Search
  • Follow NativePlanet
Share
» »చార్మినార్ - ఆసక్తికర విషయాలు !!

చార్మినార్ - ఆసక్తికర విషయాలు !!

చార్మినార్ వద్ద షాపింగ్ చాలా సందడిగా ఉంటుంది. ప్రతి సాయంత్రం, శని, ఆదివారాలు మరియు సెలవు దినాలలో ప్రజలు షాపింగ్ చేయటానికి ఇక్కడికి వస్తుంటారు.

By Mohammad

పర్యాటక ప్రదేశం : చార్మినార్
ప్రాంతం : హైదరాబాద్ - పాతబస్తీ
రాష్ట్రం : తెలంగాణ

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం. నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.

ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

నిర్మాణ శైలి

నిర్మాణ శైలి

చార్మినార్‌కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు.

చిత్రకృప : Yashwanthreddy.g

చారిత్రాత్మక కట్టడం

చారిత్రాత్మక కట్టడం

ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి.

చిత్రకృప : Ramnath Bhat

గ్యాలరీలు

గ్యాలరీలు

చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి.

చిత్రకృప : Vu2sga

ఆర్చ్ లు

ఆర్చ్ లు

ఆర్చ్‌ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి.

చిత్రకృప : Ramakrishna Reddy Y

బాల్కనీలు

బాల్కనీలు

ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి.

చిత్రకృప : Sujith Gopinath

మెట్లు

మెట్లు

మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి.

చిత్రకృప : Kartik Sirur

డోమ్ లు

డోమ్ లు

ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. మెదటి, రెండవ అంతస్తులలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి.

చిత్రకృప : Sujith Gopinath

నాలుగు మినార్లు

నాలుగు మినార్లు

ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి.

చిత్రకృప : Raju Neyyan

ప్లేగు వ్యాధి నివారణకు

ప్లేగు వ్యాధి నివారణకు

గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591 వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించాడు.

చిత్రకృప : GoDakshin

చార్మినార్ వద్ద షాపింగ్

చార్మినార్ వద్ద షాపింగ్

చార్మినార్ వద్ద షాపింగ్ చాలా సందడిగా ఉంటుంది. ప్రతి సాయంత్రం, శని, ఆదివారాలు మరియు సెలవు దినాలలో ప్రజలు షాపింగ్ చేయటానికి ఇక్కడికి వస్తుంటారు. బంగారు షాపులు, గాజుల షాపులు, బట్టల షాపులు ఇక్కడ ఎక్కువ. బేరమాడాలి సుమీ !! తినటానికి అనేక చిరుతిండ్లు ఇక్కడ దొరుకుతాయి. అయినప్పటికీ చాయ్, సమోసా ఇక్కడ ఫెమస్. ఇరానీ చాయ్ తప్పక తాగండీ.

చిత్రకృప : Debajyoti Das

ట్రై చేయండి

ట్రై చేయండి

చార్మినార్ వద్ద ప్రతి గళ్ళీలో అత్తరు సీసాలు, రుమాలు, పాన్ షాపులు ఉంటాయి. పండ్లు, చెఱుకు రసాలు తక్కువకే దొరుకుతాయి. ట్రై చేయండి. బిరియాని అంటే గుర్తుకొచ్చింది!! ఇక్కడ హోటల్ రుమాన్, శాలిబండ రోడ్ లో షాహ్ గౌస్ రెస్టారెంట్, విక్టోరియా రెస్టారెంట్, హోటల్ అర్మాన్, హోటల్ షాదాబ్ వంటి బిర్యాని రుచులను అందించే హోటళ్ళు అనేకం ఉన్నాయి.

చిత్రకృప : Mkamath1976

చార్మినార్ ఎలా చేరుకోవాలి ?

చార్మినార్ ఎలా చేరుకోవాలి ?

చార్మినార్ పాతబస్తీ లో కలదు. కనుక అఫ్జల్ గుంజ్ వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించి, అక్కడి నుండి ఆటోలో చార్మినార్ చేరుకోవచ్చు. ఎందుకంటే సిటీ బస్సులు ఎక్కువగా అఫ్జల్ గుంజ్ కు తిరుగుతాయి.

చిత్రకృప : Karthik Uppaladhadiam

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+