Search
  • Follow NativePlanet
Share
» »దుర్గమ్మ భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. ద‌ర్శ‌న స‌మ‌యాల‌పై అధికారుల కీల‌క నిర్ణ‌యం..

దుర్గమ్మ భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. ద‌ర్శ‌న స‌మ‌యాల‌పై అధికారుల కీల‌క నిర్ణ‌యం..

దక్షిణభారతదేశంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం..అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మ‌వారు భక్తుల కోరికలు నెర‌వేర్చే క‌ల్ప‌వ‌ల్లిగా ఉన్నారు. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తుంటారు. ఇక‌, పండుగ స‌మ‌యాల్లో ఇక్క‌డ నెల‌కొన్న రద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విజ‌యవాడ పేరు చెప్ప‌గానే క‌న‌కదుర్గ‌మ్మ ఆల‌య‌మే అంద‌రికీ గుర్తొస్తుంది. ఇక్క‌డికి వ‌చ్చిన వారు త‌ప్ప‌కుండా అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకుని వెళ్లాల్సిందే. అంత‌టి మ‌హిమ‌గ‌ల అమ్మ‌వారు ఇక్క‌డ కొలువై ఉన్నారు. ఇక‌, ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్ర‌దేశంగా మాత్ర‌మే కాకుండా ప‌ర్యాట‌క ప్రాంతంగా కూడా విరాజిల్లుతుంది.

క‌నక‌దుర్గ‌మ్మ ఆల‌యం విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఈ పుణ్య‌క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవాలయంగా ప్ర‌సిద్ధిచెందింది. ఈఆలయంలో కొలువై ఉన్న‌ అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో నిత్యం అలంక‌ర‌ణ‌ల‌తో అమ్మవారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తుంటారు. అమ్మావారి మూర్తికి ఎనిమిది చేతులు ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

kanakadurgammatemple

ఆ స‌మయంలో ద‌ర్శ‌నాలు ఉండ‌వు..

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామివార్ల దర్శనానికి వెళ్లే భక్తులను ఆల‌య అధికారులు అలర్ట్ చేశారు. ద‌ర్శన సమయాలకు సంబంధించి ఆల‌య అధికారులు ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నట్లు తెలిపారు. అమ్మవారి మహా నైవేద్య సమయంలో దర్శనాలు నిలిపివేస్తామని ఆల‌య ఈవో రామారావు తెలిపారు. కావున భక్తులు ఆ సమయంలో దర్శనం కోసం రావొద్దని ఆయ‌న కోరారు. దీంతోపాటు భక్తులు తమ వాహనాలను కొండపైకి తీసుకురావొద్దని కూడా సూచించారు. కేవ‌లం దేవస్థానం బస్సులు మాత్ర‌మే కొండపైకి రావాలని ఈవో కోరారు.

indrakiladrimountain1

అమ్మ‌వారికి మ‌హా నేవేద్యం..

ప్రతి రోజూ ఆల‌యంలో అమ్మ‌వారికి మ‌హానైవేద్యం స‌మ‌ర్పించేందుకు కొంత స‌మ‌యం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య ఆలయంలో అమ్మవారికి మహా నైవేద్య సమయం కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ కారణంతోనే అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆల‌య అధికారులు తెలిపారు. ఇక్క‌డ నిత్యం భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, వీకెండ్ స‌మయాల్లో భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా పెరుగుతుంద‌ని అధికారులు చెప్పారు.

కాబట్టి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలకోసం వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులు, అన్ని శాఖల అధికారులు ఉదయం 11.30 మధ్యాహ్నం 1.30 గంటల లోపు దర్శనాలకు రావొద్దని అధికారులు తెలిపారు. అమ్మవారికి మహా నైవేద్య సమయంలో కాకుండా మిగిలిన సమయాలలో దర్శనానికి రావాలని వారు కోరారు. ఇతర ప్రత్యేక రోజులలో రద్దీ వీపరితంగా ఉండటంతో కొండపైకి వాహనాల రాకపోకలను రద్దు చేసినట్లు ఆల‌య ఈవో తెలిపారు.

punnamighat1

వాటికి అనుమ‌తి లేదు..

ఇక‌, భ‌క్తుల ర‌ద్దీతో కొండపైకి వాహనాలకు అనుమతి లేదు. దాంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పున్నమి ఘాట్‌, సీతమ్మవారి పాదాల వద్ద పార్కింగ్‌లో వాహనాలను నిలుపుకోగ‌ల‌ర‌ని అధికారులు సూచించారు. అక్కడి నుంచి దేవస్థానం బస్సులలో కొండపైకి చేరుకోవాలని వారు తెలిపారు. ఈ మార్పుల్ని గమనించి భక్తులు సహకరించగ‌ల‌ర‌ని అధికారులు కోరారు.

More News

Read more about: vijayawada andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+