Search
  • Follow NativePlanet
Share
» »వేసవిలో రాజస్థాన్‌లోని ఈ సరస్సులను ఓ లుక్కేయండి!

వేసవిలో రాజస్థాన్‌లోని ఈ సరస్సులను ఓ లుక్కేయండి!

వేసవిలో రాజస్థాన్‌లోని ఈ సరస్సులను ఓ లుక్కేయండి!

మండే వేడి నుండి ఉప‌శ‌మ‌నం పొందాల‌నుకుంటే చాలామంది ఉత్త‌రాఖండ్‌, హిమాచ్‌లప్ర‌దేశ్‌ల‌ను ఎక్కువగా సంద‌ర్శిస్తుంటారు. ఎందుకంటే, ఈ ప్రాంతాలు చ‌ల్ల‌ని ప్ర‌దేశాలకు కేరాఫ్ అ్ర‌డ‌స్ కాబ‌ట్టి చాలామంది ఇక్క‌డే ఉండాల‌నుకుంటారు. కానీ, భార‌త‌దేశంలో వీటితో పాటు చ‌ల్ల‌ని ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇంత వేడిలో రాజస్థాన్ లాంటి ప్ర‌దేశాలను సంద‌ర్శించాల‌ని ఎవ‌రూ అనుకోరు. ఎందుకంటే రాజస్థాన్‌లో వేస‌విలో ఇంకా వేడిగా ఉంటుంది.

కానీ, రాజ‌స్థాన్‌లోకూడా చల్ల‌ని ప్ర‌దేశాలు అవి కూడా సంద‌ర్శించేందుకు ఎంతో అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో జనాదరణ పొందిన సరస్సులు మండే వేడి నుండి ఉపశమనం అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మ‌రికొన్ని ప్రసిద్ధ మరియు అందమైన సరస్సులు కూడా ఉన్నాయి. రాజస్థాన్‌ కేవ‌లం రాజభవనాలు మరియు కోటలకు మాత్రమే ప్ర‌సిద్ధి చెందింది కాకుండా సరస్సులతో కూడా ఈ ప్రాంతం ఎంత‌గానో ప‌ర్యాట‌క ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.

lakepichola

లేక్ పిచోలా, ఉదయపూర్

పిచోలా సరస్సు రాజస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధ సరస్సులలో ఒకటి. ఈ సరస్సులో రెండు ద్వీపాలు ఉన్నాయి మరియు రెండింటిపై రాజభవనాలు నిర్మించబడ్డాయి. ఒకటి జగ్ నివాస్, ఇది ఇప్పుడు లేక్ ప్యాలెస్ హోటల్‌గా మార్చబడింది మరియు మరొకటి జగ్ మందిర్. ఆ రెండింటిని చేరుకోవాలంటే మాత్రం పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డున్న ఆరావళి కొండలు ఈ సరస్సు అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా, ఇక్కడ నుండి సిటీ ప్యాలెస్ యొక్క అద్భుతమైన అందాల‌ను వీక్షించ‌వచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి త‌ర‌లి వస్తుంటారు.

fatehsagarlake

ఫతే సాగర్ లేక్, ఉదయపూర్

ఫతే సాగర్ సరస్సు ఉదయపూర్‌లో సందర్శించడానికి చాలా ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ కాలానుగుణంగా ఫ్లవర్ షోలు నిర్వహించబడతాయి. ఈ ఫ్ల‌వ‌ర్ షోలను చూసేందుకు ఎంతో స‌రాదాగా ఉంటాయి. వీటిని చూసేందుకు ప‌ర్యాట‌కులు ఎప్పుడూ త‌ర‌లివ‌స్తుంటారు. ఈ వేస‌విలో ఫ‌తేసాగ‌ర్ లేక్ ప్రాంతం ఎంతో చ‌ల్ల‌గా ఉంటుంది. ఫతేపూర్ సాగర్ ఒడ్డున నిర్మించిన పార్కు విహారయాత్రకు ఎంతో అనువుగా ఉంటుంది. కుటుంబంతో పాటు, స్నేహితుల‌తో క‌లిసి ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చు. స్ట్రీట్ ఫుడ్, బోటింగ్, వాటర్ అడ్వెంచర్ రైడ్ లేదా ఒంటె రైడ్‌ను కూడా ఇక్క‌డ ఆనందించవచ్చు.

nakkilake

నక్కి సరస్సు, మౌంట్ అబూ

ఉరుకుల ప‌రుగుల ఈ జీవితంలో ప్ర‌శాంత‌త‌, విశ్రాంతిని కోరుకునేవారు త‌ప్ప‌కుండా మౌంట్ అబూలోని న‌క్కి స‌ర‌స్సును సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే ఈ స‌ర‌స్సు ప్ర‌కృతి మ‌ధ్య‌లో ఉంటుంది. చుట్టూ పూల‌తోట‌లు ఇక్క‌డికొచ్చే ప‌ర్యాట‌కుల‌ను మ‌న‌సుల‌ను దోచేస్తుంది. ఈ సరస్సు సమీపంలో ఒక తోట కూడా ఉంది. ఈ తోట‌లో మీరు వాకింగ్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఇది పిక్నిక్ ఎంతో అనువైన ప్ర‌దేశం అనే చెప్పుకోవాలి. ఈ న‌క్కి స‌ర‌స్సులో బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ స‌ర‌స్సుకు స‌మీపంలో కొన్ని స్థానిక దుకాణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్క‌డ కొన్నిహోట‌ల్స్ కూడా ఉన్నాయి. ఆ హోట‌ల్స్‌లో రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

anasagarlake

అనసాగర్ లేక్, అజ్మీర్

అనసాగర్ స‌ర‌స్సు అజ్మీర్‌లోని ఒక కృత్రిమ సరస్సు. వేసవిలో అనసాగర్ సరస్సు ఎండిపోతుంది. కానీ ఇప్పటికీ సూర్యాస్తమయం సమయంలో దాని దృశ్యం చూడదగినది. ఈ దృశ్యం ప‌ర్యాట‌క ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటుంది. ఈ సరస్సు సమీపంలో నిర్మించిన కొన్ని దేవాలయాల నుండి సరస్సు యొక్క దృశ్యం కూడా చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఈ సరస్సు అజ్మీర్‌లో అత్యంత ప్రసిద్ధి చెందినది మరియు భారతదేశంలోని అతిపెద్ద సరస్సులలో ఇది ఒకటి. ఈ స‌ర‌స్సు చుట్టూ ఎక్కువ‌గా దేవాల‌యాలు ఉండ‌డంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా పేరుగాంచింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+