Search
  • Follow NativePlanet
Share
» »భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. తిరుమ‌ల‌లో సెప్టెంబ‌ర్ మాసంలో జ‌రిగే ప‌ర్వ‌దినాలివే..!

భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. తిరుమ‌ల‌లో సెప్టెంబ‌ర్ మాసంలో జ‌రిగే ప‌ర్వ‌దినాలివే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్యాట‌కులు సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పురాత‌న ఆల‌యాలు కూడా ఉన్నాయి. అందులో ఒక‌టి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు వ‌స్తూనే ఉంటారు. ఇక‌, తిరుమ‌ల ఆల‌యంలో ప్ర‌తినెలా విశేష ఉత్స‌వాలు, పండుగ‌లు ప‌ర్వ‌దినాల‌ను ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌రిగే విశేష ఉత్స‌వాల గురించి తిరుమ‌ల ఆల‌య అధికారులు తాజాగా ప్ర‌క‌టించారు. వాటి వివ‌రాలేంటో చూసేద్దాం..

తిరుమల ఆలయంలో సెప్టెంబరు 5న బలరామ జయంతి, వరాహ జయంతి కార్య‌క్ర‌మాలు ఉంటాయి. ⁠సెప్టెంబరు 7 వినాయక చవితి ప‌ర్వ‌దినాన ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహిస్తారు. ⁠సెప్టెంబరు 17వ తేదిన అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తంచ‌ ⁠సెప్టెంబరు 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ కార్య‌క్ర‌మం ఉంటుంది. ⁠సెప్టెంబరు 28న‌ సర్వ ఏకాదశి, భక్తులు ఈ విశేష ఉత్స‌వాల‌ను గమనించి ఆల‌యానికి విచ్చేయాల‌ని ఆల‌య అధికారులు కోరారు.

tirumala1

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరిగే ప‌ర్వ‌దినాలు...

తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో కూడా సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 3న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వ‌హిస్తారు. సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేక కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. సెప్టెంబరు 18న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వ‌హిస్తారు.

అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు. సెప్టెంబరు 26న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వ‌హిస్తారు. ఇక‌, అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్ల‌ను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపు చేప‌డ‌తారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ కార్య‌క్ర‌మం కూడా ఉంటుంది.

tirupati festival

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు..

ఆల‌య అధికారులు నిర్వ‌హిస్తున్న చతుర్వేద పారాయణంలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం ప్రారంభ‌మ‌వుతుంది. చతుర్వేద పారాయణంలో భాగంగా జూలై 1న ప్రారంభమైన సామవేద పారాయణం ఆగస్టు 31వ తేదితో ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేదం పారాయణం ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లకు అధికారులు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలిసిందే. ఈ త‌రుణంలో ఆల‌య అధికారులు తిరుమలలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే స్థానిక రాంభగీచా ఎదుట తాత్కాలిక జర్మన్‌ షెడ్లు, ఆలయం ఎదుట బారికేడ్లను ఏర్పాటు చేయ‌నున్నారు. భక్తులు ఆలయం ఎదుట గ్యాలరీల్లోకి వెళ్లేందుకు వీలుగా ఈ ఏర్పాట్ల‌ను చేయ‌నున్నారు.

More News

Read more about: tirupati andhrapradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+