మార్చిలో సందర్శించాల్సిన అద్భుతమైన గమ్యస్థానాలు
మార్చి వచ్చేస్తోంది.. వేడితాకిడికి విహారానికి బ్రేకులు పడతాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారి కోసమే ఈ ప్రాంతాలను గుర్తు చేస్తున్నాం. సీజన్‌తో సంబందంలేకుండా ప్రకృతి అందాలను పరిచయం చేసే పర్యాటక ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఏటా మార్చి వస్తోందంటే చాలు ఈ ప్రదేశాలలో వారిపోతారు పర్యాటక ప్రేమికులు. అందుకే మార్చి నెలలో భారత దేవంలో చూడాల్సిన అద్భుతమైన కొన్ని గమ్యస్థానాలను చూసేంద్దాం రండి!

ఖిర్సు, ఉత్తరాఖండ్
ఖిర్సు పౌరీ గర్వాల్ జిల్లాలోని ఒక కుగ్రామం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి. ఖిర్సు ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు స్వర్గధామంగా చెబుతారు. ఎందుకంటే ఇక్కడి ప్రతి అడుగూ అద్భుతంగా మలచబడ్డాయి. ఇక్కడి పర్యటనలో పంచచూలి, నందా దేవి, నందా కోట్ మరియు త్రిశూల్ వంటి శిఖరాలు మీకు గొప్ప వీక్షణను చేరువ చేస్తాయి. అలాగే, టెర్రేస్ పొలాలు మరియు యాపిల్ తోటలు ఈ ప్రదేశానికి అదనపు అందాలను అందిస్తాయి. విడిది చేసేందుకు అనువుగా స్థానికులు హోం స్టేకు అవకాశం కల్పిస్తారు. ఎక్కువ మంది సందర్శకులు ఇక్కడ విడిది చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రకృతి అందాలతోపాటు స్థానికుల సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది.

పిథోరఘర్, ఉత్తరాఖండ్
పిథోరఘర్ పచ్చని అందాలతో నిండిన ఓ ప్రశాంతమైన గమ్యస్థానం. మెలికలు తిరిగే నదులు, సహజమైన పచ్చటి అటవీ ప్రాంతంతో కవర్ చేయబడ్డ పంచచూలి శిఖరపు అందాలను కనులారా వీక్షించే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. పిథోరఘర్ ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన విహారయాత్రా స్థలంగా పేరుగాంచింది.

నంసాయి, అరుణాచల్ ప్రదేశ్
ఖంప్తి మరియు సింగ్‌ఫోస్ తెగలకు నిలయం. అంతరించిపోతోన్న ఇలాంటి తెలగ సంప్రదాయాన్ని మరెక్కడా చూసేందుక అవకాశం ఉండదు. అరుణాచల్ ప్రదేశ్‌లో అతి తక్కువ సందర్శించే ప్రదేశాలలో నంసాయి ఒకటి. మీరు రిఫ్రెష్ గాలి పీల్చుతూ, అద్భుతమైన వీక్షణనలను మరియు సాంస్కృతిక అనుభవాల ఇక్కడి ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదించవచ్చు. నంసాయ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణ సంక్లిష్టంగా రూపొందించబడిన గోల్డెన్ పగోడా ప్రాంతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పరశురామ్ కుండ్ నంసాయ్ నుండి కేవలం 84 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జోవై, మేఘాలయ
మేఘాలయ సందర్శించడానికి మార్చి ఉత్తమ సమయం. మండే వేసవిలోనూ వణికించే చలి ఇక్కడ సొంతం. సీజన్‌లో సంబందం లేకుండా నిత్యం వర్షం ఇక్కడ పలకరిస్తుంది. ఈ రాష్ట్రాన్ని సందర్శించడానికి గొప్ప సమయం ఇదే. వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని జోవై అద్భుతమైన డ్రైవింగ్ మార్గాలను మరియు సాహస ప్రియుల కోసం అనేక గుహలు, జలపాతాలను పరిచయం చేస్తుంది. భారతదేశంలోని 10 పొడవైన గుహలలో ఒకటైన మావైన్స్‌మా గుహ కోసం జోవాయిని సందర్శించండి.

కాంగ్‌థాంగ్, మేఘాలయ
మేఘాలయలోని విస్లింగ్ విలేజ్ అని కూడా పిలుస్తారు. కాంగ్‌థాంగ్ ఈ సీజన్‌లో సందర్శించాల్సిన గమ్యస్థానం. కాంగ్‌థాంగ్ గ్రామం ఈలలు వేసే సంస్కృతి గొప్ప ప్రాచుర్యం పొందింది. ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తున్నది. కాంగ్‌థాంగ్‌లో ఎవరైనా ఈలలు వేయడం చూస్తే.. వారి పేర్లను గుర్తించడం మీకు కష్టమైన పనే.



Click it and Unblock the Notifications













