Search
  • Follow NativePlanet
Share
» »గుజరాత్‌లోని ధోర్డో గ్రామానికి ప్ర‌పంచ గుర్తింపు..

గుజరాత్‌లోని ధోర్డో గ్రామానికి ప్ర‌పంచ గుర్తింపు..

గుజరాత్‌లోని ధోర్డో గ్రామానికి ప్ర‌పంచ గుర్తింపు..

గుజరాత్‌లోని కచ్‌ ధోర్డో గ్రామాన్ని ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ ఉత్తమ ప‌ర్యాట‌క గ్రామంగా గుర్తించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ధోర్డో గ్రామం ఐక్యరాజ్య సమితి నుంచి బిరుదును పొందింది. కచ్‌, భుజ్ జిల్లాలకు చెందిన ధోర్డో గ్రామం గుజరాత్‌లోని సామాజిక, సాంస్కృతిక సంప్రదాయాల‌ను ప్రతిబింబిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలోని 54 ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ధోర్డో ఎంపికైంది. ఈ గ్రామం వెయ్యి మంది జనాభాను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ గ్రామం భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు ముందు ఉంటుంది ఇదే దీని ప్ర‌త్యేక‌త‌.

dhordo , rann utsav

260 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి...

ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ గుజరాత్‌లోని ఈ గ్రామాన్ని ప్రపంచంలోని 54 గ్రామాలలో ఒకటిగా పేర్కొంది. తెల్ల ఉప్పు కారణంగా, ఎడారిలో ఉన్న ఈ గ్రామం శీతాకాలంలో మరింత తెల్లగా కనిపిస్తుంది. ఈ పల్లెటూరి అందాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప‌రిచ‌యం చేశారు. అంతే కాదు, ప్రతి సంవత్సరం ఇక్కడ రణ్ ఉత్సవ్ కూడా జరుగుతుంది. అక్టోబ‌ర్ 16 నుంచి 20 వ‌ర‌కు ఉజ్జెకిస్తాన్‌లోని స‌మ‌ర్‌కండ్‌లో జ‌రిగిన యునైటెడ్ నేష‌న్స్ వ‌ర‌ల్డ్ టూరిజం ఆర్గ‌నైజేష‌న్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీకి ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామం కోసం 260 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

ఇందులో 54 గ్రామాల‌ను ఎంపిక చేశారు. భార‌త‌దేశంలో ఈ బిరుదు పొందిన ఏకైక గ్రామం గుజ‌రాత్‌లోని థోర్డో గ్రామం. యునైటెడ్ నేష‌న్స్ వ‌ర‌ల్డ్ టూరిజం ఆర్గ‌నైజేష‌న్ 2021 సంవ‌త్స‌రం నుంచి ప‌ర్యాట‌క గ్రామాల ఎంపిక‌ను ప్రారంభించింది. స‌హ‌జ సాంస్కృతిక వ‌న‌రుల‌ను ప్రోత్స‌హించ‌డం, ప‌రిర‌క్షించడం, గ్రామ స్థిర‌మైన ఆర్థిక న‌మూనా, సామాజిక ప‌ర్యావ‌ర‌ణ స్థిర‌త్వం, సాంస్కృతిక వైవిధ్యం, స్థానిక‌విలువ‌లు, సాంప్ర‌దాయ ఆహారం కోసం ఇటువంటి గ్రామాల‌ను ఎంపిక‌చేయ‌డం జ‌రుగుతుంది.

dhordo festival

గ్రామంలో జనాభా చాలా తక్కువ

ధోర్డో గ్రామంలో జ‌నాభా చాలా తక్కువగా ఉంటారు. ఈ విష‌యం గుజరాత్‌లోని కొంతమందికి మాత్రమే తెలుసు. అస‌లు ఈ గ్రామం గురించే చాలామందికి తెలియ‌దు. అయితే ఈ గ్రామంలో జ‌రిగే ర‌న్ ఉత్స‌వ్ సంద‌ర్భంగా ధోర్డో గుర్తింపు పొందింది. కచ్ జిల్లా ఉత్తర భాగంలో ఉన్న బని ప్రాంతంలోని చివరి గ్రామం ఇదే. ధోర్డో గ్రామం ఇండో-పాక్ సరిహద్దులో ఉంటుంది. ఈ గ్రామంలో పాత గుండ్రని ఇళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. వీటిని చూసేందుకు ప‌ర్యాట‌కులు ఇష్ట‌ప‌డుతుంటారు.

రణ్ ఉత్సవ్...

బెస్ట్ విలేజ్ టైటిల్ గెలుచుకున్న ఘనత మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంద‌ని గ్రామ‌స్థులు అంటున్నారు. గ్రామానికి చెందిన గుల్బేగ్ మియాన్‌కు కూడా ఇందులో కీల‌క పాత్ర పోషించారు. గ్రామంలో రణ్ ఉత్సవ్ నిర్వహించాలని కలలు కన్న వ్యక్తి ఇదే విషయాన్ని ఆయన కుమారుడు మియాన్ హుస్సేన్ సీఎం నరేంద్ర మోదీకి తెలియజేశారు. ఆ సమయంలో మోదీ ఈ సూచనను అమలు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి 2006లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు క‌చ్ ర‌ణోత్స‌వాన్ని ప్రారంభించారు. వైట్ రాన్ ఆఫ్ క‌చ్‌లోని ధోర్డో క‌ళ సంస్కృతి, ప్ర‌కృతి సౌంద‌ర్యం, ప‌ర్యాట‌క ప్ర‌దేశాన్ని ప్ర‌పంచం ముందుకు తీసుకురావాల‌నేది మోడీ విజ‌న్‌. క‌చ్‌లోని ధోర్డోను గొప్ప సాంస్కృతిక వార‌సత్వంగా అభివ‌ర్ణిచారు ప్ర‌ధాని మోడీ.

30 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది...

మూడు దశాబ్దాల క్రితమే ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు గుల్బేగ్ మియాన్ ఎంతో కృషి చేశారు. 90వ దశకంలో ఇక్కడ చిన్న చిన్న పండుగలు జరిగేవి. ఈ గ్రామంలోని జనాభా ఇప్పటికీ 1000 కంటే తక్కువగా ఉండ‌టం విశేషం. కానీ రన్ ఉత్సవ్ సమయంలో మాత్రం ఇక్కడ ఒక డేరా నగరాన్ని నిర్మించుకుని, శీతాకాలంలో ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ఎంతో అనుభూతిని పొందుతారు.

More News

Read more about: kutch dhordo gujarat ran utsav
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+