Search
  • Follow NativePlanet
Share
» »చంబా.. ఇదొక కొత్త జంటల స్వర్గధామం

చంబా.. ఇదొక కొత్త జంటల స్వర్గధామం

చంబా.. ఇదొక కొత్త జంట‌ల స్వ‌ర్గ‌ధామం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధ హిల్‌స్టేష‌న్ చంబా. ఇది ఓ అంద‌మైన పట్టణ ప్రాంతం. రావి నది ఒడ్డున సాల్ నదితో సంగమించే ప్రదేశంలో ఉంది. సముద్ర మట్టానికి 996 మీటర్ల ఎత్తులో ఉన్న చంబా హిమాచల్ ప్రదేశ్‌లోని ముఖ్యమైన పర్యాటక పట్టణాలలో ఒకటిగా ప్ర‌సిద్ధిగాంచింది. మ‌రీ ముఖ్యంగా కొత్త జంట‌ల స్వ‌ర్గ‌ధామంగా పేరుపొందింది చంబా. క్రీస్తుపూర్వం రెండ‌వ శతాబ్దానికి చెందిన కోలియన్ తెగలు పాల‌న నుంచి ఇక్కడి చరిత్రను గుర్తించవచ్చు.

ఈ అంద‌మైన కొండ ప్రాంతం గుప్తులు, రాజపుత్ర రాజవంశం చివరకు బ్రిటిష్ వారిచే అభివృద్ధి చేయబడింది. చంబా చుట్టుపక్కల ఉన్న భూభాగం ప్రధానంగా కొండలు, లోయలు, నదులతో ప్ర‌కృతిసిద్ధ‌మైన ప్ర‌సిద్ధ పర్యాటక కేంద్రం. చంబా సముద్ర మట్టానికి 900 నుంచి 1000 మీటర్ల ఎత్తులో హిమాలయాలకు దక్షిణాన ఎత్త‌యిన‌ ప్రదేశం కారణంగా సంద‌ర్శ‌న‌కు అనువుగా ఉంటుంది. అక్టోబరు చివరి నుండి ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి చివరి వరకు కొన‌సాగుతుంది. అప్పుడప్పుడు హిమపాతంతో కూడిన చలిని విస్త‌రింపజేస్తుంది ఇక్క‌డి వాతావ‌ర‌ణం. డిసెంబరు మరియు జనవరి నెలల్లో ఉష్ణోగ్రత -1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందట‌.

సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి ఉత్తమ సమయం

చంబా వర్షాకాలంలో పుష్కలంగా వర్షపాతం న‌మోద‌వుతుంది. ఇక్క‌డ వెచ్చని వేసవితోపాటు చల్లటి శీతాకాలాలను హాయిగా అనుభ‌వించ‌వ‌చ్చు. మార్చి మరియు జూన్ మధ్య నెలల్లో ఈ పట్టణం పర్యాటకులతో నిండి ఉంటుంది. అయితే, చంబా సందర్శించడానికి ఉత్తమ సమయం మాత్రం సెప్టెంబర్ చివరి మరియు నవంబర్ మధ్య ఉంటుంది. తిరోగమన రుతుపవనాల నుండి అప్పుడప్పుడు జల్లులతో కూడిన చల్లని వ‌ర్ష‌పు వాతావరణాన్ని ఇక్క‌డ ఆస్వాదించ‌వ‌చ్చు.

ప్ర‌ధాన ఆకర్షణలు

ప్ర‌ధాన ఆకర్షణలు

చంబా పట్టణం పాత మరియు కొత్త పట్టణాలుగా విభ‌జించ‌బ‌డ్డాయి. ఇక్క‌డ అనేక చారిత్రక నిర్మాణాల‌తోపాటు అరుదైన‌ స్మారక చిహ్నాలకు, పురాత‌న దేవాలయాలకు నిల‌యంగా చెప్పొచ్చు. ఈ పట్టణం మంచుతో కప్పబడిన ధౌలాధర్ మరియు జంస్కార్ శ్రేణుల మధ్య ఉన్న కార‌ణంగా మంచు వ‌ర్షాన్ని మ‌న‌సారా ఆస్వాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి అందాల‌ను పట్టణంలోని వివిధ వ్యూ పాయింట్ల నుండి వీక్షించవచ్చు. రావి మరియు సాల్ నది సంగమం పట్టణానికి ఒక అద్భుతమైన ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. చంపావతి ఆలయం, సుయి మాత ఆలయం, అఖండ చండీ ప్యాలెస్, శివాలయం, చౌగన్‌లు, చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్, చంబా లైబ్రరీ మరియు భూరి సింగ్ మ్యూజియంలు చంబాలోని కొన్ని ప్రసిద్ధ ఆకర్షణలు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

చంబా ప‌ట్ట‌ణం పర్వత ప్రాంతంలో ఉన్నప్పటికీ రోడ్డు మరియు రైలు మార్గాలు అనుసంధానించ‌బ‌డ్డాయి. సమీప బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్ పఠాన్‌కోట్ నగరంలో ఉంది. దీనిని బస్సులు లేదా టాక్సీల ద్వారా చేరుకోవచ్చు. పఠాన్‌కోట్ నుండి జోగిందర్ నగర్ వరకు నారో గేజ్ రైలు ద్వారా కూడా ప్రయాణించవచ్చు. కాంగ్రా, పఠాన్‌కోట్ విమానాశ్ర‌యాలు ద‌గ్గ‌రగా ఉన్నాయి.

ప్రధాన నగరాల నుండి దూరాల‌ను ప‌రిశీలిస్తే.. డల్హౌసీ నుంచి 55 కిలోమీటర్లు, పఠాన్‌కోట్ నుంచి 104 కిలోమీటర్లు, ధర్మశాల నుంచి 126 కిలోమీటర్లు, చండీగఢ్ నుంచి 331 కిలోమీటర్లు, సిమ్లా నుంచి 345 కిలోమీటర్లు, మనాలి నుంచి 353 కిలోమీటర్లు, మనాలి నుంచి 353 కిలోమీటర్ల దూరంలో ఉంది.

More News

Read more about: chamba hill station
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+