Search
  • Follow NativePlanet
Share
» »పాపికొండలు టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..?!

పాపికొండలు టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..?!

ఏపీలో ఈ వేస‌విలో సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఈ సీజ‌న్‌లో హిల్‌స్టేష‌న్‌లు, చ‌ల్లని ప్ర‌దేశాల‌కు వెళ్లాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. అలాంటి వారు రాజ‌మండ్రికి స‌మీపంలోని పాపికొండలు టూర్ ప్లాన్ చేయొచ్చు. ఈ స‌మ్మ‌ర్‌లో ఈ ప్ర‌యాణం ఎంతో హాయినిస్తుంద‌నే చెప్పుకోవాలి. పాపికొండ‌లు ప్లాన్ చేస్తున్న‌వారి కోసం ఏపీ టూరిజం ఓ స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వ‌న్ డే ట్రిప్ ఉంటుంది. రాజ‌మండ్రి నుంచి పాపికొండ‌ల వ‌ర‌కు నదిలో క్రూయిజ్ లను ఏర్పాటుచేసింది.

రాజమండ్రి నుంచి సుమారు 100 కిలోమీట‌ర్ల‌ దూరంలో గోదావరి నది మధ్యలో గోడలాగా పాపికొండలు మూడు ఉన్నాయి. లగ్జరీ క్రూయిజ్‌ బోట్ లలో పాపికొండల సుందరమైన అందాలను వీక్షించే అవ‌కాశాన్ని ఏపీ టూరిజం వారు కల్పిస్తున్నారు.

పాపి కొండలు తూర్పు కనుమలలో ఉన్న ఒక సుందరమైన కొండల ప్రదేశం. ఈ ప్రాంతం వలస వచ్చే అరుదైన పక్షులతో సహా అనేక రకాల వృక్షాలు, జంతువులకు నిలయంగా ఉంది. ఇక్క‌డే పోలవరం ప్రాజెక్టుకూడా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఈ కొండలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి.

papikondalu travel

ఇక‌, ఈ పాపికొండ‌ల అంద‌మైన దృశ్యాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఏపీ టూరిజం రివర్ క్రూయిజ్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా గండిపోచమ్మ దేవాలయం, పాపికొండలు, పేరంటపల్లి ఆశ్రమం, దేవాలయం వంటి ప్ర‌దేశాల‌ను చూడొచ్చు. ఇదంతా బోటు ప్రయాణమే. ఈ ప్ర‌యాణంలో పోలవరం ప్రాజెక్ట్ ఏరియా, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటివ‌న్నీ సందర్శించే అవ‌కాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బ్రేక్ ఫాస్ట్, మినరల్ వాటర్‌, శాఖాహార భోజనం వంటివ‌న్నీ అందిస్తారు.

వ‌న్ డే ట్రిప్ షెడ్యూల్ ఇదే..!

రోడ్డు మార్గంలో ఉదయం 7:30 గంటలకు ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. ముందుగా పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవులోని బోట్ల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తారు. ఆ త‌ర్వాత 9.00 గంటల స‌మ‌యంలో బోట్ లో అల్పాహారం, ఆపై గోదావరి నదిలో ప్రయాణం మొదలవుతుంది. 10.30 గంటలకు గండిపోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక‌, మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలోనే పడవలో శాఖాహార భోజనం అందిస్తారు.

papikondalu

ధ్యాహ్నం 2.00 గంటలకు పాపికొండల వద్ద‌కు చేరుకుంటారు. పాపి కొండల మధ్య ప్రయాణం చేస్తూ ఇక్క‌డి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. 3.00 గంటలకు ఖమ్మం జిల్లా పేరంటపల్లి గ్రామానికి బోటు చేరుకుంటుంది. అక్కడ ఉండే రామకృష్ణ ముని ఆశ్రమం, వీరేశ్వర స్వామి దేవాలయం, శివుడ్ని దర్శించుకుంటారు. 3.30 గంటల స‌మ‌యంలో పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవుకు పడవలో తిరుగు ప్రయాణమ‌వుతారు.

రాత్రి 7.30 గంటలకు రోడ్డు మార్గంలో రాజమండ్రికి తీసుకొస్తారు. రాత్రి 8.30 గంటలకు పర్యాటకులు రాజమండ్రి చేరుకుంటారు. ఏపీ టూరిజం బోట్ ప్ర‌యాణం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8.00 వరకు మాత్ర‌మే ఉంటుంది. ప‌ర్యాట‌కులు ఈ వ‌న్‌డే ట్రిప్‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

పాపికొండలు టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ను https://tourism.ap.gov.in/tours ,www.aptourismrajahmundri.com సంప్ర‌దించొచ్చు.

More News

    Read more about: papikondalu andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+