Search
  • Follow NativePlanet
Share
» »ఈ వేస‌విలో బిన్సార్ అందాల‌ను చూసేయండి..

ఈ వేస‌విలో బిన్సార్ అందాల‌ను చూసేయండి..

ఈ వేస‌విలో బిన్సార్ అందాల‌ను చూసేయండి..

ఈ మండేవేడి, ఉక్క‌పోతలకు చాలామంది ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఎక్క‌డికైనా చల్ల‌ని ప్రాంతాల‌కు వెళ్లాలని అనుకుంటుంటారు. వారికోసం ఉత్త‌రాఖండ్‌లోని బిన్సార్ ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. స‌హ‌జంగా ఉత్త‌రాఖండ్ అంటే చల్ల‌ని ప్ర‌దేశం. అందులోని బిన్సార్ ప్ర‌దేశం ఇంకా చ‌ల్ల‌గా ఉంటుంది. ఈ వేడి నుండి ఉప‌శ‌మ‌నం పొందాలంటే కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి బిన్సార్‌ను సంద‌ర్శించాల్సిందే. మ‌రెందుకాల‌స్యం బిన్సార్ విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

గర్వాలీ భాషలో బిన్సార్ అంటే నవ ప్రభాత్ లేదా కొత్త ఉదయం. బిన్సార్ అల్మోరా నుండి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా ప్రశాంతమైన మరియు అందమైన ప్రదేశం. దేవదార్ అడవులతో చుట్టుముట్టబడిన బిన్సార్ సముద్ర మట్టానికి సుమారు 2,200 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రశాంతమైన మరియు అందమైన వారాంతపు సెలవుల కోసం వెతుకుతున్న ప్రయాణికులకు బిన్సార్ సరైన గమ్యస్థానం. బిన్సార్‌లో హిమాలయ శిఖరాలు కేదార్‌నాథ్, చఖంబ, నందా దేవి, పంచోలి మరియు త్రిశూల్ వంటి ప్ర‌దేశాలు చాలానే మీకు క‌నిపిస్తాయి. ఈ వేస‌వి నుంచి త‌ప్పించుకోవాల‌నుకుంటే మాత్రం ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే.

binsarwildlifesanctuary

బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం దాదాపు 49.59 చద‌ర‌పు కిలోమీట‌ర్ల చుట్టూ వ్యాపించి ఉంది. ఈ అభ‌యార‌ణ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో వివిధ రకాల పక్షుల కిలకిలరావాలు వినొచ్చు. చిరుతపులి, గోరా, అడవి పిల్లి, ఎలుగుబంటి, నక్క, మొరిగే జింక మరియు కస్తూరి జింక వంటి అనేక ఇతర జంతువులు మరియు పక్షులు ఈ అభయారణ్యంలో చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఉత్తరాఖండ్ జాతీయ పక్షి మోనాల్‌ను కూడా చూడవచ్చు.

జీరో పాయింట్

కాలినడకన మాత్రమే బిన్సార్ అందాలను చూడగలం. జీరో పాయింట్ ఇక్క‌డ ఒక చూడ‌చక్క‌ని ప్ర‌దేశం. ఇక్కడ నుండి బిన్సార్ అందాలను మొత్తం వీక్షించేయొచ్చు. ఇక్క‌డి అందాల‌ను మీ కెమెరాల్లో బందించేయొచ్చు. ఈ ప్రాంతం చుట్టూ పచ్చదనం ఇక్క‌డికి వ‌చ్చేప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దృశ్యాలు చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటాయి.

golugoddesstemple

గోలు దేవత ఆలయం

బిన్సార్‌లో చూడదగ్గ ప్రదేశాలలో మరో ప్ర‌దేశం శివునికి అంకితం చేయబడిన గోలు దేవత ఆలయం. ఈ ఆల‌యాన్ని గంట దేవాల‌యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆల‌యంలో అనేక గంట‌లు వేలాడ‌దీయ‌బ‌డి ఉంటాయి. ఇక్క‌డికి వ‌చ్చే యాత్రికులు, భ‌క్తులు వారి కోర్కెలు తీర‌ని దేవుని ప్రార్థిస్తూ గంట‌ల‌ను క‌డుతుంటారు. ఇది ఇక్క‌డి ఆచారం. బిన్సార్ సంద‌ర్శించాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా ఈ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు.

ఎలా చేరుకోవాలి

డెహ్రాడూన్ నుండి బిన్సార్ వరకు దూరం 370 కిలోమీట‌ర్లు, నైనిటాల్ నుండి 95 కిలోమీట‌ర్లు, బిన్సార్‌కి సమీప రైల్వే స్టేషన్ కత్గోడం. కత్గోడం నుండి బిన్సార్ వరకు 105 కిలోమీట‌ర్ల దూరం ఉంది. కత్గోడం నుంచి ప్రభుత్వ బస్సు లేదా టాక్సీలో అల్మోరాకు వెళ్లాలి. అక్కడ నుండి బిన్సార్ వెళ్ళడానికి టాక్సీలు అందుబాటులో ఉంటాయి. అల్మోరా నుండి బిన్సార్ 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం పంత్‌నగర్. పంత్‌నగర్ నుండి బిన్సార్‌కి దూరం దాదాపు 140 కిలోమీట‌ర్లు ఉంది. బస్సు లేదా టాక్సీని బుక్ చేసుకుని బిన్సార్ చేరుకోవచ్చు. ఢిల్లీ నుండి కత్గోడం, అల్మోరాకు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎప్పుడు వెళ్లాలి?

ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు వేస‌వి ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. ఈ స‌మ‌యంలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్క‌డ‌ నుండి మీరు హిమాలయాల అందమైన దృశ్యాన్ని చూడొచ్చు. అంతేకాకుండా ఆ అద్భుత‌మైన దృశ్యాన్ని మీ కెమెరాలో కూడా బంధించవచ్చు. వేసవి కాలంలో ఇక్కడి అడవులను బురాన్ష్ పూలతో అలంకరిస్తారు. ఇది ఈ ప్రదేశానికి అందాన్ని చేకూరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+