నవంబర్ మాసం వచ్చింది. ఈ సీజన్‌లో చాలామంది కొండ ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు. ఎందుకంటే ఇది మంచు సమయం. ఈ కాలంలో చాలామంది మంచుకొండల మీద ట్రెక్కింగ్ చేయాలని ఆశపడుతుంటారు. అటువంటివారికోసం మనదేశంలో సందర్శించేందుకు చాలా ప్రదేశాలే ఉన్నాయి. ఆ ప్రదేశాలలో స్నేహితులతో కలిసి సరదాగా గడపడమే కాదు. ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక, మంచు పర్వతాలపై ట్రెక్కింగ్ చేయడమంటే ఓ థ్రిల్లింగ్‌లా అనిపిస్తోంది. అనువంటి మధురానుభూతులను సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైన ప్రదేశం. సాహసప్రియులు ఎంతగానో ఇష్టపడే ప్రాంతం ఇది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది కేవలం సాహసం చేసేవారికి సాధ్యపడుతుంది. ఈ సీజన్‌లో ఇక్కడ సందర్శకుల రద్దీ బాగానే ఉంటుంది. అయితే, ఎక్కువ శాతం మంది శీతాకాలంలో ట్రెక్కింగ్ చేసేందుకు స్పితి వ్యాలీ వస్తుంటారు. ఈ స్పితి వ్యాలీలో క్యాంపింగ్ కూడా చేయొచ్చు. ఇంకా ఇక్కడ విడిది చేసేందుకు అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క పర్యాటకుడిని ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సంప్రదాయాలు కలిగిన పల్లెటూరి వాతావరణం, స్పితిలోని అందమైన లోయలు, మనోహరమైన గ్రామాలు, ఎత్తైన పర్వతాల మీదుగా ట్రెక్కింగ్ చేయడం ఎంతో సంతోషాన్నిస్తుంది.

చద్దార్, లద్దాఖ్...
లద్ధాఖ్ ప్రాంతం గురించి తెలియని పర్యాటకులు ఉండరు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటారు. బైక్ రైడర్స్‌కు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇది. ఇక్కడి అందమైన పరిసరాలు, సరస్సులు ప్రతి ఒక్క పర్యాటకుడిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంకా ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైనది. ఈ సీజన్‌లో లద్దాఖ్‌లోని జంస్కార్ నది గడ్డకట్టుకుపోతుంది. ఈ సమయంలో జంస్కార్ నదిపై నడుచకుంటూ వెళ్లితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. కానీ, ఇది ప్రమాదంతో కూడుకున్నది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూనే ఈ సాహాసం చేయాల్సి ఉంటుంది.

గోచాలా, సిక్కిం..
సిక్కింలోని అందమైన ప్రదేశాలలో గోచాలా ఒకటి. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కూడా ఎంతో అనువైనది. ఈ ట్రెక్కింగ్‌ను యుక్సోమ్ అనే పట్టణం నుండి మొదలెట్టొచ్చు. ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి సూర్యోదయం, సూర్యస్తమయం దృశ్యాలను చూడాల్సిందే. ఇక్కడి మంచుకొండల్లో ప్రయాణం కాస్త ప్రమాదకరమైన ఎంతో ఉల్లాసంగా సాగుతుంది.
హర్ కి దున్, ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రదేశం హర్ కి దున్. ఇది ఉత్తరకాశీ జిల్లాలో ఉంటుంది. ఈ సీజన్‌లో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతం సాహసప్రియులకు ఎంతో ఉత్తమమైనది. ట్రెక్కింగ్‌లో ఏమాత్రం అనుభవం లేని వారు కూడా ఇక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయాలంటే డిసెంబర్‌లోపే వెళ్లాలి. ఎందుకంటే, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక హిమపాతం ఉంటుంది. ఆ సమయంలో ట్రెక్కింగ్ చేసేందుకు వీలుపడదు. కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైనది.



Click it and Unblock the Notifications














