Search
  • Follow NativePlanet
Share
» »మీ శృంగేరి పర్యాటకం వీటిని చూస్తేనే పరిసమాప్తం

మీ శృంగేరి పర్యాటకం వీటిని చూస్తేనే పరిసమాప్తం

శృంగేరి చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

భారతీయ ఆధ్యాత్మిక పర్యాటకంలో శృంగేరి లోని శారదా పీఠం, అక్కడే ఉన్న శారదా మాత దేవాలయం సందర్శన మొదటి జాబితాలో ఉంటుంది. కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శన కోసం కన్నడిగులే కాకుండా భారత దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి నిత్యం భక్తులు వస్తుంటారు.

అయితే ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది శారదా మాత ఆలయాన్ని చూసి వెనుతిరుగుతుంటారు. అయితే ఈ శృంగేరికి దగ్గర్లోనే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో కైగా జలపాతం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఈ శృంగేరితో పాటు చుట్టు పక్కల చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన క్లుప్త వివరాలు మీ కోసం..

కైగా జలపాతం

కైగా జలపాతం

P.C: You Tube

శృంగేరి కి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణమే కైగా. కైగా పచ్చటి అడవులతో నిండి ఉండటంతో ఫొటోగ్రఫి అంటే ఇష్టపడే వారికి ఈ కైగా స్వర్గధామం. అంతే కాకుండా చిన్నటి జలపాతాలతో కూడిన ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కు అనుకూలం

శృంగేరి మఠం

శృంగేరి మఠం

P.C: You Tube

శృంగేరి మఠాన్ని ఆదిశంకరాచార్యలు 8 వశతాబ్దంలో ఏర్పాటు చేశారు. భారత దేశంలో ఉన్న నాలుగు విశిష్టమైన పీఠాల్లో శృంగేరి మఠం మొదటిది. భారతీయ సంప్రదాయాలు, వేదాలు, ధర్మాలు పరిరక్షణ ఈ పీఠం ముఖ్య ఉద్దేశం. ఈ మఠంలో శారదాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు.

హొరనాడు

హొరనాడు

P.C: You Tube

శృంగేరి నుంచి కేవలం 42 కిలోమీటర్ల దూరంలోనే ఈ హెరనాడు ఉంటుంది. పచ్చటి అడవి మధ్యలో ఉన్న ఈ హెరనాడులో అన్నపూర్ణేశ్వరి కొలువై ఉన్నారు. ఇక్కడ కాఫీ, టీ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్షేత్రంలోని అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవడం వల్ల దారిద్రం దరిచేరదని భక్తులు నమ్ముతారు.

శారదామాత దేవాలయం

శారదామాత దేవాలయం

P.C: You Tube

ఈ శారదామాత దేవాలయ నిర్మాణం ఆదిశంకరాచార్యుల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యిందని చెబుతారు. దక్షిణ భారత దేశ వాస్తు శైలి ఈ దేవాలయంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని రాతి స్తంభాల పై అనేక శిల్పాలు మనకు భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పుతాయి.

విద్యాశంకర దేవాలయం

విద్యాశంకర దేవాలయం

P.C: You Tube

విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరి లో చూడదగిన ప్రదేశం. పీఠాధిపతి విద్యాశంకర్ సంస్మరణార్థం ఈ దేవాలయాన్ని నిర్మించారు. విజయ నగర రాజులు నిర్మించిన ఈ దేవాలయం కూడా శిల్పకళ కాణాచి. వీటితో పాటు తోరణగణపతి, కెరే ఆంజనేయ స్వామి దేవాలయం, ఆదిశంకర దేవాలయం దర్శించదగినవి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+