Search
  • Follow NativePlanet
Share
» »పర్యటనలో మీ భాద్యత ఎంత ?

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

ఒక భాద్యత గల పర్యాటకుడిగా ఎలా వుండాలి ? కొత్తగా పర్యటనలు మొదలు పెట్టె వారు ఒక మంచి అనుభవాన్ని పొందేందుకు కొన్ని భాద్యతలు కూడా చేపట్టాలి. తోటివారికి లేదా, ఆతిధ్యం ఇచ్చే ప్రదేశానికి ఎటువంటి అసౌకర్యం ఉండరాదు. ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తున్నాడంటే, అతడు లేక ఆమె ఆ ప్రదేశం తో ఒక అనుబంధం ఏర్పరచుకొని, స్థానికంగా గల కొన్ని తీపి జ్ఞాపకాలు వెనక్కు తీసుకు వెళుతూ న్నాడని గ్రహించాలి. ప్రతి పర్యాతకుడికి కావలసినది లక్సరీ హోటల్స్ కాదు, ఆ ప్రదేశంలో సెంటర్ లో కల ఒక స్థానిక హోం స్టే అయినా చాలు. పర్యాటక భాద్యత అనే మాటకు అర్ధం పరిశీలిస్తే, పర్యాటకులు తమ ప్రయాణం అంతా మూడు అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అవి ఆర్ధిక పరంగా, సామాజిక పరంగా, పర్యావరణ పరంగా భాద్యత కలదని భావించాలి.

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

మీరు మీ పర్యటనలో చూడవలసిన ప్రదేశం గురించి పిల్లల మనస్తత్వం కలిగి వుండాలి. ఒక ప్రదేశం గురించి ముందుగా సమాచారం సేకరించాకుండా వెళ్ళటం వలన ప్రయోజనం అధికంగా వుండదు. ముందుగా మీరు ప్రదేశం గురించిన చారిత్రక, పౌరాణిక, మొదలైన వివరాలు సేకరించాలి. స్థల పురాణాలు, స్థానిక కధలు, చారిత్రక వివరణ అందుబాటులో ఉన్నంత వరకూ పొందాలి. అపుడే మీ పర్యటన పూర్తి అనుభవాలతో సఫలీకృతం అవుతుంది.

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

మీరు కోరిన ప్రదేశం చేరిన వెంటనే, అక్కడి స్థానికులతో మెలగండి. వారి రోజు వారీ వ్యవహారాలు వారి ప్రైవసీ కి భంగం కలుగకుండా పరిశీలించండి. వారి జీవన శైలికి సంబంధించిన వివరాలు తెలుసుకోనండి. ఒక బంధం ఏర్పరచుకోనే టందుకు ప్రయానించండి. స్థానికులతో చిరు నవ్వుతో మెలగండి. జీవన శైలి వ్యత్యాసాలు గమనించండి. వారి మంచి విధానాలు అభినందించండి. ఈ చర్యలు తప్పక మీకు చక్కటి పర్యటనా అనుభవాలు అందిస్తాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా లో భాధ్యాతాయుత పర్యటన అనేది ఇంకా పూర్తి రూపు సంతరించుకోనలేదు. ఈ దిశగా, కేరళ టూరిజం శాఖ తీవ్ర కృషి చేస్తోంది. గాడ్స్ ఓన్ కంట్రీ గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అపరిమిత సహజ వనరులు అంతులేని స్థానికుల సహకారం కలదు.

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

ఇండియా లో భాధ్యతా యుత పర్యాటక రంగంలో కేరళ టూరిజం శాఖకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు లభించాయి.కుమరకోమ్, వయనాడ్, కోవలం, తేక్కడి వంటి ప్రదేశాలలో ఈ రకమైన అంశాలను ప్రవేశ పెట్టి పరీక్షలు చేసి విజయవంతం అయినట్లు భావించారు. ఫలితంగా, పర్యాటకుల సంఖ్యా అభివృద్ధి చెందటం, స్థానిక వనరులు, సంపద, పర్యావరణం మరింత మెరుగు పడటం కూడా జరిగింది. వారి వ్యవసాయ రంగం సైతం అభివృద్ధి చెంది అధిక ఉత్పట్లు,, ఖచ్చిత అమ్మకాలు, మంచి ఉపాధి లభింపు పొందారు. వారి చేతి కళల వస్తువుల నుండి, స్థానిక ఆహారాల వరకు ఈ పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాయి.
టూరిస్టు లు గ్రామాలలో స్థానికులతో కలసి మెలసి వుండటం ద్వారా స్థానికుల ఎనర్జీ సేవింగ్ ప్రోగ్రాములు, మహిళా సాధికార ప్రోగ్రాములు మొదలైన వాటిలో పాల్గొనవచ్చు. భాద్యతగల టూరిజం కు మూలం అవగాహన. ఈ భాధ్యాతాయుత ట్రావెల్ రంగంలో మీ వంతు పాత్ర పోషిస్తారని మీ అభిమాన ట్రావెల్ సైట్ అయిన మా నేటివ్ ప్లానెట్ ఆశిస్తోంది. ప్రతి పర్యటన లోను పొందవలసినది ఎంతో వుంటుంది.

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

పర్యటనలో మీ భాద్యత ఎంత ?

ఆ మధుర జ్ఞాపకాలను మీ వెంట తీసుకెల్లండి, మీ అడుగు జాడలను అక్కడే వదిలేయండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+