మనసు బాగా లేనప్పుడు మనం ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలనుకొంటాం. అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం మన మనస్సును తేలిక పరిచడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా హిల్ స్టేషన్లు అంటే పర్వత శిఖర ప్రాంతాల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది మనస్సు ఆందోళనలో నిండినప్పుడు ఆ హిల్ స్టేషన్స్ వైపు చూపు వెలుతుంది. అటు వంటి హిల్ స్టేషన్స్ ల్లో ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖాండ్ లోని ఆల్మోరా మొదటి వరుసలో నిలుస్తుంది. అంతే కాకుండా ఈ వేసవిలో కుటుంబ సమేతంగా ఇక్కడకు వెళ్లి రావడం కూడా మంచి అనుభూతిని మిగులుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ అనేక దేవాలయాలు, నదీ లోయలు, అభయారణ్యాలు కూడా ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యుల్లోని ప్రతి వయస్సు వారికి ఇది నచ్చుతుంది కదా?

1. ఎక్కడ ఉంది?
Image Source:
ఉత్తరాఖాండ్ లోని ఆల్మోరా ఒక జిల్లా కేంద్రం. ఈ నగరానికి దగ్గర్లోనే ఆల్మోరా హిల్ స్టేషన్ ఉంది. మొత్తం పరిది 5 చదరపు కిలోమీటర్లు. ఇక సముద్ర మట్టానికి దాదాపు 1651 మీటర్ల ఎత్తులో ఈ హిల్ స్టేషన్ ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ ఎంతటి చల్లదనం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

2. ఎలా చేరుకోవాలి?
Image Source:
ఢిల్లీ నుంచి ఆల్మోరా 365 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా డెహరాడూన్ నుంచి ఆల్మోరా మధ్య దూరం 415. ఈ రెండు నగరాల నుంచి నిత్యం బస్సులు వెలుతుంటాయి. ఇక ఆల్మోరాకు దగ్గరగా పంత్ నగర్ ఎయిర్ పోర్టు ఉంది.

3. చూడదగిన ప్రాంతాలు ఎన్నో
Image Source:
అల్మోరాలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దేవాలయాలతో పాటు ఆడవారు ఎంతో ఇష్టపడే షాపింగ్ కు కూడా ఈ ఆల్మోరా పెట్టింది పేరు. గిరిజన తెగల వారు వాడే ఆభరణాలను ఇక్కడ ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు.

4. 1000 ఏళ్ల క్రితం
Image Source:
ఆల్మోరాలో ఉన్న దేవాలయాల్లో అతి ప్రాచీనమైనది నందాదేవి దేవాలయం. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన చంద్ర వంశ రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఈ నందాదేవి ఆలయం అమలక అనే ఒక రకం రాతితో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడ అద్భుత మైన శిల్ప సంపదను కూడా మనం చూడవచ్చు.

5. కాసర్ దేవి దేవాలయం
Image Source:
ఆల్మోరాకు కాసర్ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ లభించిన ఆధారాలను అనుసరించి తెలుస్తుంది. ఈ దేవాలయంలోనే స్వామి వివేకానందుడు చాలా ఏళ్లపాటు తపస్సు చేసినట్లు సమాచారం.

6. వజ్రాలను వెలికితీస్తారు
Image Source:
భారత దేశంలో వజ్రాలు దొరికే అతి తక్కువ ప్రదేశాల్లో సింటోలా కూడా ఒకటి. ఇది ఒక గ్రానైట్ కొండ కూడా. ఇక్కడ నిలబడి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మరిచిపోలేని అనుభూతి.

7. కుందేలు చర్మంతో
Image Source:
ముందే చెప్పుకున్నట్లు లాల్ బజార్ ఒక షాపింగ్ ప్రాంతం. ఇక్కడ అనేక అలంకార వస్తువులు కనిపిస్తాయి. ధర కూడా తక్కువే. ముఖ్యంగా కుందేలు చర్మంతో తయారు చేసిన వెచ్చగా ఉండే దుస్తులు ఇక్కడ లభ్యమవుతాయి.

8. లార్డ్ బ్రిటన్
Image Source:
సాధారణంగా దీనిని బ్రైట్ ఎండ్ కార్నర్ అని పిలుస్తారు. ఇది ఆల్మోరాకు 2 కిలోమీటర్ల దూరలో ఉంటుంది. ఇక్కడ నిలబడుకుని మంచు శిఖరాల మధ్య జరిగే సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటానికి చాలా మంది వస్తుంటారు. అదే విధంగా పున్నమి రాత్రుల్లో చంద్రోదయం కూడా ఇక్కడ మంచి అనుభూతిని ఇస్తుంది.

9. అభయారణ్యాలు
Image Source:
ఆల్మోరాలో ప్రధానంగా రెండు అభయారణ్యాలు ఉన్నాయి. అందులో ఒకటి బిన్సార్ వన్యప్రాణి అభయారణ్యం. ఇది ఆల్మోరాకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 900 నుంచి 2500 మీటర్ల ఎత్తులో 45.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ పరిధిలో ఉంటుంది.

10.గోవింద్ వల్లభపంత్ అభయారణ్యం
Image Source:
ఇది కూడా వివిధ జంతువులకు నిలయం. ముఖ్యంగా హిమాలయన్ చిరుతలను ఇక్కడ ఎక్కువగా సంరక్షిస్తూ ఉంటారు. అదే విధంగా ఇదే పేరుతో ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. అల్మోరా సంప్రదాయాలకు సంబంధించిన అనేక వస్తువులు, పురాతన పెయింటింగ్ లను మనం ఇక్కడ చూడవచ్చు.

11. మౌంట్ బైకింగ్, ట్రెక్కింగ్
Image Source:
అల్మోరా మౌంట్ బైకింగ్, ట్రెక్కింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. అంతెత్తుగా ఉండే మంచు పర్వతాల శిఖరాల మధ్య చుట్టూ ఉన్న ప్రక`తిని చూసుకుంటూ నడుచుకొని వెళ్లడం మరిచిపోలేని అనుభూతి. ఈ ట్రెక్కింగ్ జ్యోతిర్లింగాల్లో ఒకటైన జగేశ్వర్ ఆలయం మీదుగా సాగుతుంది.

12. అక్టోబర్ నుంచి మార్చి వరకూ
Image Source:
ఇక్కడ ట్రెక్కింక్, మౌంట్ బైకింగ్ కోసం భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ ట్రెక్కింగ్ కు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

13. విదేశీయుల స్థిర నివాసం
Image Source:
అల్మోరాకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో మర్టోలా అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ప్రక`తి రమణీయత చాలా బాగుంటుంది. అందువల్లే విదేశీయుల్లో చాలా మంది తమ శేష జీవితం ఇక్కడ గడపడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. వీరిలో అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓల స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం.



Click it and Unblock the Notifications













