Search
  • Follow NativePlanet
Share
» »డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు భార‌త్‌లోని అనువైన ప్ర‌దేశాలు...

డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు భార‌త్‌లోని అనువైన ప్ర‌దేశాలు...

ఇటీవ‌లే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ విదేశాల్లో వివాహాలు చేసుకోవ‌డం ఎందుకు.. భార‌త‌దేశంలోనే పెళ్లిళ్లు చేసుకోవ‌చ్చు క‌దా అనే ప్ర‌స్తావ‌న ఒక‌టి లేవ‌నెత్తారు. చాలామంది ఈ మ‌ధ్య‌కాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ పేరిట విదేశాల‌కు వెళ్లిపోతున్నారు. అక్క‌డే ఎంతో గ్రాండ్‌గా పెళ్లి వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. భార‌త‌దేశంలో కూడా డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వివాహాన్ని గుర్తుండిపోయే విధంగా చేసుకోవాల‌నుకుంటున్నారు. ఇష్ట‌మైన ప్ర‌దేశంలో, మ‌న‌కు న‌చ్చిన విధంగా చేసుకునే పెళ్లినే డెస్టినేష‌న్ వెడ్డింగ్ అంటారు. కానీ, చాలామంది ఈ పెళ్లిళ్ల‌కు ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది అనే భ్ర‌మ‌లో ఉంటారు. కానీ, త‌క్కువ బ‌డ్జెట్‌తో కూడా ఈ పెళ్లిళ్ల‌ను చేసుకోవచ్చు. త‌క్కువ ఖ‌ర్చుతో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసే ప్ర‌దేశాలు భార‌త‌దేశంలో కూడా ఉన్నాయి. ఆ ప్ర‌దేశాలేంటో ఒక‌సారి చూసేద్దాం.

kovalamwedding ,destination

కోవలం

కేరళ రాజధాని తిరువనంతపురం నుండి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవలం నగరం ఎంతో అంద‌మైన ప్ర‌దేశం. ఇది కేవ‌లం కోవలం అందమైన బీచ్‌లు, తాటి చెట్లకు మాత్ర‌మే ప్రసిద్ధి చెందింది కాకుండా, ఇక్క‌డ పరిశుభ్రమైన రోడ్లు, చుట్టూ వ్యాపించిన పచ్చదనం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా కూడా ప్ర‌సిద్ధిచెందింది. డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకునేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ద‌నే చెప్పుకోవాలి. కేవ‌లం 200 మంది అతిథులతో ఈ ప్రదేశంలో వివాహాన్ని ప్లాన్ చేయొచ్చు. అతి త‌క్కువ ఖ‌ర్చుతో, మీకు న‌చ్చిన విధంగా ఇక్క‌డ పెళ్లి జ‌రుగుతుంది.

rajasthan wedding destination

రాజస్థాన్

డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌ను మించిన అందమైన నగరం మరొకటి ఉండదు. రాజస్థాన్‌లోని జైపూర్-ఉదయ్‌పూర్, జోధ్‌పూర్ మరియు జైసల్మేర్ వంటి నగరాలు ఈ పెళ్లిళ్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ఇక్కడ వివాహా వేడుక‌ల‌ను ఎంతో రాచ‌రికంగా, హుందాగా చేసుకోవ‌చ్చు. ఈ నగరాల్లోని కొన్ని వివాహ వేదికలు చాలా ఖరీదైనవి. కానీ బ‌డ్జెట్‌కు అనుగుణంగా మంచి వాస్తుశిల్పం ఉన్న వేదికలు రాజ‌స్తాన్‌లో కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లో సుమారు 100 మంది అతిథుల కోసం త‌క్కువ బ‌డ్జెట్‌తో ఉండే ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్ర‌దేశాల్లో మీ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకోవ‌చ్చు.

రిషికేశ్

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ విహారయాత్రకు మాత్రమే కాదు, వివాహాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి స‌హజ సౌంద‌ర్యాలు ఫోటో ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. గంగా నది ఒడ్డున క‌లిగిన‌ వివాహ వేదిక‌లో పెళ్లి ఎంతో వైభ‌వంగా ఉంటుంది. ఈ ప్ర‌దేశాల్లో 200 మంది అతిథులతో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకోండి. త‌క్కువ ఖర్చుతో న‌చ్చిన విధంగా ఇక్క‌డ వివాహ వేడుక‌లు చేయొచ్చు.

uttarakhand , sikkim

సిక్కిం

హల్దీ నుండి మెహందీ వేడుక‌లు అన్నీ ఈ ప్రాంతంలో చేసుకోవ‌చ్చు. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు ఎంతో అనువైన ప్ర‌దేశం ఇది. ఎందుకంటే, ఇక్కడ ప్రశాంతమైన లోయలు వివాహపు క్ష‌ణాల‌ను మ‌రింత అందంగా మారుస్తాయి. తక్కువ బడ్జెట్ ఉన్న వారికి ఈ నగరం ఉత్త‌మ‌మైన ఎంపిక‌. ఇక్కడ 200 మంది అతిథులు విడిది చేసేందుకు సౌక‌ర్యంగా ఉంటుంది.

గోవా

డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు గోవా ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. తక్కువ బడ్జెట్‌తో గోవాలోని కొన్ని ప్రదేశాలను సంద‌ర్శించ‌డంతో పాటు వివాహ వేడుక‌లు కూడా చేసుకోవ‌చ్చు. 200 మంది అతిథుల‌తో ఈ ప్ర‌దేశంలో ఎంతో వైభ‌వంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్ర‌ణాళిక‌లు చేసుకోవ‌చ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+