న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకునేందుకు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో చాలామంది కొత్త ప్రదేశాల్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటారు. అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. కాబట్టి దేశంలో సందర్శించదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో ఈ రణగోణ ధ్వనులకు దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా భారత్‌లోని ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఈ ప్రదేశాలు శీతాకాలంలో మరింత ఆహ్లాదభరితంగా ఉంటాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాల అందం మరింత రెట్టింపవుతుంది. మరెందుకాలస్యం ఆ ప్రదేశాను చూద్దాం పదండి...
ఖిమ్‌సర్, రాజస్థాన్
రాజస్థాన్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ శీతాకాలం. కానీ ఈ సీజన్‌లో ఉదయపూర్ లేదా జైసల్మేర్ ఈ సమయంలో పర్యాటకులతో నిండి ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలనుకునేవారు ఈ ప్రదేశాల నుండి దూరంగా ఉన్న ఓ అందమైన గ్రామానికి వెళ్లండి. అదే రాజస్థాన్‌లోని ఖిమ్‌సర్ గ్రామం. ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు పర్యాటకులు ఓ విభిన్నమైన అనుభూతిని పొందుతారు. ఈ గ్రామం మొత్తం ఎడారి చుట్టూ ఉంటుంది. ఈ ప్రాంతానికి రావడం ద్వారా జైసల్మేర్ వంటి సఫారీని కూడా ఆస్వాదించేసేయొచ్చు. రాజస్థాన్‌లోని ఖిమ్‌సర్ ముఖ్యంగా ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది.

పూవార్, కేరళ
కేరళలోని ప్రతి ప్రదేశం ఎంతో నిర్మలంగా, సుందరంగా ఉంటుంది. ఈ న్యూయర్ వేడుకలు నిర్వహించుకునేందుకు ఈ ప్రదేశం ఎంతో అనువైనది. కేరళలోని పూవార్ చాలా అందమైన గ్రామం. ఇది తిరువనంతపురం దక్షిణ కొనలో ఉంది. కేరళలోని పూవార్ గ్రామాంలో అనేక కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడి బీచ్‌లో విశ్రాంతి తీసుకోవడమే కాకుండా, హౌస్ బోట్‌లో బస కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రసిద్ధిచెందిన శివాలయం కూడా ఉంది. దాని పేరు అజిమల శివాలయం. ఈ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. పూవార్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు. కాబట్టి మీరు ఈ న్యూయర్ వేడుకలను ఇక్కడ జరుపుకోవచ్చు.
లాచుంగ్, సిక్కిం
సిక్కింలో ఉన్న లాచుంగ్ గ్రామం కూడా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకునేందుకు ఉత్తమ ప్రాంతం. 2400 మీటర్ల ఎత్తులో ఉన్న లాచుంగ్ నగర రద్దీకి దూరంగా ఉంటుంది. బహుశా ఈ కారణంగానే ఈ ప్రదేశం అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే నమ్మండి. లాచుంగ్ భారతీయుల కంటే ఎక్కువ మంది విదేశీ పర్యాకులు సందర్శించే ప్రదేశం. టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న లాచుంగ్ గ్రామం చుట్టూ అన్ని వైపులా ఎత్తైన మంచు పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ సీజన్‌లో సందర్శించేందుకు ఉత్తమ గమ్యస్థానం ఇది.

మలానా, హిమాచల్ ప్రదేశ్
న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకునేందుకు హిమాచల్ ప్రదేశం కూడా ఎంతో ఉత్తమం. మలానా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అందమైన చిన్న కుగ్రామం. కులు జిల్లాలో ఉన్న మలానా గ్రామం దాని అందంతో పాటు సంస్కృతి, మత విశ్వాసాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. సాహసప్రియులకు, అడ్వంచర్ ట్రిప్‌లు ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. చలికాలంలో ఇక్కడికి రావడం ద్వారా ఇక్కడి అందమైన హిమపాతాలను కూడా చూడొచ్చు.
లాండూర్, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ సమీపంలో ఉండే లాండూర్ న్యూఇయర్ వేడుకలకు అనువైన ప్రదేశం. ఇక్కడి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ప్రకృతి అందాలను చూడాలనుకునేవారు, అలానే సాహస ప్రియులకు ఈ ప్రదేశం ఎంతో ఉత్తమం. ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ ఇల్లు కూడా ఈ గ్రామంలోనే ఉంది. ఇక్కడ కెల్లాగ్స్ చర్చి, సెయింట్ పాల్స్, మెథడిస్ట్ చర్చి వంటి కొన్ని బ్రిటిష్ కాలం నాటి చర్చిలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications













