Search
  • Follow NativePlanet
Share
» »స్కూబా డైవింగ్ చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఈ ప్రాంతాలు బెస్ట్‌..!

స్కూబా డైవింగ్ చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఈ ప్రాంతాలు బెస్ట్‌..!

దేశంలో రుతుప‌వ‌నాల కార‌ణంగా కొన్నిరాష్ట్రాల్లో వ‌ర్షాలు దంచికొడుతుంటే మ‌రికొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర‌మైన ఎండ‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల తేమ, కొన్ని చోట్ల ఉక్కపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటువంటి తీవ్రమైన వేడి నుండి తప్పించుకోవడానికి చాలామంది పర్వతాలు, వాటర్ స్పోర్ట్స్, సముద్రతీర నగరాలను సంద‌ర్శిస్తుంటారు. మీరు కూడా ఇలాంటి సాహస కార్యకలాపాలను ఇష్టపడేవారైతే దేశంలోని ఈ ప్రాంతాల‌ను వీక్షించాల్సిందే. ఎందుకంటే ఈ ప్ర‌దేశాలు స్కూబా డైవింగ్‌కు ఎంతో అనువైన‌వి.

లక్షద్వీప్

భారతదేశంలో స్కూబా డైవింగ్‌కు ఉత్తమమైనదిగా పరిగణించబడే ప్రదేశాలలో ల‌క్ష‌ద్వీప్ పేరు ముందువ‌రుస‌లో ఉంటుంది. ప్రకృతి సౌందర్యంతో కూడిన లక్షద్వీప్ ద్వీపం స్కూబా డైవింగ్‌కు ఎంతో అనువైన ప్రదేశం .లక్షద్వీప్‌లోకి ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉంటాయి. ఇక్క‌డ నేటికి ఎలాంటి కమ్యూనికేషన్ సాధనాలు ఉండ‌వు. పగడపు దిబ్బలు మరియు నీటి అడుగున గుహలు ఈ ప్రదేశం యొక్క అతిపెద్ద విశిష్టతలు. లక్షద్వీప్‌లోని బంగారం ద్వీపం, కద్మత్ ద్వీపం మరియు అగట్టి ద్వీపం స్కూబా డైవింగ్‌కు ఎంతో అనువైన ప్ర‌దేశాలు.

scuba diving But these areas are the best

అండమాన్

స్కూబా డైవింగ్ కోసం ఉత్తమ స్థలాల అన్వేషణలో రెండో స్థానంలో అండమాన్ ఉంటుంది. అండమాన్ బీచ్ లైఫ్ కారణంగా పర్యాటకులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అండమాన్ లోని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఈత తెలియ‌ని వారు ఎవ‌రైనా స‌రే ఇక్క‌డ స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించవచ్చు. షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ వంటి అనేక ద్వీపాలు ఇక్క‌డ ఎంతో ప్ర‌సిద్ధిచెందాయి. ఇక్కడ ప‌ర్యాట‌కులు స్కూబా డైవింగ్, సముద్ర నడక వంటివి కూడా చేయొచ్చు.

గోవా

వాట‌ర్ స్పోర్ట్స్ గురించి మాట్లాడిన‌ట్లయితే అందులో గోవా ప్రస్తావన లేక‌పోవ‌డమంటూ జ‌ర‌గ‌దు. నీటి కార్య‌క‌ల‌పాల‌కు గోవా ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డ అనేక రకాల నీటి కార్యకలాపాలు చేయడానికి పర్యాటకులు గోవాకు వెళుతుంటారు. అయితే స్కూబా డైవింగ్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వేడి నుండి తప్పించుకోవడానికి, గోవాలోని గ్రాండే ఐలాండ్, బ్యాట్ ఐలాండ్, సుజీ ద్వీపం వంటివి ఎంతో పేరుగాంచాయి. స్పష్టమైన నీటిలో స్కూబా డైవింగ్ చేయగల ప్రదేశాలు కూడా ఇవే. అయితే రుతుపవనాల వర్షం కారణంగా గోవాలో స్కూబా డైవింగ్ వంటి కార్య‌క‌ల‌పాల నిర్వ‌హ‌ణ గురించి ముందుగా తెలుసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

scuba diving But these areas are the best

నేత్రాని ద్వీపం, కర్ణాటక

కర్నాటకలోని నేత్రాని ద్వీపం స్కూబా డైవింగ్ ఎంతో పేరుగాంచింది. ఇది స్కూబా డైవింగ్ ప్యారడైజ్ అని పిలువబడే కొన్ని ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ దీవిని పెంగ్విన్ ఐలాండ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్క‌డ పగడపు దిబ్బలు, నీటి అడుగున రాతి నిర్మాణాలు, సముద్ర జీవవైవిధ్యాన్ని అనుభవించేందుకు ప్రజలు తరచుగా ఇక్కడకు వ‌స్తుంటారు. వేసవి కాలంలో ఈ బీచ్‌లో కొన్నిసార్లు తిమింగలాలు, సొరచేపలు తార‌స‌ప‌డుతుంటాయి. ఇది స్కూబా డైవర్‌లకు బోనస్ పాయింట్‌గా ఉంటుందనే చెప్పుకోవాలి.

పుదుచ్చేరి

అద్భుతమైన బీచ్‌ల కారణంగా పుదుచ్చేరి పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా నిలిచింది. ఇక్క‌డ అనేక‌ నీటి కార్యకలాపాలు కూడా జ‌రుగుతాయి. టెంపుల్ రీఫ్, అరవింద్ వాల్, కూల్ షార్క్ రీఫ్ మొదలైన ప్రదేశాలు స్కూబా డైవింగ్‌కు ఉత్తమమైనవిగా చెప్పుకోవ‌చ్చు. ఈ ప్రదేశాలలో ముదురు రంగుల పగడపు దిబ్బలు, రంగురంగుల చేపలు మరియు ఓడ శిథిలాలను కూడా వీక్షించొచ్చు. మ‌రెందుకాల‌స్యం ఈ అంద‌మైన ప్ర‌దేశాల‌లో స్కూబా డైవింగ్ చేసేయండి..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+