Search
  • Follow NativePlanet
Share
» »అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ చల్లని ప్రదేశాలను చుట్టేయండి..!

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ చల్లని ప్రదేశాలను చుట్టేయండి..!

వేసవిలో మండే ఎండలు మరియు మండే వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు తరచుగా చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ప్ర‌ణాళిల‌కలు సిద్దం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి స‌మ‌యంలో వేసవి సెలవులను హాయిగా గడిపేందుకు అరుణాచల్ ప్రదేశ్ గొప్ప ప్రదేశంగా చెప్ప‌బ‌డుతుంది. ఇక్కడ స‌మ్మ‌ర్‌లో సందర్శించేందుకు అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఇవి ఉత్తమ ఎంపిక అని కూడా చెప్పుకోవ‌చ్చు. అరుణాచల్ ప్రదేశ్‌లో చూడదగిన ప్రదేశాల గురించి ఇప్ప‌డు తెలుసుకుందా.

ఈ ప్ర‌దేశాన్ని సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ చాలా అందమైన మరియు సుందరమైన ప్రదేశం. భార‌త‌దేశంలో సూర్యుడు ముందుగా ఉద‌యిందే ప్ర‌దేశం ఇదే. అందుకే దీనిని సూర్యోదయ భూమి అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రదేశం యొక్క అందం మరియు సంస్కృతికి ఎవ్వ‌రైనా ముగ్ధుల‌వ్వాల్సిందే. ప్రతి సంవత్సరం ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించేందుకు విదేశాల నుండి కూడా పర్యాటకులు త‌రలి వస్తుంటారు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత పగలు మరియు రాత్రి సమయంలో మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. అయితే, వేసవిలో మాత్రం ఇక్కడి దృశ్యాలు మ‌న‌సుకు చాలా ఉత్సాహంగా మరియు అందంగా అనిపిస్తాయి. వేసవి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం త‌ప్ప‌కుండా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే.

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ విహారంగా పేరుగాంచింది. ఈ మఠం తవాంగ్ వార్ మెమోరియల్‌గా స్థాపించబడింది. ఇది 40 అడుగుల నిర్మాణం. ఇది తవాంగ్ నది లోయలో ఉన్న ఒక చిన్న పట్టణ‌మైన తవాంగ్ సమీపంలో ఉంది. ఇది బౌద్ధ యాత్రికులు కాకుండా అన్ని తరగతుల ప్రజల దృష్టిని ఎంత‌గానో ఆకర్షిస్తుంది.

బామ్ లా పాస్

బామ్ లా పాస్‌ అరుణాచల్ ప్రదేశ్ మరియు టిబెట్‌లోని లహోఖా డివిజన్ మధ్య హిమాలయ పర్వతాల మ‌ధ్య ఉన్న పర్వత మార్గం. ఇది తవాంగ్ నగరానికి సుమారు 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 15200 అడుగుల ఎత్తులో ఉన్న చాలా సుందరమైన ప్రదేశం ఇది అని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్రదేశం త్రిభుజాకార కొండల మధ్య వెల‌సింది. ఇక్కడే టిబెట్ నుంచి వచ్చిన దలైలామా ఒకసారి ఆశ్రయం పొందిన‌ట్లు స‌మాచారం. ఇక్కడ అనేక బౌద్ధ విహారాలను కూడా మ‌నం చూడొచ్చు.

sengesterlake1

సెలా పాస్

సెలాపాస్‌ టిబెటన్ బౌద్ధమతంలో ఒక పవిత్ర యాత్రా స్థలంగా పేరుగాంచింది. ఇది పశ్చిమ కమెంగ్ జిల్లా మరియు తవాంగ్‌లను కలిపే ఏకైక మార్గం. ఇక్కడ 101 పవిత్ర సరస్సులు ఉన్నాయని బౌద్ధులు విశ్వ‌సిస్తారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఈ ప్రదేశం ఎంతో అందమైన ప్రదేశమ‌ని చెప్పొచ్చు.

nurangfalls1

నురంగ్ జలపాతం

నురంగ్ జలపాతాన్ని నూర్నాంగ్ వాటర్ ఫాల్ మరియు బాంగ్ బాంగ్ వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఇది మన దేశంలోని అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ నీరు 100 మీటర్ల ఎత్తు నుండి ప‌డ‌డాన్ని మ‌నం చూడొచ్చు. ఈ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

selapass1

సెంజెస్టర్ సరస్సు

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సెంజెస్ట‌ర్ స‌ర‌స్సు నిత్యం పర్యాటకుల మొదటి ఎంపికగా ఉంటుంది. ఈ స‌ర‌స్సును చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్స్‌కు ప్ర‌సిద్దిచెందింది. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ కూడా జరిగింది.

More News

    Read more about: arunachal pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+