Search
  • Follow NativePlanet
Share
» »అపురూప అందాల హిల్ స్టేషన్... డార్జీలింగ్ !

అపురూప అందాల హిల్ స్టేషన్... డార్జీలింగ్ !

డార్జీలింగ్ అత్యంత సుందరమైన ఒక హిల్ స్టేషన్. డార్జీలింగ్ చరిత్ర సిక్కిం, నేపాల్, బ్రిటిష్ ఇండియా, బెంగాల్ చరిత్రలతో ముడిపడి వుంది. 19 వ శతాబ్దం వరకూ సిక్కిం రాజ్యంలో భాగంగా వుండేది. సిలిగురి చుట్టూ కల మైదానాలు నేపాల్ రాజ్యంలో ఉండేవి. సిక్కిం రాజు అనేక మార్లు నేపాల్ గోర్ఖాల చేతిలో పరాజయం పొందాడు. గూర్ఖాలు డార్జీలింగ్ కొరకు పోరాడారు. తర్వాతి కాలంలో బ్రిటిష్ పాలకులు గూర్ఖాలతో పోరాడి డార్జీలింగ్ పై పూర్తి ఆధిపత్యం పొందారు. అప్పటి వరకూ గూర్ఖాలు ఆక్రమించిన ప్రాంతాలను నేపాల్ రాజు బ్రిటిష్ వారికి స్వాధీనం చేసాడు. బ్రిటిష్ పాలకులు సిక్కిం రాజుతో యుద్ధంలో గెలిచి డార్జీలింగ్ ను తమ సైన్య స్థావరంగా వినియోగించుకొన్నారు. డార్జీలింగ్ లోని వాతావరణం సంవత్సరం పొడవునా పర్యటన కు అనుకూలం గా వుంటుంది. అయినప్పటికీ ఫిబ్రవరి నుండి జూలై వరకూ గల వాతావరణం పర్యటనకు మరింత అనుకూలంగా వుంటుంది.

 టైగర్ హిల్

టైగర్ హిల్

టైగర్ హిల్ నుండి కంచన్జుంగా శిఖరంపై సూర్యోదయం అవటం చక్కగా చూసి ఆనందించవచ్చు. డార్జీలింగ్ వెళ్ళే ప్రతి పర్యాటకుడూ ఈ సూర్యోదయ దృశ్యం తప్పక ఆనందిస్తాడు.

ఆకర్షణీయ టీ తోటలు

ఆకర్షణీయ టీ తోటలు

డార్జీలింగ్ తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ నుండి మీరు హిమాలయన్ పర్వత శ్రేణులు, తేయాకు తోటలు చూడవచ్చు. ఈ ప్రదేశం అద్భుతమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడే మరొక ఆకర్షణ అయిన జపానీయుల పీస్ పగోడా లో బుద్ధుడి నాలుగు అవతారాలు చూపబడతాయి. ఈ నిర్మాణం శాంతికి చిహ్నంగా నిప్పొంజన్ మయోహిజి అజ్ఞానుసారం నిర్మించారు.

 జూలాజికల్ పార్క్

జూలాజికల్ పార్క్

ఈ జూలాజికల్ పార్క్ లో మంచు చిరుత పులి, సైబీరియన్ పులులు, హిమాలయ బ్లాకు బేర్ టిబెటన్ తోడేలు మొదలైనవి చూడవచ్చు. ఇక్కడ కల చిరుత పులి సంతానోత్పత్తి కేంద్రం కోక కుటుంబ సమేత విహార కేంద్రం. రెడ్ పండా కూడా తప్పక చూడండి.

బతాసియా లూప్

బతాసియా లూప్

బతాసియా లూప్ డార్జీలింగ్ కు అయిదు కి. మీ. ల దూరం. ఇది భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన గూర్ఖా సైనికుల ఒక వార్ మెమోరియల్

 మ్యూజియం లు

మ్యూజియం లు

వెస్ట్ బెంగాల్ మ్యూజియం. ఈ మ్యూజియం 1903 సంవత్సరం లో స్థాపించబడింది. నేడు ఈ మ్యూజియం లో బెంగాల్ వన్య ప్రాణుల, హిమాలయ వృక్ష సంపద నమూనాలు సుమ్మరు 4,300 కు పైగా చూడవచ్చు. బెంగాల్ చరిత్రను చూపుతూ అనేక చిత్ర పటాలు కూడా కలవు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+