కేరళ రాష్ట్రం అక్కడ కల ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఎక్కడ చూసినా నీలి రంగు, ఆకు పచ్చలతో ఎంతో మనోహరంగా వుంటుంది. సంవత్సరం పొడవునా ఇక్కడకు వచ్చే అధిక సంఖ్యా పర్యాటకులకు ఈ ప్రదేశంలో ఎన్నో రెసార్టులు, కలవు. కేరళ కోస్తా తీరం సుమారు 590 కి. మీ. ల పొడవు తో అందమైన బీచ్ లు అనేకం కలిగి వుంది. ఇండియా లో నైరుతి దిశగా కల ఈ కోస్తా రాష్ట్రం, పర్యాటకులకు అనేక మరపురాని అనుభవాలను అందిస్తుంది. ఇక్కడ కల కొన్ని బీచ్ లను, వసతులను పర్యాటకుల సౌకర్యం కొరకు పొందు పరుస్తున్నాం పరిశీలించండి.

వర్కాల
వర్కాల బీచ్ తిరువనంతపురానికి 50 కి. మీ. ల దూరంలో కలదు. కోవలం బీచ్ కంటే కూడా ఇక్కడ తక్కువ జనాలు వుంటారు. కేరళ కోస్తాలో వర్కాలలో కల చిన్న కొండ ప్రాంతాలు మాత్రమే సముద్రానికి సమీపంగా వుంటాయి. ఈ మార్గంలో పుష్కల ఖనిజాలు కల అనేక సహజ నీటి ప్రవాహాలు కూడా కలవు. కేరళ మొత్తంలో ఇక్కడ కనిపించే సూర్యాస్తమయం ఎంతో అందంగా వుంటుంది. ఆధ్యాత్మిక ప్రియులకు ఇక్కడ రెండువేల సంవత్సరాల నాటి ఒక విష్ణు టెంపుల్ కూడా కలదు. ఎక్కడ వసతి పొందాలి ? విష్ణు టెంపుల్ మరియు బీచ్ లకు సమీపంగా గల గేటు వే హోటల్ అనుకూలం.
మరారి
అల్లెప్పి నుండి సుమారు 11 కి. మీ. ల దూరం లోను, కోచి నుండి 60 కి. మీ. ల దూరంలోను కల మారారి బీచ్ అక్కడ కల పర్యావరణానికే కాదు, శుభ్రతకు కూడా పేరొందినది. మీరు స్విమ్మింగ్, స్నార్కెలింగ్, సర్ఫింగ్ ఆటలు ఆడాలంటే, నీరు స్వచ్చంగా వుంటుంది. కేరళలోని ఇతర బీచ్ ల వాలే కాకుండా మారారి లో మీరు కొంత కేరళ విలేజ్ లైఫ్ కూడా ఆనందించవచ్చు. ఇక్కడి గ్రామస్తులు, సముద్రంలో చేపలు పట్టేందుకు వెళతారు. గ్రామంలోని మహిళలు కాయిర్ మత్ లు, బ్రష్ లు తయారు చేస్తారు. ఎక్కడ వుండాలి ? మరారి బీచ్ రిసార్ట్ లో వసతి పొందవచ్చు
బెకాల్
దక్షిణ కేరళ యొక్క ఉత్తరంలోని చివరి భాగం లో కల కాసర్గోడ్ బెకాల్. లక్సరీ పర్యటన మ్యాప్ లో ఇటీవలే చేరింది. ఇక్కడ కేరళలోని ఒక పురాతన ఫోర్ట్ కలదు. ఫోర్ట్ చూడవచ్చు. కొబ్బరి తోటల గుండా ప్రయాణించి బోటు లో బ్యాక్ వాటర్స్ ప్రయాణం ఆనందించవచ్చు. బెకాల్ బీచ్ కు కేరళ గుండా కంటే, మంగళూరు నుండి వెళ్ళటం తేలిక. స్విమ్మింగ్ లో మీరు ఫోర్ట్ అందాలను చూసి ఆనందించవచ్చు. వసతి ఎక్కడ పొందాలి ? విస్తారమైన వివంటా తాజ్ లో వసతి పొందవచ్చు

కోవలం
కోవలం తిరువనంతపురం నుండి 16 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ మూడు బీచ్ లు కలవు. అవి హవా బీచ్, లైట్ హౌస్ బీచ్ మరియు సముద్ర బీచ్. కోవలం బీచ్ ఎంతో కాలంగా ప్రసిద్ధి. ఒకే చోట కల ఈ మూడు బీచ్ లు పర్యాటకులను వివిధ రకాలుగా ఆకర్షిస్తాయి. సముద్ర బీచ్ లో ఎక్కువ జనం వుండరు. ఒంటరిగా ఆనందిన్చాలనుకునే వారికి ఇది సరైనది. వసతి ఎక్కడ పొందాలి ? హోటల్ లీలా, కోవలం.
కప్పడ్
కప్పడ్ బీచ్ కేరళలో బహుసా ఒక చారిత్రాత్మక బీచ్. క్రీ. శ. 1498 లో వాస్కోడా గామా తన ఓడలను ఇక్కడ చేర్చాడు. కోజికోడ్ కు ఈ బీచ్ 16 కి. మీ. ల దూరం. ఈ బీచ్ కొంత భాగం రాతి, కొంత భాగం మెత్త గా వుంటుంది. కప్పడ్ యొక్క ప్రశాంత నీరు స్విమ్మింగ్ కు బాగుంటుంది. కోజికోడ్ బ్యాక్ వాటర్స్ గుండా ఈ బీచ్ కు చేరటం ఒక మరువ లేని అనుభవం. బీచ్ లో ఒక పెద్ద రాక్ పై 800 సంవత్సరాల నాటి టెంపుల్ కలదు. కప్పడ్ వెళితే ఎక్కడ దిగాలిల్ ? కడవు రిసార్ట్ మరియు ఆయుర్వేద సెంటర్ సౌకర్యంగా వుంటుంది.
ఈ బీచ్ లకు చేరాలంటే, కోచి, తిరువనంతపురం లేదా మంగళూరు లకు ఫ్లైట్ లో వెళ్లి అక్కడనుండి చేరవచ్చు. ముంబై మరియు న్యూ ఢిల్లీ ల నుండి కోచి కి, మంగళూరు కు స్పైస్ జెట్ ఫ్లైట్ లు మరియు తిరువనంతపురం కు జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ లు కలవు.



Click it and Unblock the Notifications














