Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

హైదరాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌యాణికుల‌కు ట్రాఫిక్ అధికారులు అల‌ర్ట్ జారీ చేశారు. న‌గ‌రంలోని ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించ‌నున్న‌ట్లు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి. విశ్వప్రసాద్ వెల్ల‌డించారు. నారాయణగూడ వైఎంసీఏలో శనివారం సదర్‌ వేడుకలు జరుగనున్న దృష్ట్యా నేటి (శ‌నివారం) రాత్రి 7గంట‌ల‌ నుంచి ఆదివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Hyderabad Traffic restrictions

ఈ మేరకు నిన్న (శుక్రవారం) అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. అయితే, ఈ విష‌యాన్నిప్ర‌యాణికులు గ‌మ‌నంలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ అధికారులు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన మార్గాల‌ వివ‌రాలను కూడా అధికారులు విడుద‌ల చేశారు. మరి ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారో ఓసారి చూసేద్దామా..?

ఈ రూట్ల‌లోనే దారి మ‌ళ్లింపు..

రాంకోఠి నుంచి వచ్చే వాహనాలు కాచిగూడ ఎక్స్‌రోడ్‌ మీదుగా టూరిస్ట్‌ జంక్షన్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే ప్ర‌యాణికులు కాచిగూడ ఎక్స్‌రోడ్‌ నుంచి బాటా ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి సెమెంటరీ వైపు వచ్చే వాహ‌నాలు విఠల్‌వాడి ఎక్స్‌రోడ్‌ నుంచి రాంకోఠి ఎక్స్‌ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
విఠల్‌వాడి ఎక్స్‌రోడ్‌ నుంచి రాజమొహల్ల చిల్లా వైపు వచ్చే వారు పద్మశాలి భవన్‌ నుంచి రాంకోఠి ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్లాలి.
ఆర్‌టీసీ ఎక్స్‌రోడ్‌, క్రౌన్‌ కేఫ్‌ మీదుగా వచ్చే వాహ‌నాలు నారాయణగూడ ఎక్స్‌రోడ్‌ మీదుగా హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
నారాయణగూడ ఎక్స్‌రోడ్‌ నుంచి రాజ్‌బహదూర్‌ వెంకట్రామిరెడ్డి కాలేజ్‌ వైపు వచ్చే వారు బాబా టెంట్‌ వద్ద నుంచి క్రౌన్‌ కేఫ్‌ వైపు వెళ్లాలి.
బాగ్‌లింగంపల్లి వైపు నుంచి వైఎంసీఏ వచ్చే వారు రెడ్డి కాలేజ్‌ జంక్షన్‌ నుంచి బాబా టెంట్‌ హౌస్‌ వైపు వెళ్లాలి.
బర్కత్‌ఫుర చమన్‌ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే ప్ర‌యాణికులు పోస్టాఫీస్‌ జంక్షన్‌ నుంచి క్రౌన్‌ కేఫ్‌ వైపుకు వెళ్లాలి.
క్రౌన్‌ కేఫ్‌ నుంచి లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ వైపు వెళ్లే ప్ర‌యాణికులు పోస్టాఫీస్‌ జంక్షన్‌నుంచి బర్కత్‌ఫుర చమన్‌ వైపు వెళ్లాలి.
లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ వైపు నుంచి రాజ్‌బహదూర్‌ వెంకట్రామిరెడ్డి కాలేజ్‌ వైపు వచ్చే వాహ‌నాలు మాతా ఆలయం నుంచి పోస్టాఫీస్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలి.
కాచిగూడ ఎక్స్‌రోడ్‌, టూరిస్ట్‌ జంక్షన్‌ నుంచి పోస్టాఫీస్‌ జంక్షన్‌ వైపు వచ్చే వారు లింగంపల్లి చౌరస్తా నుంచి టూరిస్ట్‌, కాచిగూడ జంక్షన్‌ల వైపు దారి వెళ్లాల్సి ఉంటుంది.
ఇక‌, ఆయా రూట్ల‌లో రాకపోకలు సాగించే బస్సు సర్వీసులనూ కూడా దారి మళ్లించిన‌ట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
సదర్‌ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే వారు తమ వాహనాలను కేశవ మెమోరియల్‌ గ్రౌండ్‌లో పార్కు చేయాల్సి ఉంటుంది.
వాహ‌నాల రాకపోకల మళ్లింపు క్ర‌మంలో ప్ర‌యాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+