Search
  • Follow NativePlanet
Share
» »ఈ కొండల్లోని శిల్పాల్లో వజ్రవైడూర్యాలు ఉన్నాయా? అందుకే రాక్షసంగా, రహస్యంగా..

ఈ కొండల్లోని శిల్పాల్లో వజ్రవైడూర్యాలు ఉన్నాయా? అందుకే రాక్షసంగా, రహస్యంగా..

భారత దేశం అన్ని మతాలను ఆదరించింది. గౌరవించింది. అందుకే ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడే అన్నిరకాల మతాల వారు ఎంతో స్వేచ్ఛయుత వాతావరణంలో జీవిస్తున్నారు. ఇది అనాదిగా వస్తోంది. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలను మనం చూడవచ్చు. బౌద్ధధర్మం కూడా మన దేశంలో ఉచ్ఛస్థితిని అనుభవించింది. ఆ సమయంలో నిర్మించిన గుహాలయాలు, బౌద్ధ స్థూపాల్లో అనేక వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని భావించి కొంతమంది అక్కడి వెలకట్టలేని శిల్పసంపదను నాశనం చేస్తూ రాక్షసానాందం పొందుతున్నారు. మరికొంతమంది ఆ నిధులను రహస్యంగా శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతాల్లో కొన్ని పర్యాటక ప్రాంతాలుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అటువంటి ఓ పర్యాటక ప్రాంతం గురించిన వివరాలు మీ కోసం...

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో సంకరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామం శివారులో మనకు బొజ్జనకొండ, లింగాల కొండలు కనిపిస్తాయి.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

పూర్వం ఈ గ్రామంలో బౌద్ధ ధర్మాలైన హీనాయాన, మహాయాన, వజ్రాయన శాఖలు ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవి. ముఖ్యంగా క్రీస్తు శంక 4 నుంచి 9 శతాబ్దం మధ్య కాలంలో ఇక్కడ బౌద్ధ ధర్మం ఉచ్చస్థితిలో ఉండేదని చెబుతారు. మొదట్లో ఈ ప్రాంతాన్ని సంఘరం అని పిలిచేవారు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

కాలక్రమంలో సంఘరం కాస్త సంకరం అయ్యింది. ఈ సంకరం ఉత్తర దిక్కులో బొజ్జన కొండ, పశ్చిమ దిక్కుకు లింగాల కొండ ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలు నిత్యంపచ్చదనంతో కళకళలాడుతాయి.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఈ రెండు చోట్ల ఏక శిలలో చెక్కబడిన అనేక స్థూపాలు, స్తంభాలు నయనమనోహరంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొండ గుహలను తొలిచి నిర్మించిన బౌద్ధశ్రమాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

దీంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగో శతాబ్దం నుంచి దాదాపు 500 ఏళ్ల బౌద్ధ ధర్మం ప్రాచూర్యంలో ఉండేదని తెలుస్తోంది. ఈ కాలంలో నిర్మించిన పలు దేవాలయాలు, గుహాలయాలు, ధార్మిక స్థలాల్లో బౌద్ధ వాస్తుశైలిని మనం గమనించవచ్చు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దుకొన్నాయి. ఎంతో నిబద్ధతతో అందంగా నిర్మించిన బౌద్ధారామల్లో బొజ్జనకొండ మొదటివరుసలో ఉంటుంది. ఇక్కడ ఉన్న బౌద్ధఆరామాన్ని సంఘర బౌద్ధారామం అంటారు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఇక్కడ ఉన్న మహాస్థూపాలు, స్తూపాల పై బుద్ధిని సూక్తులను మనం పాళీ భాషలో గమనించవచ్చు. ఆ కాలంలోనే ఆధునిక ఇంజనీరింగ్ కు తీసుపోని నీరితో నిర్మించిన గుమ్మటాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఈ గుమ్మటాలను నిర్మించడానికి బాగా కాల్చిన ఇటుకలను వాడారు. ఇటుకలను వాడి గుమ్మటాలే కాకుండా చైతన్యాలు, ఆరామాలతో పాటు కొన్ని రకాల శిల్పాలను కూడా మనం చూడవచ్చు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

అదే విధంగా బొజ్జన కొండలో హరిత అనే పేరుగల దేవతా విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు బౌద్ధ సాహిత్యంలో హరిత దేవతకు విశేష ప్రాధాన్యత ఉంది. మొత్తంగా బొజ్జనకొండలో ప్రధానంగా ఆరు గుహాలయాలు ఉన్నాయి.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

వాటితో పాటు మరికొన్ని ఆలయాలను కూడా చూడవచ్చు. ప్రధాన గుహాలయంలో మధ్యలో స్థూపం దాని చుట్టూ మరో 16 చిన్న స్థూపాలను నిర్మించారు. ప్రధాన స్థూపం పై గుమట్టం వేలాడుతూ ఉంటుంది.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఈ గుహాలయం పై భాగంలో బుద్ధిని విగ్రహాన్ని మనం చూడవచ్చు. ధ్యానముద్రలో ఉన్న బుద్ధిడితో పాటు అతనికి సేవచేస్తున్న శిష్యుల విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఇక పశ్చిమ వైపున ఉన్న లింగాల కండలో కూడా అనేక స్థూపాలు, చైతన్యాలను మనం చూడవచ్చు. క్రీస్తుశకం 1907 నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఇక్కడ పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపారు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఆకాలంలో అనేక టెర్రకోట శిల్పాలు బయటపడ్డాయి. అంతేకుండా సముద్రగుప్తుడి కాలంనాటి బంగారు నాణ్యాలు కూడా లభించాయి. అంతేకాకుండా పశ్చిమ చాళుక్యుల కాలం నాటి తామ్ర నాణ్యాలు కూడా ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఆ సమయంలో ఈ బొజ్జన కొండను బుద్ధిని కొండ అని పిలిచేవారని చారిత్రాత్మక ఆధారాలను అనుసరించి తెలుస్తోంది. ప్రస్తుతం వైశాఖ పౌర్ణమి రోజును ఈ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు.

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

బొజ్జన కొండ, లింగాల కొండ, విశాఖపట్నం

P.C: You Tube

ఈ బొజ్జనకొండ, లింగాలకొండకు దగ్గర్లోనే బౌద్ధధర్మం విలిసిల్లిన తోట్ల కొండ, బావికొండ, పావురాల కొండ తదితర బౌద్ధమత క్షేత్రాలను కూడా చూడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+