Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ‌లోని సముద్రంలో ఉండే వంతెన...ప్ర‌త్యేక‌త‌లు...

విశాఖ‌లోని సముద్రంలో ఉండే వంతెన...ప్ర‌త్యేక‌త‌లు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో ఎటుచూసిన మ‌న‌కు బీచ్‌లే క‌నిపిస్తాయి. ఈ ప్రాంతం ఎక్కువగా బీచ్‌ల‌కు ప్ర‌సిద్ధిచెందింది. రామ‌కృష్ణ‌, బీచ్‌, భీమీలి బీచ్ ఇలా చాలా ఉన్నాయి. స‌ముద్ర తీర‌పు అందాల‌ను చూస్తు ఉండిపోవాల‌ని చాలామందికి అనిపిస్తుంటుంది. అందుకోసం చాలామంది ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుక వెళ్తుంటారు. ఇక్క‌డ ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి‌. ఆ ప్రదేశాల్లో అన్నిట్లో కూడా సంద‌ర్శ‌కులు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న స్పాట్లు చూస్తే తిరిగి ఇంటికి వెళ్లాల‌నిపించ‌దు. వైజాగ్‌లో సముద్రంలో ఉండే వంతెన‌ను చూశారా? ఇది ఇక్క‌డ ఎప్ప‌టినుంచి ఉన్నా? ఈ వంతెన నిరూప‌యోగంగా ఉంది. కానీ, ఈ ప్ర‌దేశం వంతెనకు ఎంతగాన ప్ర‌సిద్ధిచెందింది.

ఇది విశాఖపట్నం నుంచి భీమిలికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ సిటీ నుంచి అయితే మాత్రం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తగరపువలసకు స‌మీపంలో దివీస్ సంస్థ ఉంది. ఆ సంస్థ‌నుంచి ఒక మూడు మ‌నం చెప్పుకునే స‌ముద్రంలోని వంతెన వ‌చ్చేస్తుంది. ఈ ప్ర‌దేశంలో బ్రిటిష్ కాలానికి సంబంధించిన ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయ‌ట‌. ఈ వంతెన అన్నవరానికి స‌మీపంలో ఉంటుంది. ఈ స‌ముద్రంలోని వంతెన‌ను చూసేందుకు చాలామంది ఇక్క‌డికి వ‌స్తుంది. ఇది భీమీలీ బీచ్‌లో ఉండే వంతెన‌. బ్రిటిష్ కాలంలో భీమిలికి, ఓడరేవుకి చాలా ప్రాముఖ్యత ఉండేదని, అందుకే ఆ కాలంలోని భీమీలీ బీచ్‌లో ఈ వంతెన నిర్మాణం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. 1990లో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని అప్పటికే దీని అవసరాలు లేకపోవడంతో ఈ వంతెన కాస్త నిరూప‌యోగంగా మారిందిని స్థానికులు వివ‌రిస్తున్నారు.

bhimilibeachbridge1

ఇక, కాలానికి అనుగుణంగా విశాఖలో పోర్ట్ లు రావడం, ప్రైవేట్ పోర్ట్ ల ద్వారా షిప్ లు ల్యాండ్ అవ్వడంతో ఇలాంటి బ్రిడ్జిల అవ‌స‌రం అస‌లు లేకుండా పోయింది. ఇప్ప‌డు ఈ వంతెన కేవ‌లం సందర్శనకు మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఈ వంతెన‌ను దివిస్ సంస్థ ఉప‌యోగించుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక స‌ముద్రంలో ఉండే వంతెన‌ను చూడాలంటే బయట నుంచి చూడడమే తప్ప దీని ద్వారా సముద్రం లోపలికి మాత్రం వెళ్లలేమని స్థానికులు అంటున్నారు. దీనిపై న‌డ‌క ప్ర‌మాదమ‌ని బ్రిడ్జి నిర్వహాకులు అనుమతులు ఇవ్వడం లేదు.

సముద్రంలో ఉండే ఈ వంతెను సుమారు పావు కిలోమీటర్ దూరం వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జి స్తంభాలు మరమ్మత్తులు చేసి వాటిని‌ నిర్వహణలో భాగంగా ఉంచారు. ఈ బీచ్‌లో ఉండే వంతెనకి మొదట్లో గేటు సౌక‌ర్యం కూడా ఉండేది. ఆ గేటు పక్కనుంచి చిన్న మార్గంలో డి బీచ్ ఉంటుంది. ఈ బీచ్ నుంచే ప‌ర్యాట‌కులు వంతెన స్తంభాల‌న్నీ చూస్తారు. అక్క‌డికి వెళ్ల‌డం వంటివి చేయ‌కూడ‌దు. అది ఎంతో ప్ర‌మాదక‌రం. కేవ‌లం ఈ వంతెనను సంద‌ర్శ‌న‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. ఈ బ్రిడ్జి పై నుంచి ఎలాంటి రాకపోకలకు అనుమతి లేదు.

vizagbeaches

ఎలా చేరుకోవాలి...

ఈ ప్ర‌దేశాన్ని చేరుకునేందుకు రెండు మార్గాలు క‌ల‌వు. ఒక‌టి హైవే నుంచి చేరుకోవ‌చ్చు. అక్క‌డి నుంచి తగరపువలస దాకా వచ్చి దివిస్ సంస్ధ రూట్ మీదుగా ఈ బీచ్ వంతెనకి చేరుకోవచ్చు. రెండో మార్గం...ఆర్కే బీచ్ రోడ్ నుంచి రుషికొండ సాగర్ వ‌ర‌కు చేరుకుని అక్క‌డి నుంచి తొట్లకొండ, భీమిలి నుంచి చిప్పాడ వచ్చి దివిస్ నుంచి రావొచ్చు. అయితే ఈ మార్గాలు బాగా తెలిసి ఉంటేనే ఈ ప్ర‌దేశాన్ని సులువుగా చేరుకోగ‌లం. లేక‌పోతే కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఈ ప్ర‌దేశానికి స్నేహితుల‌తో, కుటంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లొచ్చు. కార్‌లో లేదా టూవీర్‌లో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+