Search
  • Follow NativePlanet
Share
» »జైనులు నడిపే హిందూ టెంపుల్ !

జైనులు నడిపే హిందూ టెంపుల్ !

ధర్మస్ధల ప్రదేశానికి చారిత్రాత్మక మరియు మతపర విశేషతలున్నాయి. ఈ ప్రదేశం పడమటి కనుమల మధ్యలో నేత్రావతి నదీ తీరంలో ప్రశాంతవాతావరణంలో ఒక గ్రామం కలదు. ఈ గ్రామంలో ఒక మంజునాధేశ్వర దేవాలయం ఉంది. మంజునాధేశ్వరుడు అంటే శివ భగవానుడే. ఈ దేవాలయం దాని బంగారు లింగానికి ప్రసిద్ధి.

దేవాలయం గురించి చెప్పాలంటే.... మతపర సహనానికి ధర్మస్ధల ప్రదేశాన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెపుతారు. ఈ దేవాలయం దాని పురాతన కట్టడాలకు మాత్రమే కాదు మతపర సహనానికి కూడా ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని జైన మతస్ధులు నడుపుతారు. కాని ప్రతిరోజూ ఆ దేవాలయంలోని దేవునికి పూజలు మాత్రం హిందూ పూజారులు చేస్తారు. ఈ గ్రామంలోని ఇతర ఆకర్షణలలో ఎనిమిది మంది జైన మందిరాలు మరియు 11 మీటర్ల ఎత్తున్న బాహుబలి విగ్రహం కూడా కనపడతాయి. ఈ విగ్రహాన్ని 175 టన్నుల బరువుకల ఒకే రాతితో నిర్మించారు.

పురాతన గ్రంధాలు

పురాతన గ్రంధాలు

ధర్మస్ధల పట్టణం అనేక పురాతన మత గ్రంధాలకు కూడా నిలయంగా ఉంటుంది. పురావస్తు శాఖ వారు ఈ పురాతన గ్రంధాలను ఈ ప్రదేశంనుండి సేకరించి ఒక మ్యూజియంలో భద్రపరచారు. ఇక్కడే ఒక అద్భుతమైన కార్ల మ్యూజియం కూడా ఉంది. దానిలోని పురాతన కార్లు, కార్లను ఇష్టపడేవారికి ఎంతో ఆకర్షణగా కూడా ఉంటాయి.

బాహుబలి విగ్రహం

బాహుబలి విగ్రహం

ధర్మస్ధలలో బాహుబలి విగ్రహం తప్పక చూడవలసిన ఆకర్షణలలో ఒకటి. ఇది రత్నగిరి కొండపై ఉంది. ఈ విగ్రహం సుమారు 39 అడుగుల పొడవు ఉంది. దీనిని 1973 సంవత్సరంలో రంజనా గోపాల్ క్రిష్ణ షెనాయ్ రూపొందించారు. 1982 ఫిబ్రవరిలో ఈ విగ్రహాన్ని దేవాలయంలోపల వీరేంద్ర హెగ్డే ప్రతిష్ట చేయించారు.

త్యాగానికి ప్రతీక

త్యాగానికి ప్రతీక

నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు. ప్రజలలో కల కధనం మేరకు బాహుబలి మరియు భరత (అతడి పెద్ద సోదరుడు) ఇరువురూ రాజకుమారులు. తమ ఆధిపత్యం కొరకు ఒకరితో మరి ఒకరు పోరాడుతారు. పోరాటంలో గెలిచిన బాహుబలి తన తమ్ముడిని క్షమించి వదిలేస్తాడు. ఇదే సమయంలో యుద్ధం, చంపుకొనటం వంటివి ప్రయోజనంలేనివిగా గుర్తిస్తాడు. వెంటనే తన రాజ్యాన్ని తమ్ముడు భరతుడికి అప్పగించి దిగంబర జైన మతంలో చేరతాడు. మోక్షానికి మార్గం కోరుతూ బాహుబలి తనకు దివ్యత్వం చేకూరే వరకు దిగంబరంగా ఉండిపోతాడు.

రత్నగిరి కొండలు

రత్నగిరి కొండలు

ఈ ప్రదేశం చేరటానికి పర్యాటకులు రత్నగిరి కొండలు షుమారు 20 నిమిషాలపాటు మెట్లు ఎక్కాలి. కనుక పర్యాటకులు ఉదయం వేళ మాత్రమే ఈ ప్రదేశాన్ని చేరి ానందించాలని చెపుతారు. కొండపైన తాగునీరు వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం సందర్శించేవారు ఉదయం 8 గంటలనుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటలకు మాత్రమే అక్కడి విగ్రహ దర్శనం పొందగలరు.

ధర్మస్ధల దేవాలయం

ధర్మస్ధల దేవాలయం

ధర్మస్ధల సందర్శించే యాత్రికులు రత్నగిరి కొండకు పడమటి భాగాన గల ధర్మస్ధల దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రిందట, జైనుల మతగురువు బ్రిమన్న పెర్గాడెం నిర్మించారు. ధర్మస్ధల దేవాలయంలో శివ భగవానుడి బంగారు లింగం ఉంది. శివ భగవానుడి అవతారమే శ్రీ మంజునాధేశ్వర అన్నప్ప స్వామిగా చెపుతారు. ఈ దేవాలయంలో ఈయన ప్రధాన దైవం. ఈ యాత్రా స్ధలంలోని లింగం మంగుళూరుకు సమీపంలోని కద్రి నుండి తీసుకొనబడింది.

శ్రీ మహావిష్ణువు అవతారం

శ్రీ మహావిష్ణువు అవతారం

ఈ ప్రదేశం చేరగానే ప్రయాణీకులు లింగం పక్కనే ఉన్న నరసింహ సాలిగ్రామ అంటే శ్రీ మహావిష్ణువు అవతారం ను దర్శిస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మహా గణపతి, అమ్మవారు అమ్మనవారు లేదా పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయంలో నలుగురు ధర్మ దైవ విగ్రహాలు (ఆత్మల ధర్మాలను సంరక్షించేవి) అంటే కన్యకుమారి, కళార్ కయి, కాలరాహు, మరియు కుమారస్వామి కూడా ఉంటాయి.

చెక్కతో నిర్మాణాలు

చెక్కతో నిర్మాణాలు

కేరళలోని ఇతర దేవాలయాలలో వలే, ధర్మస్ధల దేవాలయం లోపల కూడా చెక్కతో నిర్మాణాలు చేశారు. ఇక్కడి విశేషత అంటే ఈ దేవాలయం జైనులచే నిర్వహించబడుతుంది. హిందూ మధ్వ పూజారులచే పూజలు నిర్వహించబడతాయి. భక్తులు ధర్మస్ధల దేవాలయాన్ని ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు దర్శించవచ్చు.

ధర్మ దేవతలు

ధర్మ దేవతలు

ధర్మస్ధల వెళ్ళే యాత్రికులు అన్నప్ప బెట్ట కూడా చూడవచ్చు. దీనినే బడినేడి బెట్ట అని కూడా అంటారు. ఇది ధర్మస్ధలలో ఒక కొండ. ఇక్కడ ధర్మ దేవతల నాలుగు మందిరాలుంటాయి. ఈ మందిరాలను చేరగానే యాత్రికులకు వాటిలో దేవతా విగ్రహాలు కనపడవు. ప్రధానంగా ఈ ప్రదేశానికి పిల్లలు, మరియు మహిళలు అనుమతించబడరు. ప్రజల కధనం మేరకు జైనుల కుటుంబాల సాంఘిక సేవలకు మెచ్చి అన్నప్ప బెట్ట ను నలుగురు ధర్మ దేవతలు అక్కడకు వచ్చారని చెపుతారు.

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

ధర్మస్ధల బెంగుళూరుకు సుమారు 300 కి.మీ. ల దూరంలో ఉంది. ప్రయాణం తేలిక. ఉడుపి నుండి ధర్మస్ధల పట్టణం 100 కి.మీ.లు కాగా మంగుళూరు నుండి సుమారు 76 కి.మీ. ల దూరం ఉంటుంది. బెంగుళూరు నుండి ధర్మస్ధలకు షుమారు 6 గంటల సమయంలో ప్రయాణించవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+