Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి వేంకటేశ్వరుడి కంటే ప్రాచీనమైన శ్రీవారి దేవాలయం చూశారా?

తిరుపతి వేంకటేశ్వరుడి కంటే ప్రాచీనమైన శ్రీవారి దేవాలయం చూశారా?

అప్పలాయగుంట పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

తిరుపతి వేంకటేశ్వరుడి గురించి ఉన్నన్ని కథలు మరే ఇతర దేవుడికి ఉండవనడంలో సందేహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా తిరుమలలో కొలువుదీరి ఉన్నాడు. ఆ ఏడు కొండల వాడి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం కథనం కూడా. మహాసంప్రోక్షణ మొదలైన ఈ తరుణంలో ఆ కథనం మననం చేసుకోవడం సమజసం. అందువల్లే ఈ దేవాలయం గురించిన వివరాలు మీ కోసం. ఇందులో ఆ దేవాలయం ఎక్కడ ఉంది, ఆ దేవాలయం ఎలా చేరుకోవాలి తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం చదివేయండి. ఈ ఒక్క కథే కాదు మరెన్నో కథనాలు వీలైనన్ని నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురానున్నాం.

అప్పలాయ గుంట

అప్పలాయ గుంట

P.C: You Tube

అత్యంత ప్రాచీన,ప్రాచూర్యం చెందిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వర ఆలయాల్లో అప్పలాయ గుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఒకటి. చిన్నపల్లెటూరిలో పచ్చని పంట పొలాల మధ్య ఈ దేవాలయం ఉంటుంది.

అప్పలాయ గుంట

అప్పలాయ గుంట

P.C: You Tube

ఈ దేవాలయం తిరుమల వేంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆనంద నిలయం కంటే ప్రాచీనమైనదని చెబుతారు. శ్రీవేంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తే పద్మావతిని వివాహమాడిన తర్వాత కాలినడకన తిరుమలకు బయలుదేరుతాడు.

అప్పలాయ గుంట

అప్పలాయ గుంట

P.C: You Tube

వెలుతున్న మార్గ మధ్యలో తపస్సు చేసుకొంటున్న సిద్ధేశ్వరస్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి కొద్ది కాలం ఇక్కడ కొలువు దీరాడని చెబుతారు. అటు పై ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో ఆరునెలలు ఉన్నాడు.

అప్పలాయ గుంట

అప్పలాయ గుంట

P.C: You Tube

అటు పై శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల చేరాడని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంట పొలాలు ఉండటంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, అటు పై గర్భగుడిలో స్వామివారి దివ్య మంగళ రూపం కనువిందు చేస్తుంది.

అప్పలాయ గుంట

అప్పలాయ గుంట

P.C: You Tube

శ్రీవారి ఆలయానికి ముందు చిన్న కోనేరు ఉండి దానికి ముందు చిన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువగా ఉండటం వల్ల ఆలయంలోని స్వామివారిని ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవచ్చు.

అప్పలాయ గుంట

అప్పలాయ గుంట

P.C: You Tube

అప్పలాయగుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి ప్రతి గంటకు ఇక్కడకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుంచి పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను చూపించే బస్సులు, ప్రైవేటు ట్యాక్సీలు కూడా ఇక్కడికి వస్తుంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+