Search
  • Follow NativePlanet
Share
» »మీ నగరంలో మీరే టూరిస్ట్ లు ?

మీ నగరంలో మీరే టూరిస్ట్ లు ?

మనకందరకూ ట్రావెల్ ఎంతో ఇష్టం. మనం మన దేశంలోని అనేక ప్రదేశాలలో పర్యటించాం. మనలో కొంతమంది విదేశాలలో సైతం పర్యటించి వుంటారు. మరి మన స్వంత నగరంలో పర్యటించి కొత్త ప్రదేశాలను ఎంతమంది అన్వేషించి వుంటారు ? ఈ అంశం చాలా మందికి కొత్త అనిపిస్తుంది. ఎన్నో సార్లు, మన సిటీ లో వున్నాకొన్ని ప్రాంతాలను మనం చూడం. ఇతర ప్రదేశాలనుండి వచ్చిన వారు చూసి మనకు చెప్పిన సంఘటనలు కూడా వుంటాయి. మరి మన స్వంత నగరంలో పర్యటన ఎంతో ఖర్చు ఆదా చేయటమే కాక, మన చుట్టుపక్కల కల ప్రదేశాల పట్ల మంచి అవగాహన కలిగిస్తుంది. మన స్వంత నగరం పర్యటించేందుకు కొన్ని సూచనలు ఇస్తున్నాం పరిశీలించండి.

మీ నగరంలో మీరే టూరిస్ట్ లు ?

1. మీ సిటీలోనే మీరు వినినప్పటికి ఇంతవరకూ మీరు చూడని లోపలి ప్రదేశాలు కొన్ని తప్పక వుంటాయి. అటువంటి ప్రదేశం చూడండి. మీ అనుభవం తోటి వారికి గర్వంగా చెప్పండి.

2. నగరంలో కొన్ని ప్రదేశాలలో కొన్ని తినే పదార్ధాలు ఫేమస్ గా వుంటాయి. అటువంటి ప్రదేశాలు సందర్శించండి. మీరు తినాలనుకునే డిష్ లు ఆనందంగా తినేసి, మీ నాలుకను కూడా సంతోష పెట్టండి.

3. మన సిటీ లో ఎన్నో ప్రోగ్రాం లు జరుగుతాయి. అనేక థియేటర్ లు ఇతర సాంస్కృతిక ప్రోగ్రాములు, మ్యూజిక్ కన్సర్ట్ లు , మొదలైనవి కొన్ని నియమిత ప్రదేశాలలో రెగ్యులర్ గా జరుగు తూ వుంటాయి. బహుశ, మీరు ఎన్నడూ వీటి పట్ల ధ్యాస పెట్టి వుండరు. కనుక అటువంటి ప్రోగ్రాం లు హాజరై గర్వపడండి.

4. ప్రతి రోజూ కారు, లేదా బస్సు లేదా మోటార్ బైక్ ట్రావెల్ చేయటమేనా ? ఒకసారి ఒక ట్రక్ పై ట్రావెల్ చేయండి. నగరం అంతా తిరగండి. వినటానికి ఇది కొంత వింతగా వున్నా అనుభవిస్తే ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది సుమా ?

5. తమాషాగా వుండే ట్రెషర్ హంటింగ్ చేయండి. ఇప్పటి వరకూ కనుగొనని అంశాలు సిటీలో కనిపెట్టండి. ఇది మీకు ఎంతో ఉల్లాసం కలిగిస్తుంది.

6. మీ స్వంత నగరం కనుక, ఇంత వరకూ రాత్రివేళ ఒక హోటల్ లో గడిపి వుండరు. మరి వెరైటీ గా ఒక రోజు మీ నగరంలోని కొత్తగా పెట్టిన రిసార్ట్ లేదా హోటల్ లో ఒక రాత్రి గడపండి. సౌకర్యాలు అనుభవించి ఇది నా నగరం కాదు అంటూ ఒక టూరిస్ట్ లా ఫీల్ అయిపోండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+