Search
  • Follow NativePlanet
Share
» »ఆల్కాహాలు, నూడుల్స్ మరియు ఇతర విచిత్ర ప్రసాదాలను అందిచే ఆలయాలు !

ఆల్కాహాలు, నూడుల్స్ మరియు ఇతర విచిత్ర ప్రసాదాలను అందిచే ఆలయాలు !

By Mohammad

ఓవైపు మద్యనిషేధం అంటూ ప్రభుత్వాలు గగ్గోలు పెడుతుంటే .. మరోవైపు ప్రజలే అది ప్రసాదమంటూ స్వీకరిస్తున్నారు. మద్యాన్ని ఇస్తున్నది ఏ బారో, రెస్టారెంటో అయితే అయితే పర్వాలేదు ... కానీ ఏకంగా ఆలయాలే మద్యాన్ని ప్రసాదంగా ఇస్తున్నాయంటే నమ్మ శక్యం కావటం లేదు కదూ ..! అయితే ఈ వ్యాసం చదవండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది.

ఇండియాలో ఆలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయాలలో దేవుళ్ళ, దేవతల ప్రతిమలను పూజించడం సాధారణం. కొన్ని చోట్ల బుల్లెట్ బండిని, ఎలుకలను పూజించడం కాస్త ఆశ్చర్యకరమైనదే .. అయినా అలాగే పూజిస్తున్నాం. అదే కోవకు చెందినదే ప్రస్తుతం ఇక్కడ చెప్పుకోబోతున్నది.

ఇండియాలో ఏ ఆలయానికి వెళ్ళినా ప్రసాదాలు తప్పక పెడుతుంటారు. ఒక్కో ఆలయంలో పెట్టె ప్రసాదం వేరుకావచ్చు కానీ పెట్టడం కామనే. కింద పేర్కొన్న ఆలయాలు అన్ని ఆలయాకంటే భిన్నమైనది. ఇక్కడ పెట్టె ప్రసాదమే విచిత్రం. అదేంటో మీరే చదవండి.

1. మంచ్ మురుగన్ ఆలయం, కేరళ

పేరులోనే ఉంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ?. ఇక్కడి మురుగన్ దేవుడికి చాక్లెట్ లంటే ఇష్టమట. అందుకే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయానికి వచ్చి మంచ్ చాక్లెట్ లను సమర్పిస్తారట. ఇది తెలిసిన చుట్టుపక్కల వారు కూడా మతాలతో సంబంధం లేకుండా ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇంకో విషయం 'పుష్పాంజలి' మరియు 'అర్చన' తర్వాత భక్తులకు మంచ్ చాక్లెట్లను ప్రసాదాలుగా ఇస్తారట.

చైనీస్ కాళీ ఆలయం, కలకత్తా

చైనీస్ కాళీ ఆలయం, కలకత్తా

చిత్ర కృప : photo_shop of pranab

2. చైనీస్ కాళీ ఆలయం, కలకత్తా

చైనీస్ కాళీ ఆలయం, తంగ్రా ప్రాంతంలోని చైనాటౌన్ (chinatown) లో కలదు. ఇక్కడ కాళీ ఆలయంలో నూడుల్స్, చోప్ సుఎయ్ ని భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు. చైనీస్ కాళీ ఆలయం చైనా మరియు ఇండియా కు మధ్య ఒక వంతెన మాదిరి, రెండు దేశాల సంస్కృతులకు, సంప్రదాయాలకు గట్టి బంధంగా ఉన్నది.

3. పరస్సినిక్కడవు ఆలయం, కన్నూర్

కేరళ రాష్ట్రంలోని పరస్సినిక్కడవు మదప్పురం ఆలయం అది అందించే ప్రసాదాలకు పెట్టింది పేరు. చేపలు, తాటి చెట్ల నుండి తీయబడిన పుల్లని రసం మరియు అల్కాహాలు(ఫుల్ లేదా ఆఫ్ బాటిల్) ను దేవత ముందు పెట్టి పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత, పూజారులు వీటినే ప్రసాదాలుగా భక్తులకు అందిస్తారు. గ్రీన్ గ్రాం మరియు కొబ్బరి ముక్కలను కూడా భక్తులకు ఇస్తారు.

పరస్సినిక్కడవు ఆలయం, కన్నూర్

పరస్సినిక్కడవు ఆలయం, కన్నూర్

చిత్ర కృప : Sreelalpp

4. ఖబీస్ బాబా ఆలయం, లక్నో

ఖబీస్ బాబా ఆలయం, యూపీ లోని లక్నో లో ఉంది. ఖబీస్ అనే సన్యాసి / ముని / పవిత్ర వ్యక్తి శివున్ని ప్రార్ధిస్తూ చనిపోయాడు. అతని శిష్యులు బాబా చనిపోయిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని కట్టినారు. ఆ ఆలయాన్ని భక్తులు తరచూ సందర్శించి ఆల్కాహాల్ ను నైవేద్యంగా పెడతారు. బాబా ముందు ఉన్న రెండు బీటలలో, ఒకదాంట్లో మద్యాన్ని ధారాళంగా పోస్తారు. చివరగా దాన్ని సేకరించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.

5. కర్ణి మాతా ఆలయం, బికనేర్

కర్ణి మాత ఆలయం బికనేర్ లో క్రీ.శ. 20 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆలయం బయట వెండితో చేయబడిన ప్రధాన గేటు మరియు లోపల మార్బుల్ చెక్కడాలు అనేకం కలవు. కాబాస్ అని పోలువబడుతూ తిరిగే ఇక్కడి ఎలుకను భక్తులు పూజిస్తారు. వాటికి నైవేద్యంగా పాలను పోస్తారు. కాబాస్ ఆ పాలను తాగితే సుభసూచికంగా భావిస్తారు ఇక్కడి భక్తులు!

కర్ణి మాతా ఆలయం, బికనేర్

కర్ణి మాతా ఆలయం, బికనేర్

చిత్ర కృప : Ryan

వీటిపై మీ అభిప్రాయాన్ని తెలపండి మరియు మీకు తెలిసిన వింత ప్రసాదాలను అందించే ఆలయాలను మాతో పంచుకోండి !

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+