Search
  • Follow NativePlanet
Share
» »విశాఖలోని విలాసవంతమైన టాప్‌ 5-స్టార్ హోటల్ గురించి మీకు తెలుసా?!

విశాఖలోని విలాసవంతమైన టాప్‌ 5-స్టార్ హోటల్ గురించి మీకు తెలుసా?!

ప‌ర్యాట‌క న‌గ‌రం విశాఖ సిటీలో వేసే ప్ర‌తి అడుగులోనూ ఓ స‌రికొత్త అనుభ‌వం మ‌న‌కు ప‌రిచ‌యమ‌వుతుంది. ఇక్క‌డ ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అద్భుతమైన వ్యూ పాయింట్స్‌తో విలాస‌వంత‌మైన విడిది కేంద్రాలు చాలానే ఉన్నాయి. వీరు అందించే సేవ‌లు లగ్జ‌రీ లైఫ్‌కు కారాఫ్ అడ్ర‌స్‌గా అనిపిస్తాయి. మీరు కూడా విశాఖ న‌గ‌రంలోని విలాస‌వంత‌మైన ప్ర‌దేశాల్లో విడిది చేయాల‌నుకుంటే సిటీలోని టాప్ 5-స్టార్ హోట‌ల్స్ గురించిన పూర్తి వివ‌రాలు ఇక్క‌డ తెలుసుకుందాం!

novotel Visakhapatnam

నోవోటెల్, వరుణ్ బీచ్

విశాఖపట్నం నోవోటెల్ వరుణ్ బీచ్ 5-స్టార్ హోట‌ల్ ఆర్‌కే బీచ్ అందాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసే క్ష‌ణాల‌ను చేర‌వ చేస్తుంది. ఇక్క‌డి విలాసవంతమైన అల్పాహారం, బఫేతో పాటు ఇన్ఫినిటీ పూల్‌లో స్నానం చేస్తూ.. ల‌గ్జ‌రీ లైఫ్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. రైల్వే స్టేషన్, రుషికొండ బీచ్, వైజాగ్ పోర్ట్ నుంచి సమీపంలో సౌకర్యవంతంగా ఉన్న ఈ హోటల్ సబ్‌మెరైన్ మ్యూజియమ్‌కు సమీపంలో ఉంది. INOX మల్టీప్లెక్స్, నైట్‌క్లబ్, షాపింగ్ మాల్‌తో కూడిన కాంప్లెక్స్ అద‌న‌పు ఆహ్లాదాన్ని అందిస్తాయి. నోవోటెల్ ప్రతి మూల నుండి సముద్ర వీక్షణలను అందిస్తుంది.

గేట్‌వే హోటల్

గేట్‌వే హోట‌ల్‌.. విశాఖపట్నంలోని తీర‌ప్రాంత‌పు అందాల‌ను అద్భుతమైన వ్యూలో చూస్తూ.. మరపురాని విలాసవంతమైన అనుభవాన్ని అందించే 5-స్టార్‌ హోటల్. బిజినెస్ ట్రావెల‌ర్స్‌తోపాటు ప్ర‌శాంత‌త‌ను కోరుకునే వారి కోసం గేట్ వే హోట‌ల్ స‌రైన ఎంపిక‌. ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాకు అందుబాటు దూరంలో ఉన్న ఈ హోటల్ వ్యాపార‌వేత్త‌లు విడిదికి అనువుగా ఉంటుంది. ఇక్క‌డి హోట‌ల్ గదుల కిటికీల గుండా మీరు స‌ముద్ర‌పు కెర‌టాల అందాల‌ను చూడొచ్చు. అంతేకాదు, ఇక్క‌డి రెస్టారెంట్‌ల‌లో టేస్టీ రుచుల‌ను కూడా ఆస్వాదించవచ్చు. లొప‌ల స్విమ్మింగ్‌ పూల్, ఫిట్‌నెస్ సెంటర్, స్టీమ్ రూమ్ ఇలా అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో ఉంటాయి.

sheraton hotel

ఫోర్ పాయింట్స్ బై షెర‌టాన్‌

విశాఖ‌లోని ఫోర్ పాయింట్స్ బై షెర‌టాన్ హోట‌ల్‌లో మీరు అధునాత‌న సౌక‌ర్యాల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు. ఇక్క‌డ సిబ్బంది మీకు అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తూ ఉంటారు. రెస్టారెంట్‌లో రుచికరమైన అంతర్జాతీయ వంటకాలను ఆస్వాదించవచ్చు. ఆర్‌కే బీచ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ 5-స్టార్ హోట‌ల్‌లో విడిది ఓ స‌రికొత్త అనుభూతిని అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్క‌డ ప్ర‌త్యేక గ్యాల‌రీలో ఉన్న లైబ్ర‌రీలో పుస్త‌కాల‌ను చ‌దువుతూ కాల‌క్షేపం చేయ‌వ‌చ్చు. లేదా, ఓజోనైజ్డ్ పూల్ హాయిగా స్నానం చేయ‌వ‌చ్చు. ఇందులో ఫిట్‌నెస్ సెంటర్ 24 గంట‌లూ అందుబాటులో ఉంటుంది.

bhimiliresort1

భీమిలి రిసార్ట్

విశాఖపట్నంలో పెంపుడు జంతువులతో స‌హా స‌ర‌ద‌గా గ‌డిపేందుకు అనుకూలమైన హోటల్ భీమిలి రిసార్ట్‌. ఇది అంతర్జాతీయ సేవా సౌకర్యాలతోపాటు స్థానిక లక్షణాలతో మిళితమై ఉంటుంది. ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో ఉన్న ఈ బీచ్ ఫేసింగ్ రిసార్ట్ ప‌ర్యాట‌క ప్రేమికుల‌కు, బిజినెస్ ట్రావెల‌ర్స్‌కు స‌రైన విడిది కేంద్రంగా చెప్పొచ్చు. ఇక్క‌డి విశాలమైన హోటల్ గదులు, సముద్రానికి అభిముఖంగా ఉండే బాల్కనీలు, సందర్శకులను నిస్సందేహంగా క్రూయిజ్ షిప్‌లో గ‌డిపిన అనుభూతిని అందిస్తాయి. ఈ రిసార్ట్‌లో బస చేసే సందర్శకులను తూర్పు తీరపు సముద్రం పైన సూర్యోదయం ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్న‌ట్లు అనిపిస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+