Search
  • Follow NativePlanet
Share
» »విజ‌య‌వాడ క‌న‌కదుర్గ‌మ్మ ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు..!

విజ‌య‌వాడ క‌న‌కదుర్గ‌మ్మ ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు కొద‌వే లేదు. ఇక‌, తిరుప‌తిలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం. అలాగే, శ్రీ‌శైలం మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యం.. విజ‌య‌వాడ అన‌గానే క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం అంద‌రికీ గుర్తొస్తోంది. అయితే, ఈ వేస‌వి సెల‌వుల్లో చాలామంది స‌ర‌దాగా విహర‌యాత్ర‌ల‌కు ప్లాన్ చేస్తుంటారు. కానీ, మ‌రికొంద‌రేమో స‌మీపంలోని పుణ్య‌క్షేత్రాల ద‌ర్శనానికి వెళ్తుంటారు. ఇక‌, ఈ వీకెండ్‌లో మాత్రం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయింది. ఇక్క‌డ ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన అమ్మ‌వారికి ఎంతో చ‌రిత్ర ఉంది. ఎన్నో పురాణ‌గాథ‌లు ఉన్నాయి.

భ‌క్తుల కోరిక‌లు తీర్చే క‌ల్ప‌వ‌ల్లిగా ఇక్క‌డ అమ్మ‌వారు వెలిసారు. ఈ ఆల‌యంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభ‌వంగా జ‌రుగుతాయి. ఆ తొమ్మిది రోజులు విజ‌య‌వాడ మొత్తం క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఆ స‌మ‌యంలో ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఇత‌ర పండుగ రోజుల్లో కూడా ఇక్క‌డ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అలాగే, ఆ స‌మ‌యాల్లో అమ్మవారి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

అయితే, ఇప్పుడు సెలవు రోజుల్లో కావ‌డంతో అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పొటెత్తుతున్నారు. గత శుక్ర, శని, ఆదివారాల్లో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విప‌రీతంగా పెరిగింద‌ని ఆల‌య అధికారులు తెలిపారు. ఆ స‌మ‌యాల్లో అమ్మవారి దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా మూడు రోజుల్లోనే భారీ ఆదాయం సమకూరింద‌ని అధికారులు అంటున్నారు.

kanakadurgammatemple

వీకెండ్‌లో విప‌రీత‌మైన ర‌ద్దీ...

క‌నకదుర్గ‌మ్మను ద‌ర్శనం భాగ్యం కోసం ఒక్క ఏపీనుంచే కాదు.. తెలంగాణ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుంచి కూడా ప్ర‌జ‌లు వ‌స్తుంటారు. ఈ ఆలయానికి అంతటి విశేష‌త ఉంది. ఇక‌, నిన్న ఆదివారం కావ‌డంతో ఒక్క‌రోజే ఆల‌యానికి భారీ ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఒక్క‌రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు వివ‌రించారు. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు మొక్కుల రూపంలో అమ్మ‌వారికి త‌మ కానుక‌లు స‌మర్పించుకుంటారు. ఇక‌, వీకెండ్ కావ‌డంతో అమ్మ‌వారి ఆలయానికి గ‌త మూడు రోజులుగా భ‌క్తుల ర‌ద్దీ పెరిగింద‌ని ఆల‌య ఈవో రామారావు పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం...

ఆదివారం ఒక్కరోజే అమ్మవారి హుండి ఆదాయం రికార్డు స్థాయిలో రూ.46.15లక్షలు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక‌, మే నెల‌లో వ‌రుస‌గా అమ్మ‌వారి ఆల‌య ఆదాయం పెరుగుతూ వ‌స్తోంది. మే 24వ తేదిన రూ. 42.05 లక్షలు ఆదాయం రాగా, మే 25 వ తేదిన రూ.32.43 లక్షలు రావడం విశేషంగా నిలించింది. వీకెండో కావ‌డంతో భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఆదివారం ఆదాయం విషయానికి వస్తే.. రూ.500 టిక్కెట్ల ద్వారా రూ.13లక్షల 500 ఆదాయం వ‌చ్చింది.

kanakadurgammatemple

అలాగే, రూ.300 టికెట్ల ద్వారా రూ.5 లక్షల 23వేల800, రూ.100 టికెట్ల ద్వారా రూ.8 లక్షల 47వేల 800 ఆదాయం సమకూరిన‌ట్లు ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌లు పేర్కొన్నారు. ఈ ఆల‌యంలో అమ్మ‌వారి ప్రసాదం ల‌డ్డు, పులిహోర ఎంతో ఫేమ‌స్‌.. లడ్డూ ప్రసాదం ద్వారా కూడా భారీ ఆదాయం స‌మ‌కూరింద‌ని అధికారులు అంటున్నారు. ఒక్క ల‌డ్డు ప్ర‌సాదంతోనే రూ.61వేల 575, ఆదాయం రాగా, పులిహోర ప్రసాదం ద్వారా రూ.32వేల 490 ఆదాయం వచ్చింది.

More News

    Read more about: vijayawada andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+