Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భద్రాచలం

భద్రాచలం - శ్రీరాముడి ప్రదేశం

19

భారత దేశపు దక్షిణ భాగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. ఈ పట్టణం హైదరాబాద్ నగరానికి సుమారు 309 కి. మీ.ల దూరం లో వుంటుంది. భారత దేశం లో ఇది ఈశాన్య భాగం మరియు గోదావరి నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం శ్రీరాముడు మరియు ఆయన సాధ్వి సీతా నివసించిన ప్రదేశం గా దెస వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇది శ్రీరాముడు నివసించిన ప్రదేశం కనుక హిందూ యాత్రికులు దీనిని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు. రాముడి పేరు చెపితే చాలు ఆంధ్రులకు భద్రాచలం గుర్తుకు వస్తుంది.

ఈ పట్టణానికి భద్రాచలం అనే పేరు భద్ర గిరి నుండి వచ్చింది. భద్ర అంటే ఒక వరం కారణంగా మేరు కు మేనకకు పుట్టిన బిడ్డ అని చెపుతారు. రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలం రెండవ స్థలం గా భావిస్తారు. లంక లో రావణుడిని వధించిన తర్వాత రాముడు చాలా కాలం పరిపాలన చేసాడు.

భద్రాచలం గురించిన ఇతిహాస గాధలు

భద్రాచలం ఒకప్పుడు దండకారణ్యం లో భాగం గా వుండేది. రాముడు తన వనవాసం సమయంలో సీతా మరియు లక్ష్మణుల తో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. వారు నివసించిన ప్రదేశం దేవాలయం నుండి సుమారు 32 కి. మీ. ల దూరం లో వుంటుంది. శ్రీరాముడు ఇక్కడ తన కుటుంబం కొరకు నివాసాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన గుడిసె నుండే రావణుడు సీత ని లంక కు అపహరించుకు పోయాడని చెపుతారు.

మరో కధ గా విష్ణు భక్తుడైన భద్రుడు ఒక రుషి. రాముడు అంటే తెగ ఇష్టపడతాడు. రాముడు లంక కు వెళ్ళే సమయం లో ఈ రుషి ని కలిసి ఆయన నుండి ఆతిధ్యం పొందేందుకు తాను మరల సీత తో తిరిగి వస్తానని చెపుతాడు. కాని ఆయన తిరిగి రాక పోవటం తో భద్రుడు అనే ఆ రుషి ఎంతో కాలం ఎదురు చూస్తాడు. తన భక్తుడు భద్రుడి ఎదురు తేన్నులకు మెచ్చిన విష్ణుమూర్తి, తానే రాముడి అవతారం లో , సీతా మరియు లక్ష్మణుడి తో కలసి దర్శనమిస్తాడు. ఈ సంఘటన రామ రాజ్యం బుగిసిన చాలా కాలానికి జరుగుతుంది. రాముడి భక్తుడైన భద్రుడి పేరుపై పట్టణం భద్రాచలం గా పిలువబడుతుంది.

మరో కధ గా శ్రీరాముడు పాకాల దమ్మక్క అనే మహిళకు కలలలో కనపడి, భద్రగిరి కొండల పై విగ్రహాలు కలవని చెప్పాడని, మరుసటి రోజు ఆమె ఆ కొండ పై కొన్ని విగ్రహాలను చూచిందని, వాటి తో ఆమె ఒక చిన్న దేవాలయం ఏర్పాటు చేసి ఆ విగ్రహాలని పూజించిందని, తర్వాతి కాలం లో ఆ ప్రదేశం భద్రాచలం గా పిలువబడుతూవే లాది భక్తుల చే పూజించాబడుతూ వారి పాపాలని నసింప చేస్తోందని చెపుతారు.

ప్రకృతి దృశ్యాల మధురానుభూతులు భద్రాచలం పర్యాటకులకు ఎన్నో సుందర దృశ్యాల అనుభవాలని కలిగిస్తుంది. ప్రధానంగా, ఇక్కడ జటాయు పక్క, పర్ణశాల, దుమ్ముగూడెం , గుణదల కలవు. రెండు ఖ్యాతి గాంచిన దేవాలయాలు అంటే శ్రీ సీతా రామచంద్ర స్వామి గుడి మరియు భద్రాచల రాముడి గుడి కలవు. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. రోడ్డు లేదా రైలు మార్గాలలో భద్రాచలం తేలికగా చేరవచ్చు.

భద్రాచలం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భద్రాచలం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భద్రాచలం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భద్రాచలం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు, టాక్సీ లు భద్రాచలం కు కలవు. రాష్ట్రం లోని ప్రధాన నగరాలనుండి భద్రాచలం కు అనేక మంది ప్రైవేటు బస్సు లు నడుపుతారు. హైదరాబాద్, ఖమ్మం లకు రెగ్యులర్ బస్సు లు కలవు. ఖమ్మం నుండి రోడ్ మార్గం లో రెండున్నర గంటలలో భద్రాచలం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం భద్రాచలానికి రైలు స్టేషన్ కోతగూడెం లో కలదు. దీనినే భద్రాచలం రోడ్ స్టేషన్ అంటారు. ఇది టవున్ కు సుమారు 40 కి. మీ.ల దూరం లో కలదు. ఇక్కడ నుండి దేశం లోని అన్ని ప్రాంతాలకు రైళ్ళు కలవు. స్టేషన్ నుండి పర్యాటకులు టాక్సీ లో భద్రాచలం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం భద్రాచలానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీపం లోని రాజమండ్రి లో స్థానిక విమానాశ్రయం కలదు. అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో 300 కి. మీ. ల దూరం లో కలదు. చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా సుమారు అదే దూరం లో వుంటుంది. విమానాశ్రాయాల నుండి భద్రాచలం టవున్ కు టాక్సీ ల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Aug,Sat
Return On
23 Aug,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Aug,Sat
Check Out
23 Aug,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Aug,Sat
Return On
23 Aug,Sun