Search
  • Follow NativePlanet
Share
» »గోపురంలేని గుడిలో రెండు శివలింగాలంట...దర్శనంతో

గోపురంలేని గుడిలో రెండు శివలింగాలంట...దర్శనంతో

హుబ్లీలోని చంద్రమౌళేశ్వరస్వామి దేవస్థానం గురించి కథనం.

మనస్సు ఎప్పుడూ వేర్వేరే ప్రాంతాలను చూడాలని కోరుకొంటుంది. కొన్నిసార్లు పచ్చటి మైదానాలను, గలగలపారేజలపాతాలను చూడాలనుకొంటే మరికొన్నిసార్లు అద్భుత శిల్పసంపదను మనసారా వీక్షించాలని కోరుకొంటుంది. అలాంటి సమయంలో భారతీయ శిల్పకళ సంపదకు నిలయమైన దేవాలయాలను సందర్శించడం ఒక్కటే మార్గం.

ప్రస్తుతం అలాంటి దేవాలయం గురించే తెలుసుకొందాం. దాదాపు 900 ఏళ్లక్రితం నిర్మించిన ఈ దేవాలయంలో శివలింగం చతుర్భుఖంతో ఉండటం విశేషం. నాలుగు ముఖాలను నాలుగు వేదాలకు ప్రతీకగా భావిస్తారు. అందువల్లే ఈ దేవాలయ దర్శనంతో చదువులో విద్యార్థులు ముందుంటారని స్థానికుల నమ్మకం.

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

P.C: YouTube

జంటనగరాలైన హుబ్లీ-ధార్వాడ నగరాల మధ్య ఉణకల్ అనే ఊరు ఉంది. ఈ ఊరు నుంచి ఒక కిలోమీటరు దూరంలో అత్యంత సుందరమైన చంద్రమౌలేశ్వర దేవాలయం ఉంది. చాలుక్యులు నిర్మించిన ఈ దేవాలయం దాదాపు 900 ఏళ్లకు పూర్వం నిర్మించినదని చెబుతారు.

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

P.C: YouTube


బాదామి, ఐహోలు దేవాలయాల వలే అత్యంత అరుదుగా లభించే రాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి గోపురం అనేదే ఉండదు. ఇలా ప్రాచీన కాలానికి చెంది గోపురం లేని దేవాలయం ఇది చంద్రమౌలేశ్వర దేవాలయం మాత్రమేనని పురావస్తుశాఖ అధికారులు కూడా చెబుతున్నారు.

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

P.C: YouTube

ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగిలిన దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయం విభిన్నమైనది. నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలతో సహా మొత్తం 12 ద్వారాలు ఉన్న దేవాలయం ఈ చంద్రమైలేశ్వర దేవాలయం.

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

P.C: YouTube

అంతేకాకుండా ఒక్క గర్భగుడిలోనే రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఒక శివలింగానికి నాలుగు ముఖాలు ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయాన్ని చతుర్ముకేశ్వర దేవాలయం అని అంటారు. ప్రతి శివలింగానికి ఎదురుగా రెండు నందులు ఉంటాయి.

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

P.C: YouTube


అదే విధంగా దేవాలయంలో నాలుగు దిక్కులకు ఉన్న నాలుగు ద్వారాల పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. 900 ఏళ్లనాటి ఈ దేవాలయంలో ఇప్పటికీ పూజలు జరుగుతుండటం విశేషం. ఈ దేవాలయానికి దగ్గరగా న`పతుంగ బెట్ట, నవరంగ తీర్థ, ఇందిరా గాంధీ గ్లాస్ హౌస్ లను కూడా చూడవచ్చు.

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

చంద్రమౌళేశ్వర దేవాలయం, హుబ్లీ

P.C: YouTube

ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 11 వరకూ అదే విధంగా సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకూ ఈ దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు.. బెంగళూరు నుంచి నిత్యం హుబ్లీకు బస్సు సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి ఈ దేవాలయానికి వెళ్లడానికి అనేక ఆటోలు అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+