డ ట్రెక్కింగ్, బోటింగ్, చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, ఇక్క‌డి మతపరమైన విషయాలను తెలుసుకోవ‌డం వంటివి చేయొచ్చు. ఇక్క‌డ సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో మోర్ని హిల్స్, పింజోర్ గార్డెన్, కాక్టస్ గార్డెన్, నాడా సాహిబ్ వంటి వాటితో పాటు మ‌రెన్నో ఉన్నాయి.

parwanu1

పర్వాను

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశం ప‌ర్వాను. ఇది 2500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ ప్రకృతి, పట్టణ జీవితాల మధ్య సరైన ఎంపిక అనే చెప్పుకోవాలి. ఈ ప్ర‌దేశం ఏడాది పొడ‌వునా సంద‌ర్శంచేందుకు అనువుగా ఉంటుంది. ఇక్క‌డ ట్రెక్కింగ్, కేబుల్ కార్ రైడ్, ప్రకృతి నడక, పండ్ల తోటల సందర్శన వంటివి చేయొచ్చు. ఇంకా ఇక్క‌డ సందర్శించదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో టింబర్ ట్రైల్, గూర్ఖా ఫోర్ట్, బాబా బాలక్ మందిర్ వంటివి.

kasauli1

కసౌలి

హిమాచల్ ప్రదేశ్‌లోని క‌సౌలి ప్రకృతి ప్ర‌సాదించిన వ‌రం. ఈ ప్రాంతం 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండ పట్టణం అనేక ఆకర్షణీయ ప్రదేశాలను కలిగి ఉంటుంది. ఈ ప్ర‌దేశం ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంది. ఇక్క‌డ ట్రెక్కింగ్‌తో పాటు మ‌రెన్నో సాహస కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదించొచ్చు. అంతే కాకుండా, ఇక్కడ సంద‌ర్శించేందుకు చాలా దేవాల‌యాలు కూడా ఉన్నాయి. అవి వాటి అందానికి కూడా ప్ర‌సిద్ధిచెందాయి. ఈ ప్ర‌దేశం ఫోటోగ్ర‌ఫీకి కూడా ఉత్త‌మ‌మైన‌ది. ఇంకా ఇక్కడ మంకీ పాయింట్, గూర్ఖా ఫోర్ట్, క్రైస్ట్ చర్చి, సన్‌సెట్ పాయింట్, గిల్బర్ట్ ట్రైల్ వంటి ప్ర‌దేశాల‌ను సంద‌ర్శ‌నకు ఉన్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+