తమ భావాలను, లక్ష్యాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకునేందుకు సరైన సమయమిది. కుటుంబంతో గడిపే అలాంటి అనుభవాలను నాలుగు గోడల మధ్యే పంచుకోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి. హాయిగా బాహ్య ప్రపంచంలో విహరిస్తూ.. జీవితంలో మర్చిపోలేని ఆ అనుభూతులను మనసారా ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకే వర్షాకాలంలో మన దేశంలోని కుటుంబ సమేతంగా విహారయత్రకు అనువైన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూద్దాం.

కుటుంబంతో విహారయాత్రకు ఈ ప్రదేశాలు అనువైనవి!
సాధారణంగా వర్షాకాలం అంటే కుటుంబ సభ్యులందరూ ఓ చోట గడిపే సీజన్. తమ భావాలను, లక్ష్యాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకునేందుకు సరైన సమయమిది. కుటుంబంతో గడిపే అలాంటి అనుభవాలను నాలుగు గోడల మధ్యే పంచుకోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి. హాయిగా బాహ్య ప్రపంచంలో విహరిస్తూ.. జీవితంలో మర్చిపోలేని ఆ అనుభూతులను మనసారా ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకే వర్షాకాలంలో మన దేశంలోని కుటుంబ సమేతంగా విహారయత్రకు అనువైన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూద్దాం.

డార్జిలింగ్
ఈ ప్రాంతంలో ప్రశాంతతను అందించే సూర్యోదయాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. అలాంటి హ్యాపీ లైఫ్‌ని నిద్ర లేవగానే ప్రారంభించాలనుకుంటే మీరు కుటుంబ సమేతంగా డార్జిలింగ్‌కి వెళ్లాల్సిందే. ముఖ్యంగా అడ్వెంచర్ లవర్స్ మాత్రం ఇక్కడికి తప్పక వెళ్లాలి. చుట్టూ శిఖరాగ్రాలతో నిండ ఉంటుంది. అందుకే దీనిని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారు. మంచు దుప్పటి కప్పుకున్న టైగర్ హిల్స్ మధ్యలో ఉన్న హోటల్స్‌లో నివసిస్తూ ఆ కొండల అందాన్ని ఆస్వాదించవచ్చు. ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లు దర్శనమిచ్చే తేయాకు తోటలు ఇక్కడ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఉదయాన్నే సూర్యోదయంతో పాటు ఇక్కడి జందీ డారా సన్ సెట్ పాయింట్ నుంచి సూర్యాస్తమయం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది.

లడఖ్
కొండల మధ్య చల్లని గాలిని ఎంజాయ్ చేయాలని మీరు భావిస్తే వెంటనే లడఖ్ ట్రిప్‌కి వెళ్లాల్సిందే. సముద్ర మట్టానికి సుమారు 2750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో భౌద్దులు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని చిన్న టిబెట్ అంటారు. లడఖ్, జాన్ స్కర్ రేంజ్ మధ్యలో బృందాలుగా ఎంజాయ్ చేయవచ్చు. అక్కడి వానల్లో అందరూ ముద్దయిపోవచ్చు. ఇది మీకు జీవితాంతం మర్చిపోలేని అనుభూతులను అందిస్తుంది ఇక్కడి వాతావరణం. బైకింగ్, వాటర్ రాఫ్టింగ్, సఫారీలు మొదలైన సాహస క్రీడలకు ఇది ఎంతో అనువైన ప్రాంతం. హిమాలయాల మధ్యనున్న ఈ ప్రదేశంలోని పచ్చని ప్రకృతి, పొలాలు చూసి ఆనందించవచ్చు. ఇక్కడి టిబెటన్, బుద్ధిస్ట్ మోటిఫ్స్‌తో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ షాపింగ్ చేయవచ్చు. అంతేకాదు.. మంచి ఉన్నితో చేసిన స్వెట్టర్ల వంటివి కూడా తక్కువ ధరకే లభిస్తాయి.

ధర్మశాల
ధర్మశాల హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ హిల్ స్టేషన్. ఎక్కువగా బౌద్ధ సన్యాసులు నివసించే ఈ ప్రాంతం చాలా మంచి పర్యాటక ప్రాంతం కూడా. టి తోటలకు ప్రసిద్ధి పొందింది. వివిధ రకాల టీ ఉత్పత్తులను ఇక్కడ రుచి చూడవచ్చు. దగ్గర్లోని బాగ్సునాగ్ జలపాతం, బౌద్ధారామాలు వంటివి చూడొచ్చు. హిమాలయాల పక్కనే ఉండడం వల్ల క్యాపింగ్, ట్రెక్కింగ్ వంటివి చేయడానికి చక్కటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. పైన్, ఓక్ అడవుల గుండా వాగులు, వంకలూ దాటుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న బిర్‌లో పారాగ్లైడింగ్ అనుభవం జీవితంలో మర్చిపోలేం. అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన క్రికెట్ స్టేడియంలలో ఒకటైన ధర్మశాల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇక్కడ చూడొచ్చు.

కేరళ
మానసిక ఒత్తిడికి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా ఒక్క వర్షాకాలంలోనే కాకుండా ఏ సీజన్‌లోనైనా కేరళ టూర్ ప్లాన్ చేసుకోవచ్చ. అయితే వానాకాలంలో ఇక్కడి బ్యాక్ వాటర్స్‌ని చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడి అద్బుతమైన టీ తోటల సొగసును చూసి తీరాల్సిందే. అంతేకాదు.. ఇక్కడి అద్భుతమైన జలపాతాలు సందర్శకుల మనసు దోచేస్తాయి. ముఖ్యంగా త్రిసూర్‌లోని అతిరాపల్లి జలపాతానికి బాహుబలి చిత్రంతో మన దగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేశాయి. ఇక వీటితో పాటు అద్బుతమైన హౌజ్ బోట్స్, రుచికరమైన చేపల కూరలు వంటివన్నీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.



Click it and Unblock the Notifications













