Search
  • Follow NativePlanet
Share
» »ఈ నెల 9 నుంచి 27వ‌ర‌కు ఇంద్ర‌కీలాద్రీపై బ్ర‌హ్మోత్స‌వాలు..

ఈ నెల 9 నుంచి 27వ‌ర‌కు ఇంద్ర‌కీలాద్రీపై బ్ర‌హ్మోత్స‌వాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధిపుణ్య‌క్షేత్రాల‌లో విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఒక‌టి. ఈ నెల 9వ తేదీన ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రీపై బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదినుంచి 27 వ‌ర‌కు ఆధ్యాత్మిక ఉత్స‌వాలను నిర్వ‌హించ‌నున్నారు.

ఇక‌, ఉగాది వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 9 వ తేదీ నుంచి 18 వరకు ప్రత్యేక పుష్పార్చణలను నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం ఏప్రిల్ 19వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించ‌నున్నాయి.

brahmotsavaluonindrakiladri

9 నుంచి 27 వ‌ర‌కు పుష్పార్ఛ‌ణ‌లు ...

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణం ఉంటుంది. ఈ నెల 24వ తేది పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 19వ తేదిన వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవలో ఆది దంపతులు భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్‌లో 9వ తేది నుంచి క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ప్రారంభంకానున్నట్లు విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. ఇక‌, బుధవారం నాడు చైత్ర మాస బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఈవో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. అమ్మ‌వార్ల ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వివ‌రించారు. ఏప్రిల్ 9న ఉగాది సంద‌ర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు పంచగ శ్రవణం జరుగుతుందని ఆల‌య అధికారులు పేర్కొన్నారు.

ఏప్రిల్ 24న ఉదయం పది గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర క్రుష్ణానదిలో తెప్పోత్సవం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 9 నుంచి 27 వ‌ర‌కు పుష్పార్ఛ‌ణ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

brahmotsavaluonindrakiladri1

ప్రత్యేక పుష్పార్చన సేవలు..

ఈ నెల 9వ తేదీన‌ అమ్మవారికి మల్లెపూలు, మరువముతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేస్తారు.

ఏప్రిల్ 10 న కనకాంబరాలు, గులాబీలతో ప్ర‌త్యేక పూజ‌లు,

ఏప్రిల్ 11 న చామంతి, ఇతర పుష్పములతో పుష్పార్చ‌న‌లు

ఏప్రిల్ 12 న మందార పుష్పములు, ఎర్ర కలువలతో పుష్పార్చ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఏప్రిల్ 13 వ తేదిన తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువము, ధవళముతో పుష్పార్చ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఏప్రిల్ 14 వ తేదిన కాగడా మల్లెలు, జూజులు, మరువము పుష్పార్చ‌న‌లు ఉంటుంది.

ఏప్రిల్ 15 న ఎర్ర తామర పుష్పములు, ఎర్ర గన్నేరు, సన్నజాజులతో పుష్పార్చ‌న‌లు నిర్వ‌హిస్తారు.

ఏప్రిల్ 16 న చామంతి, సంపంగి పుష్పములతో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ నెల 17 న కనకాంబరాలు, గులాబీల‌తో పూజ కార్య‌క్ర‌మం ఉంటుంది.

18వ తేదీ న కనకాంబరాలు, వివిధ రకాల పుష్పములతో ప్రత్యేక పుష్పార్చణలు నిర్వ‌హిస్తారు.

More News

Read more about: vijayawada andhrapradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+