Search
  • Follow NativePlanet
Share
» »సిక్కుల ప‌విత్ర స్థ‌ల‌మైన హేమ‌కుండ్ యాత్ర‌కు సిద్ధ‌మా..!

సిక్కుల ప‌విత్ర స్థ‌ల‌మైన హేమ‌కుండ్ యాత్ర‌కు సిద్ధ‌మా..!

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న సిక్కుల పవిత్ర స్థలం హేమకుండ్ సాహిబ్. ఇక‌, హేమకుండ్ సాహిబ్ యాత్రకు బ‌య‌లుదేరేవారికి శుభ‌వార్త‌. హేమకుండ్ సాహిబ్ తలుపులు భక్తుల కోసం తెరుచుకున్నాయి. భార‌త్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అలాగే, ఇక్క‌డ చార్‌ధామ్ యాత్ర‌కు ఎంత ప్ర‌త్యేక‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ యాత్ర‌కూడా ప్రారంభ‌మైంది. ఇది హిందువులు ప్ర‌సిద్ధ స్థ‌లం.

అలాగే, దేశంలోని ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో సిక్కుల ప‌విత్ర స్థ‌ల‌మైన హేమ‌కుండ్ సాహిబ్ త‌లుపులు కూడా తెరుచుకున్నాయి. అయితే, ఇక్క‌డికి కేవ‌లం ప్రతిరోజు 3500 మంది భక్తులు మాత్రమే ద‌ర్శ‌నం చేసుకోగ‌ల‌రు. హేమకుండ్ సాహిబ్ ప్రపంచంలోనే ఎత్తైన, ప్రసిద్ధ గురుద్వారమ‌ని చెప్పుకోవాలి. ఇక‌, హేమకుండ్ సాహిబ్‌తో పాటు, సముద్ర మట్టానికి సుమారు 15225 అడుగుల ఎత్తులో ఉన్న లోక్‌పాల్ లక్ష్మణ దేవాలయం తలుపులు కూడా తెరుచుకున్నాయి.

ఈ ప్రాంత‌మంతా అత్యంత మంచుతో క‌ప్ప‌బడి ఉంటుంది. గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్ సముద్ర మట్టానికి 4,329 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం మే నుండి అక్టోబర్ వరకు కొన్ని నెలల పాటు భ‌క్త‌లు సందర్శ‌నార్థం తెరిచి ఉంటుంది.

hemkund travl guide

మిగిలిన సీజన్లలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే, హేమకుండ్ అనే పదం ఈ పవిత్ర స్థలం యొక్క సహజమైన అందాన్ని, ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది. వేల సంఖ్యలో ఇక్క‌డికి భక్తులు వస్తుంటారు. హేమకుండ్ సాహిబ్‌లో ఇప్పటికీ 7 నుండి 8 అడుగుల మంచు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు దాదాపు రెండు కిలోమీటర్ల మేర మంచుతో ప్రయాణించాల్సి వస్తోందని ఇక్క‌డి అధికారులు అంటున్నారు.

ప్రతిరోజూ 3500 మంది భ‌క్తులు మాత్ర‌మే..

మొదటి రోజు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని గురుద్వారా నిర్వహణ కమిటీ ధామ్‌ను సందర్శించగల భక్తుల సంఖ్యను నిర్ణయించింది. దీంతో ఇక్క‌డికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ 3500 మంది భక్తులను మాత్రమే హేమకుండ్ సాహిబ్‌కు ఆహ్వ‌నిస్తున్నారు. ఇక‌, వీటి త‌లుపులు 10 అక్టోబర్ 2024న మళ్లీ మూసివేయబడతాయి.

hemkund travel guide

లోక్‌పాల్ లక్ష్మణ్ ఆలయం...

హేమకుండ్ సాహిబ్ కంటే ముందు, ఈసారి బుద్ధ పూర్ణిమ రోజున, శ్రీ లోక్‌పాల్ లక్ష్మణ్ ఆలయ తలుపులు కూడా భక్తుల కోసం తెరుచుకున్నాయి. శతాబ్దాలుగా, హేమకుండ్ సాహిబ్, లోక్‌పాల్ లక్ష్మణ్ దేవాలయం తలుపులు ఒకే రోజు తెరవబడతాయి. చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 15,225 అడుగుల ఎత్తులో ఉన్న లోక్‌పాల్ లక్ష్మణ్ ఆలయం కూడా హేమకుండ్ యాత్రలో ఓ భాగ‌మే అని చెప్పుకోవాలి. ఇక్క‌డికి కూడా వేల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటారు. లక్ష్మణ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది.

శ్రీ లోక్‌పాల్ లక్ష్మణ ఆలయానికి సంబంధించి అనేక పురాణాలు ఉన్నాయి. అందులో ఒకటి. ఇక్కడ పవిత్ర సరస్సు ఒడ్డున ఉన్న ఈ లోక్‌పాల్ లోయలో, శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు తన పూర్వ జన్మలో శేషనాగ్ అవతారంగా కఠోర తపస్సు చేశారని ఉంది. అదే ఇక్క‌డికి వ‌చ్చే భక్తులు కూడా విశ్వ‌సిస్తుంటారు. హేమకుండ్ సాహిబ్ యాత్ర సందర్భంగా భక్తుల సౌక‌ర్యార్థం ఈ మార్గాల్లో వివిధ ప్రదేశాలలో ఆహార స్టాల్స్, తాగునీరు, విద్యుత్, అత్య‌వ‌స‌ర వైద్య సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+